వ్యక్తిత్వ వికాసం

" ఈ అనంతవిశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు ఇదివరకు లేరు అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్చమైన, అరుదైన వారు. మీలోని ఆ ప్రత్యేకతను ఆనందమయంగా అనుభవించండి."

- శ్రీ శ్రీ

మీ మనోహరమైన ఉనికిని మరొక్కసారి వెలికితీద్దాం!

ఒక చంటి పాపను చూస్తే మనమందరము ఎంతగా ఆనందిస్తామో ఒక సారి గుర్తుకు తెచ్చుకుందాం! ఆ చంటి పాప ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే మనందరినీ ఆనందపరుస్తుంది. ఈ అనుభూతి ఎటువంటి ప్రత్యేకమైన శ్రమలేకుండానే మనమందరము గమనించి ఉంటాము. మనము ఎదుటివారికి మాటలద్వారా కాకుండా మన ఉనికిద్వారానే మనయొక్క అనుభూతులను తెలియపరుస్తాము. కానీ మనము ఎదిగే కొద్దీ మనకు తెలియకుండానే ఈ విషయాలనుండి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనయొక్క లెక్కలేనన్ని పాత అనుభూతులతో మనయొక్క మనుసు మొద్దుబారి పోవటంతో మన ఉనికి మనకు తెలియకుండానే క్షీణించి పోవడం జరుగుతుంది.

ఇలాంటి సందర్భంలో మన యొక్క పూర్వ ఉనికిని, ఆ చంటి పిల్లలయొక్క మనస్తత్వమైనటువంటి ఆనందాన్ని, సహజతను మనం ఎలా వెనక్కి తీసుకు రాగలం!  సుదర్శన క్రియ లాంటి సులభమైన మరియు శక్తివంతమైన శ్వాస ప్రక్రియల ద్వారా ఇది సాధ్యపడుతుంది.ఈ ప్రక్రియలు మన శరీరంతోపాటు మరెన్నో స్థాయిలలో మనలో నిక్షిప్తమైఉన్న మనయొక్క ఉనికిని ఒత్తిడి మరియు పాత అనుభూతులనుండి బయటకు తీసుకు రాగల మార్గము.

మీరు విజయాన్ని ఎంత త్వరలో కావాలని కోరుకుంటున్నారు?

జీవితంలో మనమందరము విజయవంతంగా ఉండాలని కోరుకుంటాము.విలాసవంతమైన మరియు ఎంతో ధనవంతమైన జీవితమొక్కటే విజయవంతమైన జీవితము కాదుకదా! శారీరకమైన సమస్యలు ఉంటె మనము ఎంతటి ధనవంతులైతే మాత్రం ఏం ప్రయోజనం! ఈ సందర్భంలో విలాసాలను మరియు ధనాన్ని ఏం చేసుకోగలం? చాలా సందర్బాలలో మన జీవితంలో సగ భాగం సమయాన్ని ధనాన్ని సంపాదించేందుకు ఉపయోగిస్తే, మిగతా సగ భాగం సమయాన్నిఅదే ధనాన్ని ఖర్చు పెట్టి మనము కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేదుకు అవస్థలు పడుతూ చూస్తూ ఉంటాము. దీన్ని మనము విజయమనుకుంటే అది పొరబాటు.

మనము ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఇబ్బందిపడని విధంగా, ఎంతో ఓర్పుతో, సహనంతో,ఆనందంగా ఎలా అధిగామించగలం! అలాగే ఆ సందర్భాన్ని మనకు ఒక అవకాశంగా ఎలా మలచగలం! నిజమైన విజయమంటే ఇదే! ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రక్రియలు ఇలాంటి మార్పులనే మనలో తీసుకురాగల ఒక పద్ధతి.
మనము మన జీవితంలో ఎంత తొందరగా యోగ, ప్రాణాయామం మరియు ధ్యానము మొదలైన ఉపాయాలను తీసుకురాగాలమో మనము అంతే తొందరగా విజయాలకు నాంది పలికినట్లు!

మనలో ఉన్న ఎంతో శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని ఎలా వెలికితెస్తాం!

ఈ కాలంలో మనకు ఎన్నో రకమైన పుస్తకాలు మరియు విజ్ఞానము సులభంగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల మనయొక్క ఉనికి, అనుభూతులు, స్నేహశీలత మరియు అసలైన వ్యక్తిత్వం మొదలైనవి వెలికిరావు. ప్రాచీన కాలములనుండి వచ్చినటువంటి యోగ, ప్రాణాయామం మరియు ధ్యానము మొదలైన ఉపాయాలను ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రక్రియల ద్వారా మన ఆత్మ, విచారణ శక్తి, సృజనాత్మకత, ఉత్తేజం, మేధస్సు పెంపొందించి మన వ్యక్త్త్వ వికాసానికి ఉపయోగపడే విధంగా తోడ్పతతాయి.
మనయొక్క శక్తి సామర్త్హ్యాలను పెంచి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగల స్థ్హాయికి మనల్ని తీసుకువస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని మార్గదర్శకంగా తీసుకొనే విధంగా మనల్ని మారుస్తుంది.

మరిన్ని వివరాలకు

 

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More