ధ్యానములో ఏకాగ్ర్తత కొరకు 6 చిట్కాలు.

మీరు ప్రతి రోజు  ధ్యానము  చేస్తూ ఉన్నపుడు, మీ మనస్సు ప్రాపంచిక విషయాలను వదలి వేసినట్లు

గ్రహించినారా? ధ్యానము నేర్చుకొనుట అన్నది మొదటి మెట్టు. ఇంక ఈ నిచ్చెన మీద కొన్ని మెట్లు పైకి

వెళ్లి, మరికొన్ని పద్ధతులు తెలుసుకుని గాఢమైన అనుభూతిని పొందవలెననుకుంటున్నారా? కొన్ని చిట్కాలు

అనుసరించుట, ఈ దారిలో మీకు మరింత సహాయ పడుతుంది.

#1 ఇతరుల ముఖము మీద చిరునవ్వును తెచ్చుట

ఒకరికి సహాయము చేసినపుడు మీరు ఎలా అనుభూతి చెందుతారు? సంతోషముగా, తృప్తిగా అవునా?

సకారాత్మకమైన శక్తి పైకి పొంగుట వలన మీ లోపల ఏదో వ్యాకోచము (expand) చెందినట్లు అనుభూతి

కలుగుతున్నదా? ఇది ఎందువలనో మీకు తెలుసా? దీనికి కారణము ఇతరులకు సహాయము చేసి, వారి

ముఖము మీద చిరునవ్వును తేగలిగినప్పుడు వారి నుండి వచ్చే ఆశీర్వచనములు, మంచి స్పందనలు మీకు

ఆ భావమును కలిగించును.

సేవ వలన కూడా యోగ్యత కలుగుతుంది .ఈ యోగ్యత మీకు గాఢమైన ధ్యాన స్థితిని పొందుటకు వీలు

కల్పిస్తుంది.

“మీకు సేవ చేసినప్పుడు, దానివలన ప్రత్యక్షముగా సంతృప్తి కలిగి నన్ను ఆనందముగా, మనశ్శాంతిగా

ఉంచినది. నేను ఆనందముగా మనశ్శాంతిగా ఉన్నప్పుడు, ధ్యానములో గాఢమైన అనుభూతి తప్పక

కలుగుతుంది” అన్నారు షిల్పీ మాడెన్ గారు.

#2 నిశ్శబ్దములో శబ్దమును అనుభవించుట!

ప్రాతః కాలమున డాబామీద నిలబడి, గొప్పదైన ఎర్రటి ఆకాశమును చూస్తూ ఉదయిస్తున్న సూర్యుని చక్కదనమునకు పూర్తిగా సమ్మోహితులైన దృశ్యమును ఊహించుకోండి, మీరు గాఢమైన నిశ్శబ్దములోనికి జారి, ఆ అందములో కలసిపోయి, ఆ చక్కదనము మిమ్మల్ని మాటలకు అతీతులుగా మార్చినట్లు అనుభూతి చెందినారా? మీ మనస్సు చాల శాంతముగా, నెమ్మదిగా ఉన్నది. ఎందువలన అని ఎప్పుడైనా ఆశ్చర్యచకితులైనారా?

నిశ్శబ్దములో ఆలోచనలు తగ్గిపోయి, మీ మనస్సు స్థిరముగా ఉంటుంది.

ఎక్కువ సమయము మనము గలగల మాట్లాడుతూ వుంటే, మన మనస్సు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. మన ఇంద్రియములు విషయములను ప్రోగుచేయుట యందు, అనేక ఆలోచనలు, జ్ఞాపకములతో మనలను ఉక్కిరి బిక్కిరి చేయుట యందు బిజీగా ఉంచాయి.

నిశ్శబ్దము ధ్యానమునకు పరిపూర్ణతను ఇస్తుంది. మీరు నిశ్శబ్దముగా ఉంటే మీ మనస్సు నెమ్మదించి, తేలికగా ధ్యానము లోనికి జారుకొనగలరు.

ధ్యానమును, నిశ్శబ్దమును రెండింటిని తేలికగా అనువభూతి చెందుటకు మార్గము ఆర్ట్ ఆఫ్ లివింగ్ పార్ట్ – 2 కార్యక్రమము. ఈ కార్యక్రమము ప్రతి వారాంతములో బెంగుళూరు లోని అంతర్జాతీయ ఆశ్రమములో జరుగును.

“నేను కొన్నిసార్లు అంతులేని ఆలోచనలతో మునిగిపోయినట్లుగా అన్పిస్తూ వుంటుంది. నిశ్శబ్దముగా ఉండటము వలన క్రమముగా ఈ ఆలోచనల ఉక్కిరి బిక్కిరి తగ్గి నేను గాఢమైన ధ్యాన స్థితిని పొందగలుగుతున్నాను” అన్నారు హితాంషి సచ్ దేవ్ గారు.

#3 కొన్నిరకములైన యోగ ముద్ర లతో మీ శరీరమును మచ్చిక చేసుకోండి

కొన్ని రోజులు మీరు ధ్యానము చేస్తున్నప్పుడు విశ్రాంతి లేని స్థితి కలిగి, లోతుగా ధ్యాన స్థితిని పొందలేక పోవడమును గమనించారా?

ఎక్కువ గంటలు పనిచేయటము వలన మీ శరీరమునకు తేలికగా వంగే లక్షణము తగ్గి పోతుంది. దీని వలన శరీరమునకు నొప్పులు వచ్చి, విశ్రాంతి లేని స్థితి కలుగుతుంది. కొన్ని యోగాసనములు చేయ్యటము వలన శరీరమునకు ఈ బిరుసుతనము తగ్గి విశ్రాంతిగా ఉంటుంది. దీని వలన, మీ మనస్సు నెమ్మదించి ధ్యానములో లోతైన అనుభవమును పొందగలరు.

#4 మీ ఆహారమును గమనించండి

ఆరోగ్యకరమైన తేలికపాటి ఆహారము తీసుకున్నపుడు మీ ధ్యానము ఎలా ఉన్నది? మాంసాహారము, నూనె పదార్ధములు తిన్న రోజున మీ ధ్యానము ఎలా ఉన్నది గమనించండి.  మీ ధ్యాన సాధన లో ఏమైన తేడాని గమనించారా? దీనికి కారణము మీరు తీసుకునే ఆహారము మీ మనస్సు మీద ప్రత్యక్షముగా ప్రభావము చూపుతుంది.

సాధకునిగా తినవలసిన ఆహారము  పచ్చని కూరగాయలు, తాజా పండ్లు, పచ్చి కూరలు, జావ మొదలగునవి అవసరము. తేలికగా జీర్ణమయ్యే పదార్ధములు మరియు ఎక్కువ ప్రాణ శక్తి (పాణ) కలిగిన పదార్ధములు

తీసుకోవాలి.

#5 మీకు మీరే పాడుకోండి

వివిధ రకములైన సంగీతము వివిధ రకములైన భావావేశములను కల్గించుట మీరు గమనించారా?

మనం అందరము 90 శాతము అంతకన్నా ఎక్కువ భాగము శూన్యము (Space) తో తయారు చెయ్యబడినాము. కనుక సంగీతము మన మీద లోతైన ప్రభావము చూపుతుంది. సంత్సంగము లో పాడినపుడు మన భావావేశములకు శుద్ధి కలిగి మన లోపల విశాలమైన భావన కలుగుతుంది. ఎప్పుడు ఆగకుండ గలగల గలా మాట్లాడే మన 'చిన్న మెదడు'నెమ్మదించి, ధ్యానములో లోతైన అనుభవమును పొందగలరు.

#6 ప్రతి రోజు మీ ధ్యానమునకు సమయము కేటాయించండి

ధ్యానములో గాఢమైన అనుభూతిని పొందుటకు క్రమశిక్షణ మరియు ధ్యానము మీద గౌరవము అన్నది ముఖ్య సూత్రములు అని భావించండి. కనుక మీ ధ్యానమునకు ప్రతి రోజూ కొంత సమయము కేటాయించి గాఢమైన ధ్యానము వలన కలుగు అనుభూతిని ఆస్వాదించండి.

మొదట నేను ప్రతి రోజూ వేర్వేరు సమయములలో ధ్యానము చేసేదానిని. గత కొన్ని నెలల నుండి ప్రతి రోజూ భోజనమునకు ముందు ధ్యానము చేన్తున్నాను. ప్రతి రోజూ ఒకే సమయమునకు ధ్యానము చేయుటవలన ఇంకా మంచి గాఢమైన ధ్యాన స్థితిని పొందగలిగినట్లు నేను గమనించాను.” అన్నారు దివ్య సచిదేవ్.

 - శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఉపన్యాసముల (wisdom talks)  వలన ప్రేరణ పొందిన దివ్య సచిదేవ్,

సహజ సమాధి ధ్యానము టీచరు ప్రియదర్శిని హరియమ్ గారి అనుభవముల ఆధారముగ  రూపొందింపబడినది.