ఇతర ప్రధాన కోర్సులు

దీవెనలు అందించే కోర్సు

" నాలో  ఏ విధమైన కోరికలూ, అవసరాలు లేదనుకుని ఉండ గలిగే ఒకే స్థితి లో ఎదుటి వారికి అందించే దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి" - శ్రీ శ్రీ                                                                                                          

ఈ కోర్సు సూక్ష్మ మైన, ఎంతో శక్తి వంత మైన ధ్యానములు మరియు ప్రక్రియలతో కూర్ప బడిన పద్దతులు. వీటి ద్వారా మనకు కృతజ్ఞతా భావముతో పాటు పూర్ణత అనుభవించగలము.  ఈ కోర్సు చేసిన చాలా మంది తమకు కలిగిన కృపతో పాటు మిగతా వారికి పంచ గలిగే ఆశీర్వాద ఫలాలను గుర్తించ గలిగారు.

ఈ కోర్సు చేయటానికి కనీసం రెండు  పార్ట్ 2 కోర్సులు చేసి వుండాలి. 

నమోదు చేసుకోండి

డీ ఎస్ ఎన్ (D S N ) కోర్సు

ఈ కోర్సు వల్ల మనం మన ఎదుగుదలకు అడ్డంకులైన మానసికంగా అవరోధాలు సృష్టిస్తున్న విషయాలను గమనించి వాటినుండి ఎలా బయటకు రావాలో అలాగే   మన స్తిరత్వానికి   దోహదపడే విషయాల గురించి తెలుసుకొంటాము.

మనకందరికీ మనం అన్ని విషయాలలో అన్నిటి కన్నా బాగా చేయగలిగితే బాగుంటుదని అనుకుంటాము. అలాగే మన కుటుంబంలో గానీ, మన సంఘంలో గానీ లేదా సమాజంలో గానీ అందరికన్నా పైకి రాగలిగితే బాగుంటుంది అని అనుకుంటాము గదా! అయితే చాలా మందికి అలవాట్లు అయితే గానీ, మానసిక మైన గాయాలవల్ల గానీ లేదా భయమ లేదా ఆందోళనలవల్ల గానీ  మనం జీవితంలో పూర్తిగా పాలుపంచుకోలేదని    అనిపిస్తూఉంటుంది. అయితే ఈ కోర్సులో నేర్పించే యోగ ద్వారా, శక్తి వంత మైన ప్రక్రియల ద్వారా మరియు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానబోధల ద్వారా మన ప్రగతికి అడ్డంకులైన అవరోధాల్ని అధిగమించి మనకు స్వయం శక్తి మరియు ఆత్మ విశ్వాసం పెంచి మన ఒక్కరికే కాక అందరికి ఎలా మనం ఉపయోగ కరంగా ఉండగాలమనేది తెలుసుకోగలం.

ఆర్ట్ అఫ్ లివింగ్ హప్పినెస్స్ కోర్సు లేదా ఎస్ ప్లస్ కోర్సు  చేసిన వారు ఈ D S N  కోర్సుకు అర్హులు.

నమోదు చేసుకోండి

గురు పూజ కోర్సు (మొదటి భాగము మరియు రెండవ భాగము)

ఈ కోర్సు తరతరాలుగా వస్తున్నఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన  గురు పరంపరను ఆదరించే ఒక విధానము. శ్రీ శ్రీ గారి తోబుట్టువైన శ్రీమతి  భాను గారిచే ఈ కోర్సు మనందరికీ గురు పూజ చేసే విధి విధానాలను నేర్పించి గురు మంత్రము ఎలా పారాయణము చేయాలో నేర్పిస్తారు. ఈ మంత్రం పారాయణం చేయటం వల్ల మనసు గురు పరంపర యొక్క భావంలో లీనమై ఎంతో ప్రశాంతతను కలుగచేస్తుంది. ఈ కోర్సు చేసిన వారు తమకెంతో దైవికమైన అనుభూతులు కలిగినట్లు పంచుకోవటం చూస్తున్నాము. ఈ కోర్సులో తరతరాల నుండి వస్తున్న జ్ఞానంతో పాటు శ్రీ  శ్రీ గారితో మరియు గురు పరంపరతో ఉన్న ఎన్నో అనుభవాలు పంచుకుంటారు.

ఈ కోర్సు రెండు భాగాలుగా ఉంటాయి.

మొదటి భాగము: ఇందులో గురు మంత్రం ఉచ్చారణ ఎలా చేయాలి అనే దానితో పాటు వేదములలో నిక్షిప్తమైన నిగూడ రహస్యాలు మరియు ఆచార వ్యవహారాలు తెలుసుకొంటాము. 

రెండవ భాగము: గురుపరంపర ద్వారా తరతరాలుగా వస్తున్న గురు మంత్రం పారాయణం ద్వారా గురువులను అవాహించే విధి విధానాలను    తెలుసుకొంటాము.

ఆర్ట్ అఫ్ లివింగ్ శిక్షకులు గానీ నాలుగు పార్ట్ 2 కోర్సులు చేసి సహజ సమాధి ధ్యానము కోర్సు  చేసిన వారు కానీ ఈ కోర్సుకు అర్హులు.

నమోదు చేసుకోండి

ఎటర్నిటి  ప్రక్రియ:

మన ఆత్మ శాశ్వతము. దీనికి పుట్టుక గానీ మరణము గానీ ఉండదు. మన శరీరము పుట్టక ముందు అలాగే మన శరీరము వదిలిన తరువాత కూడా మన ఆత్మ అనేది చిరకాలము ఉంటుంది.ఈ ప్రక్రియ ద్వారా మన పూర్వ జన్మల మధనం ద్వారా ప్రస్తుత జన్మలో ఉన్న ప్రవర్తన మరియు  కొన్ని పరిస్థితులను శోదించటం జరుగుతుంది. వీటి వల్ల మన  శారీరక లేదా మానసిక విధి విధానాలు మరియు వాటికి అనుభంధించిన   పరిస్థితులను అర్థం చేసుకోవటం తో పాటు ఏదైనా మార్పులు తీసుకు రావలసిన విషయాలుంటే అవి తెలుసుకుని వీటి ద్వారా మన ప్రస్తుత జీవనంలో అడ్డంకులవుతున్నఏదైనా ఇబ్బందులను తొలగించేందుకు ఉపయోగ పడుతుంది. దీని ద్వారా ఈ జన్మలో మనము ఆనంద జీవనం గడపడానికి దోహద పడుతుంది.   

ఈ ప్రక్రియ రెండు నుండి మూడు గంటల వ్యవధిలో నిగూఢ మైన ధ్యానము ద్వారా ఏకాంతంలో చేయడం జరుగుతుంది.

మూడు పార్ట్ 2 కోర్సులు చేసి ఉండాలి అలాగే అందులో కనీసం ఒక  పార్ట్ 2 కోర్సు శ్రీ శ్రీ గారి సమక్షంలో చేసి ఉండాలి.

నమోదు చేసుకోండి