Story of Patanjali and the Gift of Yoga Knowledge - Part 1

Patanjali Yoga Sutras Knowledge Sheet 1

జ్ఞానాన్నీ గొప్పగా ప్రభావితంగా అందజేయడానికి కథారూపం ఎంతో అనువైనది. అందుకే మనం కథ ద్వారా మొదలు పెడదాము.


పూర్వము ఒకప్పుడు ఋషులు, మునులు విష్ణువు వద్దకు వెళ్ళి నీవు ‘ధన్యంతరి’ అవతారము ఎత్తి, ఆయుర్వేదము ద్వారా అనారోగ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఇంకా అనారోగ్యం పాలవుతున్నారు. అలా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి వారు విష్ణువు దగ్గరకు వెళ్ళి ఉపాయం చెప్పమన్నారు.
కొన్ని సార్లు కేవలం శారీరక అనారోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, భావోద్వేగ అనారోగ్యం కూడ సరి చేసుకోవలసి ఉంటుంది. ఉదా:- కోపము, కామము, అత్యాస, ఈర్ష్య, ఇటువంటి మలినాలనుండి బయట పడడానికి ఏమి చేయాలి? మార్గమేది?


శేషతల్పం మీద ఉన్న విష్ణువు దగ్గరకు వెళ్ళిన ఋషి, మునులకు ఆదిశేషువుని అప్పగించాడు (జ్ఞానానికి ప్రతీకగా). ఆ ఆదిశేషుడే భూమి మీద మహర్షి పతంజలిగా అవతరించాడు. కాబట్టి ఈ పతంజలే ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని యోగసూత్రాల రూపంలో అందించాడు.


వెయ్యి మంది శిష్యులు ఉంటే కాని ఈ యోగసూత్రాలను అందించలేనని చెప్పాడు. దక్షిణ భారత దేశంలోని వింధ్య పర్వతం వెయ్యి మంది శిష్యులు చేరారు.


అంతేకాకుండా వారికి పతంజలి ఒక షరతు పెట్టాడు. అది ఏమిటంటే తాను యోగసూత్రాలు చెప్పే సమయంలో జ్ఞాన బోధ పూర్తయ్యేవరకు బయటకు వెళ్ళకూడదని నిర్ధేశించారు.


పతంజలి తెర వెనుకనుండి వెయ్యిమంది శిష్యులకు జ్ఞానాన్ని ప్రసరింపచేసాడు. ఇంకా ఈ వెయ్యిమంది కూడ ఇచిన జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఇది ఒక అధ్భుతచర్య. ఈ జ్ఞానాన్ని ఎలా ఆకళింపు చేసుకున్నామని శిష్య్లు తమలో తాము ఆశ్చర్యపోయారు. ఒకామాట కూడ లేకుండా గురువు గారు తెర వెనుకనుండి ఇంతమందికి జ్ఞానాన్ని ఎలా ప్రసరింపచేసారు అన్న విషయం వాళ్ళకు నమ్మశఖ్యం కాలేదు.


అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరు కూడ వారిలో ఉత్పన్నమైనటువంటి అసామాన్య శక్తి, అసామాన్యమన ఉత్సాహాన్ని అనుభవించారు. ఈ శక్తిని వారు తమ శరీరంలో ఇముడ్చుకోవడం కష్టమైనది. అయినప్పటికీ వారు గురువు శాసనాన్ని పాటించారు.

This is the first in a series of articles
based on Sri Sri Ravi Shankar’s commentary on Patanjali Yoga Sutras.

Read introduction to Patanjali Yoga Sutras

పత౦జలి యోగసూత్రాలు : శ్రీశ్రీ రవిశ౦కర్ గారి వ్యాఖ్య

ఇంతలో ఒక చిన్న కుర్రవాడు లఘుశంక(మూత్ర విసర్జనకు) తీర్చుకోవడానికి బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఆ పిల్లవాడు నిశ్శబ్దంగా వెళ్ళి రావచ్చని గది బయటకు వెళ్ళాడు. ఇంకొక పిల్లవాడికి గురువు తెర వెనుక ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అది చూడదలచాడు.


ఆ పిల్లవాడు తెర ఎత్తాడా? ఏమి జరిగి ఉంటుంది? వచ్చే బుధవారం పతంజలి యోగా జ్ఞానం క్లాసుల్లో తెలుసుకుందాము.


ఈ కథ నుండి నీవు ఏమి గ్రహించావు? ఈ కథ చాలా లోతైనది. మన పురాణాలు ఏవి కూడ ఇటువంటి ప్రశ్నలను వివరించదు. దీనిని మనమే తెలుసుకోవాలి. కాబట్టి మనందరం ఏమి గ్రహించాలి?

ఏమి మాట్లాడకుండగా గురువు జ్ఞానాన్నిఎలా ప్రసరింప చేసాడు?

తెర యొక్క విశిష్టత ఏమిటి?

<<Introduction to Patanjali Yoga Sutras

Story of Patanjali Part 2>>

 

(This is part of a series of knowledge sheets based on Sri Sri Ravi Shankar's commentaries on Patanjali Yoga Sutras.)

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More