జ్ఞాన బోధనలు- శ్రీ శ్రీ గారిచే ఉపదేశించబడిన ప్రవచనాలు

అష్టావక్ర గీత

ఆర్ట్ అఫ్ లివింగ్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన  బెంగళూరు ఆశ్రమంలో 1991 సంవత్సరంలో శ్రీ శ్రీ గారిచే ప్రభోదించబడ్డ ఈ ప్రవచనాలు ఎంతో విశిష్టమైన ఒక  జ్ఞాన సంగ్రహం. ఈ అష్టావక్ర గీత మన లోని అహాన్ని, మనసును, మనలో ఎల్లప్పుడూ జరుగున్న అంతర్మధనాన్ని విశ్లేషించి ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడే ఒక గురోపదేశం. ఇందులో శ్రీ శ్రీ గారు ఎంతో చాకచక్యంగా, తరతరాలుగా వస్తున్న జ్ఞానాన్ని చక్కటి ఉదాహరణలతో పాటు, ప్రయోగికమైన రీతిలో, ప్రతి ఒక్కరికి మనసుకు హత్తుకునేలా తనదైన శైలిలో వర్ణించటం జరిగింది. జ్ఞాన మార్గ ఉపాసకులకు ఈ అష్టావక్ర గీత ఉపదేశం ఒక మహత్తరమైన మార్గము.

మీ దగ్గరలో ఉన్న ఆర్ట్ అఫ్ లివింగ్ సెంటరును సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొనగలరు.

పతంజలి యోగ సూత్రములు

"మనల్ని ప్రాపంచిక బంధనాలనుండి ఎలా విడదీసి ఒక స్వతంత్ర మైన వ్యక్తిత్వంతో చూడగలము అని తెలుసుకోవటానికి పతంజలి యోగ సూత్రములు ఉపయోగపడతాయి. మనసు అనేది అన్నిటికన్నా సూక్ష్మ మైనది అయితే అహంకారము మరియు చిత్తము యొక్క సంకెళ్ళ నుండి దీనిని విడదీయడం వల్ల మాత్రమే మనము  అసలైన స్వతంత్రం వచ్చినట్లు తెలుసుకోవాలి." శ్రీ శ్రీ

పతంజలి యోగ సూత్రములు అనేది  శాస్త్రీయమైన,  కళాత్మికమైన మరియు తత్వశాస్త్రం ద్వారా యోగ మార్గమును గురించి కూర్ప బడిన ఒక విలువ కట్టలేని ఒక జ్ఞాన సంపుటి. శ్రీ శ్రీ గారు తనదైన, సులభతరమైన విశ్లేషణలతో ఈ యొక్క సూత్రముల ద్వారా యోగ సాధనను  మనము ప్రాయోగిక జీవనంలో ఎలా ఉపయోగ పరచగలమని  చెప్పడం జరిగింది.

మనము కోరికలను ఎలా నిగ్రహించగలము అలాగే అయిష్టతలు ఎలా భరించగలము మొదలైనవి తెలుసుకుంటే మన జీవితంలో మనము ఎల్లప్పుడూ చైతన్య వంతంగా ఉంటూ మనసుని ఎలా జయించ వచ్చు  అనే అవగాహనతో జీవితాన్ని సుఖమయం చేసుకోగలం. ప్రపంచం నలుమూలలా ఈ యొక్క  జ్ఞాన సంపుటి పుస్తక రూపంలోనూ వీడియో రూపంలోనూ అందుబాటులోకి తెచ్చి ఎంతో మందికి దీని వల్ల ప్రయోజనం కలిగింది.

మీ దగ్గరలో ఉన్న ఆర్ట్ అఫ్ లివింగ్ సెంటరును సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొనగలరు.

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More