
సహజ సమాధి ధ్యానం అనేది సరళమైన ధ్యాన సాధన. గందరగోళ పరిస్థితుల్లో సైతం ప్రశాంత చిత్తంతో ఆలోచించే శక్తి దీనివలన నాకు అలవడింది.
షగుణ పంత్, రేడియో జాకీ, ఢిల్లీ, 27సహజ సమాధి ధ్యాన యోగ
మనశ్శాంతి • మెరుగైన ఆరోగ్యం • మానసిక స్పష్టత • మెరుగైన సామర్థ్యాలు పొందండి
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
ఇక్కడ రిజిస్టర్ చేసుకోండిసహజ సమాధి ధ్యాన యోగ వల్ల ప్రయోజనాలు

మనశ్శాంతి
సహజ సమాధి ధ్యాన యోగ మెదడును ఆల్ఫా తరంగాల స్థితికి చేరుస్తుంది, ఆల్ఫా తరంగాలు అనేవి మన నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, అందువలన మన శరీరానికి, మనస్సుకు దీర్ఘమైన విశ్రాంతిని చేకూరుతుంది.

మానసిక స్పష్టత
ధ్యానం మన ఆలోచనల ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది, తద్వారా మానసిక స్పష్టతకు తోడవుతుంది. సహజ సమాధి ధ్యాన యోగ ద్వారా మీ ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మగత అవగాహన అభివృద్ధి చెందుతుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం సిద్ధిస్తుంది.

మెరుగైన ఆరోగ్యం
శరీరానికి శక్తిని అందించేది నాడీ వ్యవస్థ. ఉల్లాస భరితమై, పునరుత్తేజం పొందిన నాడీ వ్యవస్థ మీ శ్వాసకోశాలు, గుండె, జీర్ణ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.

అంతర్ దృష్టిని మేల్కొల్పండి
సహజ సమాధి ధ్యానం మీ ఆలోచనల వేగాన్ని నియంత్రణలో ఉంచి అంతర్ దృష్టిని బలపరుస్తుంది.
సహజ సమాధి ధ్యానం ఎలా ప్రభావితం చేస్తుంది?
ధ్యానం అనేది సంపూర్ణమైన విశ్రాంతినిచ్చే ప్రక్రియ. రోజువారీ పనులు కాసేపు పక్కన పెట్టి మనతో మనం గడిపే నాణ్యమైన సమయం. కానీ చాలా మంది ఆ కొద్ది సమయం కూడా ఏమీ చేయకుండా ఉండలేరు. ఇదంత సులభమైన విషయం కాదు. ధ్యానానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీ స్వంత ఆలోచనలు, చింతలు, బయటి ఆలోచనలు, పరధ్యానాలలో చిక్కుకోవడం చాలా సులభం - అందువల్ల ప్రశాంతతను, అంతర్గత శాంతిని పొందడం కష్టంగా అనిపిస్తుంది. అయితే సహజ సమాధి ధ్యానంలో, మనం శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్ళేందుకు సున్నితమైన శబ్దాలు (మంత్రాలు) ఉపయోగిస్తాము. ఈ కార్యక్రమంలో మీరు మీ వ్యక్తిగత మంత్రాన్ని పొందుతారు, దీన్ని ధ్యానంలో ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఆ మంత్రం మీ మనస్సును లోతైన స్థాయికి తీసుకెళ్లే వాహకంగా మారుతుంది. మీరు మీ లోతు లోకి వెళ్ళే కొద్దీ, ఆనందం, స్పష్టత, శాంతి, అంతర్భావం, సృజనాత్మకత మీలో బయటపడతాయి, చివరికి మీరు ఎవరన్నది తెలుసుకుంటారు.
కోర్సులో ఏమి బోధిస్తారు?
- మంత్ర ఆధారిత మెడిటేషన్ (ధ్యాన) పద్ధతి.
- ధ్యాన ప్రధాన సూత్రాలు.
- మనస్సును కలవర పరిచే కారణాలను గుర్తించడం, వాటికి నివారణలు.
- ఆహారపు అలవాట్లు మనస్సును, ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయి, మొదలైనవి.
గతంలో నాకు ధ్యానం పట్ల కొంత అనుమానం ఉండేది. సాహజ్ తర్వాత, నేను చాలా సులభంగా ధ్యానం చేయగలుగుతున్నాను, మరియు సమాధి స్థితిలోకి జారుకోవడానికి మనకంటూ ఒక వ్యక్తిగత మంత్రం ఉండటం నిజంగా ఒక వరం.

నితీష్ ఖైర్నార్
డేటా సైంటిస్ట్, ముంబై
సాహజ్ ద్వారా నేను సంపూర్ణ నిశ్శబ్ద స్థితిని అనుభవించాను. మంత్రానికి ఇంతటి ప్రభావం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుభవించే వరకు నాకు తెలీదు!

సౌమ్య కొత్త
నియామక నిపుణుడు/నియామక నిపుణురాలు
నా మొదటి సహజ్ ధ్యానం యొక్క జ్ఞాపకం ఇంకా తాజాగా ఉంది. నా వ్యక్తిగత సహజ్ మంత్రంతో ధ్యానం సాధన చేయడం వల్ల కలిగే ఆనందం ఎప్పుడూ వర్ణనాతీతం. ఇది నా ఆలోచనలను స్పష్టం చేయడంలో అలాగే అశాంతిని మరియు రోజువారీ…

కృష్ణ దిలీప్
డిజిటల్ మార్కెటర్, హైదరాబాద్
వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
నేను చేరాలనుకుంటున్నాను - కానీ...
నేను సహజ సమాధి ధ్యానం నేర్చుకోవడానికి ముందే ధ్యానం నేర్చుకుని ఉండాలా?
జవాబు: పూర్వానుభవం అవసరం లేదు. సహజ సమాధి ధ్యానాన్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు.
సహజ సమాధి ధ్యాన యోగకు, గైడెడ్ (సూచనలతో కూడిన) ధ్యానానికి తేడా ఏమిటి?
గైడెడ్ మెడిటేషన్ (ధ్యానం) అనేది సూచనలు, సంగీతంతో కూడుకుని ఉంటుంది. అవి శాంతియుత వాతావరణాన్ని అందించడంలో సహాయం చేస్తాయి. మరోవైపు, సహజ సమాధి ధ్యాన యోగా అనేది మంత్రం ఆధారంగా చేసే ధ్యాన పద్ధతి. మంత్రంలో ఉన్న సూక్ష్మమైన ధ్వని మిమ్మల్ని లోతైన అవగాహన స్థాయిల్లోకి తీసుకెళ్తుంది. చైతన్యాన్ని పెంపొందిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, స్వీయ-అవగాహనను పెంపొందిచడానికి ఉపయోగించే సరళమైన, శక్తివంతమైన అభ్యాసం మిమ్మల్ని లోతైన విశ్రాంతి స్థితికి చేరుస్తుంది. గైడెడ్ ధ్యానంలో మార్గదర్శకత్వం అవసరం, కానీ సహజ సమాధి నేర్చుకున్న తర్వాత, మీరు స్వంతంగా ధ్యానం చేసుకోవచ్చు. దీనికి కేవలం 20 నిమిషాల సమయం, ప్రశాంతమైన ప్రదేశం ఉంటే చాలు. అనునిత్యమూ చేసే సాధనతో ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, మానసిక చతురత, అవగాహన, అంతర్దృష్టి నైపుణ్యాలు బలపడతాయి.
నేను సక్రమంగా ధ్యానం చేయలేకపోతున్నాను. ధ్యానం చేసే ప్రతిసారి నిద్రపోతున్నాను.
ధ్యానం చేయడం ఆరంభించిన మొదట్లో నిద్ర రావడం సర్వ సాధారణం. మీ శరీరానికి మరింత విశ్రాంతి అవసరమని ఇది సూచిస్తుంది. అలాంటి సమయాల్లో ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ధ్యానం చేయడం ఆపవద్దు ! మీరు కొనసాగిస్తూ ఉంటే, 20 నిమిషాల సహజ్ సమాధి ధ్యాన యోగం అనేక గంటల నిద్రకు సమానంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది!
సహజ సమాధి ధ్యాన యోగా చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
పరగడుపున (ఖాళీ కడుపుతో) ధ్యానం చేయడం ఉత్తమం. భోజనానికి ముందు లేదా భోజనం అనంతరం 90 నిమిషాలు విరామం ఇచ్చిన తర్వాత సహజ సమాధి ధ్యాన యోగా చేయడం ఉత్తమం. ధ్యానం కోసం 20 నిమిషాల పాటు కూర్చోవడానికి ప్రశాంతమైన ప్రదేశం కావాలి.