సుదర్శన క్రియ

ప్రపంచంలో లక్షల మంది జీవితాల్లో మార్పును తెచ్చిన ఒక శక్తివంతమైన శ్వాస ప్రక్రియ

నేర్చుకోవాలనుకుంటున్నాను

మన శ్వాసలో కొన్ని ప్రత్యేకమైన సహజ లయలను ఉంచటం ద్వారా మన శరీరం, మనసు, భావేద్వేగాలను సుదర్శనక్రియ అనేది సమన్వయం చేస్తుంది. ఈ ప్రత్యేక ప్రక్రియ ఒత్తిడిని, అలసటు, చెడు భావనలను దూరం చేసి, కోపం, చికాకు, కుంగుబాటును పోగొట్టి మిమ్మల్ని ప్రశాంతంగా, అదే సమయంలో ఉత్సాహభరితంగా, ఏకాగ్రతతో, అదే సమయంలో విశ్రాంతిగా ఉండేలా చేస్తుంది.

శ్వాసను శరీరానికి, మనస్సుకు మధ్య ఉండే బంధంగా పరిశోధనలలో తేలింది. ఒక్కొక్క భావోద్వేగానికి ఒక్కో ప్రత్యేకమైన శ్వాస రీతి ఉంటుంది. ఉదాహరణకు, మనము కోపంగా ఉన్నప్పుడు శ్వాస కుచించుకుపోవడం, మనము బాధగా ఉన్నప్పుడు శ్వాస దీర్ఘమవడం జరుగుతుంది.

అంతే కాదు, దీనికి వ్యతిరేకంగా జరిగినా కూడా అది సరైనదే అవుతుంది, అంటే మనం శ్వాస తీసుకునే విధానానికి అనుగుణంగా మనలో భావోద్వేగాలు మారుతాయి. కాబట్టి మనము వివిధ భావోద్వేగాలనుకొన్ని ప్రత్యేకమైన శ్వాస ప్రక్రియల ద్వారా మార్చుకోవచ్చు. సుదర్శన క్రియ ద్వారా మనము శ్వాసని మనకు అనుకూలంగా మార్చుకొనే నైపుణ్యం పొంది, కోపము, ఆందోళన, నిరాశ, దిగులు వంటి ఒత్తిడి కలిగించే ప్రతికూల భావజాలాన్ని పారద్రోలుతాము. అది మనస్సును పరిపూర్ణంగా, ఆనందంగా,ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు తోడుపడుతుంది.

మేధోపరంగా, మీకు అన్నీ తెలుసు, కానీ ఎప్పుడైనా ప్రతికూలమైన ఆలోచనలు వరదలా వచ్చినప్పుడు, మనము దానికి తలొగ్గుతాము. అప్పుడేం చేయాలి? సుదర్శన క్రియ, ధ్యానము మీకు అటువంటి ఆలోచనలను అధిగమించడానికి ఉపయోగపడుతాయి.

- గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్