గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతి రాయబారి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందించే సేవా ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా వారి దృక్పథం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఏకం చేసి, ఒత్తిడి లేని, హింస లేని సమాజాన్ని సృష్టించే దిశగా ప్రోత్సహించింది.
ఆరంభం
దక్షిణ భారతదేశంలో 1956లో జన్మించిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రతిభావంతుడైన సంతానం. నాలుగు సంవత్సరాల వయస్సులో, అతను పురాతన సంస్కృత గ్రంథమైన భగవద్గీతలోని కొన్ని భాగాలను పఠించగలిగాడు. తరచుగా లోతైన ధ్యానంలో కనిపించేవాడు. గురుదేవ్ మొదటి గురువైన సుధాకర్ చతుర్వేదికి మహాత్మా గాంధీతో సుదీర్ఘ అనుబంధం ఉండేది. 1973లో పదిహేడేళ్ల వయస్సులో, గురుదేవ్ వేద సాహిత్యం, భౌతిక శాస్త్రం రెండింటిలోనూ పట్టభద్రుడయ్యాడు.
World Meditation Day
● Livewith Gurudev Sri Sri Ravi Shankar
● Liveat 8:00 pm IST on 21st December
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక సూత్రం, జీవితాన్ని పూర్తిగా జీవించే తత్వశాస్త్రం. ఇది ఒక సంస్థ కంటే ఎక్కువ ఉద్యమం అని చెప్పాలి. దీని ప్రధాన విలువ, మనిషి తనలోతాను శాంతిని కనుగొనడం, మన సమాజంలోని ప్రజలను-వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, జాతీయతల గురించి ఏకం చేయడం; తద్వారా ప్రతిచోటా మానవ జీవితాన్ని ఉద్ధరించడం మనకు ఒకే లక్ష్యమని మనందరికీ గుర్తు చేస్తుంది.
- గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ , ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ స్థాపన
గురుదేవ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను అంతర్జాతీయ, లాభాపేక్షలేని, విద్యా, మానవతావిలువల సంస్థగా స్థాపించారు. దీని విద్య, స్వీయ-అభివృద్ధి కార్యక్రమాలు ఒత్తిడిని తొలగించడానికి, శ్రేయోభావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన సాధనాలను, కార్యక్రమాలను అందిస్తాయి. ఏదో ఒక నిర్దిష్ట జనాభాకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా, సమాజంలోని అన్ని స్థాయిలలోనూ ప్రభావవంతంగా నిరూపించబడ్డాయి. ప్రస్తుతం 180 దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు అందించబడుతున్నాయి. 1997లో, గురుదేవ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క సోదర సంస్థ అయిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ (IAHV) ను సహ-స్థాపించారు. ఈ సంస్థ స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేస్తుంది, మానవ విలువలను పెంపొందిస్తుంది, సంఘర్షణలకు పరిష్కారాలను ప్రారంభిస్తుంది.
స్ఫూర్తిదాయకమైన సేవ, జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం

ప్రముఖ మానవతా నాయకుడు అయిన గురుదేవ్ యొక్క కార్యక్రమాలు ప్రకృతి వైపరీత్యాల బాధితులు, ఉగ్రవాద దాడులు, యుద్ధాల నుండి ప్రాణాలతో బయటపడినవారు, అట్టడుగు జనాభాకు చెందిన పిల్లలు, సంఘర్షణలో ఉన్న సమాజాలు వంటి అనేక నేపథ్యాల ప్రజలకు సహాయం అందించాయి. ఆయన సందేశం యొక్క బలం ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన ప్రాంతాలలో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్న లక్షలాది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తల ద్వారా ఆధ్యాత్మికత ఆధారంగా ఒక సేవా తరంగాన్ని ప్రేరేపించింది.
ఆధ్యాత్మిక గురువుగా, గురుదేవ్ యోగా, ధ్యాన సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసి, వాటిని 21వ శతాబ్దానికి అనువైన రూపంలో అందించారు. ప్రాచీన జ్ఞానాన్ని పునరుద్ధరించడమే కాకుండా, గురుదేవ్ వ్యక్తిగత, సామాజిక పరివర్తన కోసం కొత్త పద్ధతులను రూపొందించారు. వీటిలో సుదర్శన క్రియ కూడా ఉంది, ఇది లక్షలాది మందికి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, రోజువారీ జీవితంలో అంతర్గత శక్తిని, అంతర్గత నిశ్శబ్దాన్ని కనుగొనడానికి సహాయపడింది.
శాంతి యొక్క ఒక చిత్రం

శాంతి రాయబారిగా, గురుదేవ్ ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు, ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా బహిరంగ వేదికలలో, సమావేశాలలో అహింస గురించి తన దృక్పథాన్ని ఉచితంగా పంచుకుంటారు. శాంతి యొక్క ఏకైక ఎజెండాతో తటస్థ వ్యక్తిగా పరిగణించబడుతున్న ఆయన సంఘర్షణలో ఉన్న ప్రజలలో శాంతి ఆశలను కలిగిస్తారు. కొలంబియా, ఇరాక్, ఐవరీ కోస్ట్, కాశ్మీర్, ఇంకా బీహార్లలో ప్రత్యర్థి పార్టీలను చర్చల వేదికకు తీసుకువచ్చినందుకు ఆయనకు ప్రత్యేక గౌరవం లభించింది. తన చొరవలు, ప్రసంగాల ద్వారా, మానవ విలువలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని, మనం ఒకే ప్రపంచ కుటుంబానికి చెందినవారమని గుర్తించవలసిన అవసరాన్ని గురుదేవ్ నిరంతరం నొక్కి చెప్పారు. మతాంతర సామరస్యాన్ని పెంపొందించడం, మతమౌఢ్యానికి పరిష్కారంగా బహుళ-సాంస్కృతిక విద్యకు పిలుపునివ్వడం స్థిరమైన శాంతిని సాధించడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో ముఖ్యమైన భాగాలు.
మానవ విలువలు, సేవను పునరుజ్జీవింపజేయడం ద్వారా గురుదేవ్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను తాకారు. జాతి, జాతీయత, మతానికి మించి, గురుదేవ్ ఒత్తిడి మరియు హింస లేని ఒక ప్రపంచ కుటుంబం యొక్క సందేశాన్ని పునరుద్ధరించారు.


