యోగా

శరీరాన్ని బలోపేతం చేయడానికి, విశ్రాంతిగా ఉంచడానికి యోగా భంగిమలు చాలా బాగుంటాయి, కానీ యోగాలో అంతకంటే ఎక్కువ ఉంది.

"ఏకం చేయడం లేదా ఏకీకృతం చేయడం" అని అర్ధం వచ్చే "యుజ్" అనే సంస్కృత పదం నుండి యోగా అనే పదం పుట్టింది. ఇది 5,000 సంవత్సరాలకు పైబడిన పురాతన భారతీయ జ్ఞానం. యోగా అంటే వివిధ శ్వాస వ్యాయామాలు, యోగా భంగిమలు (ఆసనాలు), ధ్యానం ద్వారా శరీరాన్ని మనస్సు, శ్వాసలతో సమన్వయం చేయడం. యోగ అంటే వ్యాయామాలు, శరీరాన్ని క్లిష్టమైన భంగిమలలో వంచటం, సాగదీయటం, వాటితోబాటుగా శ్వాసను వివిధరకాలుగా తీసుకుని, వదలటం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కాని ఇవన్నీ పైకి కనిపించే లక్షణాలు మాత్రమే. శరీరానికి మాత్రమే కాక మనసుకు, ఆత్మకు సంబంధించిన అనంతమైన శక్తిని బయటకు తీసే విజ్ఞానం యోగాలో ఇమిడి ఉంది.

విజ్ఞానపరంగా చెప్పాలంటే యోగా అనేది జీవన విజ్ఞానం. ఇందులో భాగంగా జ్ఞానయోగ (వేదాంతం), భక్తియోగ (భక్తిపూర్వకమైన ఆనందం), కర్మయోగ (ఆనందంతో, భక్తిపూర్వకంగా చేసే పని), రాజయోగ (మనసును అదుపుచేయటం) ఉన్నాయి. రాజయోగ అనేది మరలా ఎనిమిది విభాగాలుగా చేయబడింది. రాజయోగ విధానంలో శరీరం, మనసు, శ్వాసలను సమన్వయపరచి సమైక్యం చేసే యోగాసనాలు ఒక భాగంగా ఉన్నాయి.

యోగ కార్యక్రమాలు

సుదర్శన క్రియ నేర్చుకోండి