ఆధ్యాత్మిక అనుభవం

  • నీ జీవిత పరమావధి  ఏమిటో తెలుసుకో
  • ఈ జీవితం, సృష్టి ,వీటిలో  ఉన్న నిగూఢ రహస్యాలను తెలుసుకో.
  • స్వేఛానుభూతి ని పొందు, నీ అంతరంగ లోతుల్ని వెతుకు. వికాస మార్గం లో అతి సున్నితమైన మార్గదర్శక అడుగులు వేస్తూ మున్డుకెళ్ళు.
  • ప్రగాఢ సత్యాన్ని, అత్యుత్తమమైన జ్ఞానాన్ని, అసాధారణమైన ఆనందాన్ని గురువుయొక్క సమక్షం లో ఆస్వాదించు.
  • ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం  ఏమిటి అంటే అందరి అనుభవాలు నిర్దిష్ట మైనవే అయినా వర్ణనకు అతీతం .అంటే మాటలలో చెప్పలేము.

అంచెలంచెలు గా అపూర్వ పయనము

నీ శరీరాన్ని, మనస్సుని  ,నీ ప్రాణాన్ని కుదుట పరిచి సంయమనము లో ఉంచాలి.

దీనిలో మొట్టమొదట అడుగు సుదర్శన క్రియ నేర్చుకోవడం క్రియలోని శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ,మన శరీరాన్ని ,మనస్సుని ,ప్రాణాన్ని శుద్ధపరచడమే కాకుండా వాటి మధ్య సంయమనాన్ని తీసుకొస్తుంది.

దీని వల్ల పేరుకుపోయిన వత్తిడిని సహజబద్ధంగాను ,నిర్దిష్టంగాను తొలగిస్తుంది

నీ అంతరాత్మలో ని అనంత సహజ స్వరూపంలో నిమగ్నం అయిపో.

మౌనవ్రతం:- అంటే సహజసిద్ధంగా మనో సంయమనంతో మన శక్తిని ,ధ్యాసని బాహ్య ప్రతిబంధకాల  నుంచి మళ్ళించుకోవడం.
ఈ ప్రక్రియను అనాది గా వివిధ సాంప్రదాయాలలో ,శారీరక ,మానసిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి వాడుతూనే ఉన్నారు.
AOL programs లో పాల్గొనడం వల్ల వాటిలోని నిర్ణీతమైన, ప్రభావపూరితమైన పద్ధతులు మన ప్రాపంచిక ఆలోచనయంత్రాంగ(mind) పరిధులు దాటి అలౌకికమైన  ప్రశాంతత ,ఉత్తేజితమైన ప్రాణ శక్తి  (vitality) మనకు సమకూరుతాయి. మన నిత్య జీవితంలో మనకు బాగా తోడ్పడుతాయి కూడా.

అంతరాంతర ఆత్మశోధన/సుధీర్ఘ అంతర్మథనం

దీనికి ఒక అనుభవజ్ఞడైన గురువు దగ్గర మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది.
సహజ సమాధి ధ్యానము:-ఈ ప్రక్రియలో ఇవ్వబడిన ఓ సాధారణ మైన శబ్దాన్ని ఆసరాగా తీసుకొని మనస్సుని స్థిర పరుచుకుంటారు, అంతర్ముఖులు అవుతారు. దీనితో  మన మనస్సు ,నాడీ వ్యవస్థ గాఢ నిస్సబ్ది లో చిన్న చిన్నగా విలీనం అయి ,మన పురోగతికి ఉన్నఅడ్డంకులు ఒక్కటోక్కటి గా తొలగిపోతాయి.ఈ సుదర్శన క్రియ యొక్క  నిరంతర అభ్యాసం వల్ల మన నిత్య జీవినవిధానం గణనీయంగా మెరుగు పడి,విశాల దృక్పదం, ప్రశాంతత ,ప్రాణ శక్తులను సంతరించుకుంటాయి.

ఆర్తులకు స్వాంతన ఇచ్చే ఆశీర్వాద ప్రక్రియ

సమృద్ధి,సంతుష్టి, ఆశయ సాకారతలను అందించే ఆశీర్వాద ప్రక్రియ మనకు నిత్య నూతన ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం.
ఆశయ సాకారత(fulfillment) తో మన చైతన్యానికి ఒక అవ్యానుభుతి, దివ్యానుభూతి. దీనిని నేర్చిన వారు చికిత్స రూపంగా జనాళి కి బహు ఉపయుక్తముగా ఉండగలరు.ఆ విధంగా ఇరులకు(both the healer and the healed) సంతోషాతిశయాలు ,సంతృప్తి కలుగుతాయి. పరులకు సేవ చేయడానికి ఇది ఒక మహాదావకాసం ,ప్రస్తుత సమాజములో చాల అవసరము కూడా.
ఎంతోమందికి  ఈ చికిత్స(healing by blessing) వల్ల అలౌకిక స్వాంతన లభించిన నిదర్శనాలు ఉన్నాయి. ఇది సేవా తృష్ణాతులకు గొప్ప అవకాశం.

కృతజ్ఞత లో తరింపు:-

నిబద్ధత తో అర్పించిన  నిర్మల పరిపూర్ణ హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు పరిపక్వ చైతన్యానికి నిదర్శనం .దీనికుద్దేసించిన మహత్తర ప్రక్రియ “గురుపూజ”.మన పవిత్ర సనాతన సాంప్రదాయంలో ఇదొక ప్రత్యేకత సంతరించుకున్న గొప్ప  కార్యక్రమం. అనాది గా వస్తున్నా జ్ఞాన జ్యోతి ని అందిస్తూ వస్తున్న గురుపరంపరకు ఈ గురుపూజ, చంద్రుడికొ నూలుపోగు లాంటిది.నీటిబిందువు చిన్నదైనా సముద్రములో కలిసినప్పుడది  సముద్రపు స్థాయిని అనుభవించినట్లే మనం కూడా ఈ సనాతన గురువుల సాంప్రదాయానికి అనుసంధానమయితే అనంత శక్తివంతులుగా అనుభూతిచెందుతాంకదా!

 

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More