A young woman meditating on a bench in the woods

అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రొగ్రామ్

గాఢ విశ్రాంతి, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

లోతైన మౌనాన్ని అనుభవించండి • ప్రగాఢమైన ధ్యానాన్ని • శక్తి స్థాయిలను పెంచండి  

*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

ఈ కార్యక్రమం నుండి నేను ఏమి పొందుతాను?

icon

గాఢమైన ధ్యానాన్ని అనుభవించండి

గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారి "బోలు, ఖాళీ [Hollow and Empty]" అనే సూచనలతో కూడిన ధ్యానాలు ఈ కార్యక్రమపు ప్రధాన భాగం. ఈ ధ్యానాలు మిమ్మల్ని గాఢమైన విశ్రాంతి స్థితిలో స్థిరపడేట్టు చేస్తాయి.

icon

మౌనపు లోతులను అన్వేషించండి

సాధారణంగా ఏదో ఒక పనిలో మునిగి ఉండే మీ మనస్సును దాటివెళ్లి, అపూర్వమైన ప్రశాంతతను అనుభవించండి. తద్వారా, మీరు పునరుత్తేజితమైన శక్తిని పొందగలరు.

icon

భావోద్వేగ ఒత్తిడుల నుండి ఉపశమనం

ధ్యానం నాడీ వ్యవస్థ యొక్క లోతైన పొరలలోని ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. మీ పూర్వ అనుభవాల జ్ఞాపకాలను, ముద్రలను వదిలించుకుని, పునరుత్తేజం పొందిన మీ స్వభావంతో మళ్ళీ కలుసుకుంటారు.

icon

రోగ నిరోధక శక్తిని పెంచుకోండి

ధ్యానం నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, శరీరంలో శక్తి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది, ఇది మీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.

icon

మీలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయండి

మౌనం సృజనాత్మకతకు తల్లి. ఈ కార్యక్రమం మీ మనసులో రేగే రణగొణ ధ్వనులను తగ్గించి, లోతైన విశ్రాంతిని అందిస్తుంది. తద్వారా మీలో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలు, ప్రతిభ బయటకు వస్తాయి.

icon

ఉన్నత శక్తి స్థాయిలను అనుభవించండి

ఈ కార్యక్రమపు విధానాలు మీ శరీరం, మనస్సులలో ప్రాణ శక్తిని పెంచుతాయి. తద్వారా, మీ మనస్సు  ప్రశాంతంగా, సానుకూలంగా మారుతుంది.

అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి?

సుదర్శన క్రియ నేర్చుకోవటం ద్వారా మీరు అంతర్గత శాంతిని కొన్ని క్షణాలు అనుభవించగలిగారు. రు దీన్ని ఎలా కొనసాగించగలరు ? ఈ శాంతిని మరింత లోతుగా ఎలా అనుభవించగలరు ?

దీనికి సమాధానమే ఈ ఉన్నత స్థాయి కార్యక్రమం - అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్. ఇది మీ ధ్యాన అభ్యాసాన్ని, అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. లోతైన విశ్రాంతిని, ఉపశమనాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక మౌనానికి ఈ కార్యక్రమం మిమ్మల్ని పరిచయం చేస్తుంది. కొన్ని రోజులపాటు ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఉండటం ఎవరికైనా సులభం కాదు. కానీ ఈ కార్యక్రమం లోని అత్యంత శక్తివంతమైన ధ్యాన విధానాల ద్వారా మీరు గాఢమైన నిశ్శబ్దపు అనుభవాన్ని సులభంగా పొందగలరు. ఇది మీకు జీవితంలోని అన్ని రంగాలలోనూ సమతుల్యతను పొందేందుకు సహాయపడుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా పూర్తి విశ్రాంతిని పొందుతారు. మీ నిజమైన సామర్థ్యాన్ని కనుగొంటారు; మీ నిజమైన ఆత్మను అర్థం చేసుకుంటారు. మీ అంతర్గత శక్తిని వెలికి తీసి, నిజమైన స్వభావాన్ని గ్రహించి, పూర్తిగా పునరుజ్జీవనం పొందుతారు. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతారు. 

దీనిని నేర్చుకోవటానికి అర్హతలు ఏమైనా ఉన్నాయా?

  • మీ వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.
  • మీరు ఆన్‌లైన్ మెడిటేషన్ & బ్రెత్ వర్క్‌షాప్ / హ్యాపినెస్ ప్రోగ్రామ్ / యూత్ ఎంపవర్మెంట్ సెమినార్ (YES!+) / స్టూడెంట్ ఎక్సలెన్స్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (SELP) - ఈ కార్యక్రమాలలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
  • మీరు కార్యక్రమం ఉన్న రోజులలో ఇతరత్రా పనులేమీ పెట్టుకోవద్దు. అప్పుడే మీరు ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా పాల్గొని, మీకు అవసరమైన ప్రగాఢమైన విశ్రాంతిని పొందడానికి ీలు కలుగుతుంది.

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఒక ఉద్యమాన్ని వారు చేపట్టారు.
మరింత సమాచారం

నేను ఈ కోర్సును తీసుకోవాలనుకుంటున్నాను కాని…

నేను హ్యాపినెస్ ప్రోగ్రామ్ చేశాను, దానితో సంతోషంగా ఉన్నాను. అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా నేను ధ్యాన నిపుణుడిని కావాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను యోగి కావాలని ప్రయత్నించడం లేదు.

మీ కారుకు ప్రతీ ఆరు లేదా పన్నెండు నెలలకు సర్వీసింగ్ చేయవలసిన విధంగానే, మీ శరీరాన్ని, మనస్సును కూడా నిర్ణీత కాలవ్యవధి అనంతరం తిరిగి సరి చేయించుకోవడం, పునరుత్తేజం పొందడం అవసరం. OMBW / హ్యాపినెస్ ప్రోగ్రామ్‌తో మీరు అనుభవించిన ప్రారంభ శక్తిని, సంతోషాన్ని పెంచుకోవడానికి, సరైనవిధంగా నిర్వహించడానికి అడ్వాన్స్‌డ్ మెడిటేషన్‌లు ఒక మార్గం. ధ్యానంలో లోతుగా వెళ్లడం ద్వారా, మీరు గాఢమైన విశ్రాంతిని అనుభవిస్తారు; మీరు యోగి అవ్వరు! వాస్తవానికి, చాలా మంది లోతైన విశ్రాంతిని అనుభవించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్లీ మళ్లీ  చేస్తుంటారు;  ఈ కార్యక్రమం చేసిన ప్రతిసారీ వారు ప్రత్యేకమైన అవగాహనలను పొందుతూ ఉంటారు.

నేను ఇంకా చిన్నవాడిని, ఇంత లోతైన ధ్యానం చేయడానికి నాకు ఇంకా సమయం రాలేదు. నా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఈ దశలో నేను అంత ఒత్తిడికి గురికావడం లేదు కాబట్టి, నాకు ఈ తరహా ధ్యానం అవసరం లేదు.

ఇప్పుడు మీరు అంత ఒత్తిడికి గురి కావడం లేదు - చాలా చక్కటి విషయం. అయితే, కాలక్రమేణా మీ పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఆ సమయంలో ఒత్తిడికి గురై, దానిని ఎదుర్కోవడానికి వేచిఉండటం కంటే, ముందుగానే సిద్ధం కావడం మంచిది కాదా? పరీక్షలు సంవత్సరం చివరిలో ఉన్నాయి కదా అని, పరీక్ష సమీపించేవరకు చదువుకోకుండా వేచి ఉండరు కదా? మీ చేతిలో డబ్బులు అయిపోయే వరకు డబ్బు సంపాదించడానికి కూడా వేచి ఉండరు. మీరు ముందుగానే సిద్ధం చేసుకుంటారు. అదే విధంగా, ఒత్తిడి తలెత్తే ముందే దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించే కొన్ని ప్రక్రియలతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని నిర్మించుకోవాలి. ఇవి మీలో ఒత్తిడి రావడానికి ముందే దాన్ని ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తాయి.

నేను చాలా వృద్ధుడిని. ఈ కార్యక్రమం చేయగలనా? నా వయస్సు 65 సంవత్సరాలు. నేను దీన్ని చేయగలనా అని అనుమానం.

ఈ కార్యక్రమం మీకు శక్తిని పెంచే శ్వాస విధానాలను నేర్పిస్తుంది. లోతైన మౌనం ద్వారా గాఢమైన విశ్రాంతిని అనుభవిస్తారు. ఈ ప్రక్రియలు సహజమైనవి, మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమం కోసం ఎవరూ వయసు మీరినవారు కారు. వయసు ఇక్కడ అస్సలు సమస్య కాదు.

ఈ కార్యక్రమం మౌనం గురించి చాలా చెబుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించవచ్చా ? ఈమెయిల్స్, SMS మెసేజ్ లాంటివి చేయవచ్చా?

కార్యక్రమం నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి, సాధ్యమైనంత వరకు సందేశాలు, ఇమెయిల్‌లు, మౌఖిక సంభాషణలను తగ్గించవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విరామం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీలోనికి లోతుగా ప్రవేశించి, మీ గురించి మీరు మరింత తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది. వినడానికి కష్టంగా ఉన్నా, నిజానికి ఇది చాలా సులభం! ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, మీరు తప్పక మీ కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు.

ఈ ధ్యానం విపాస్సనా ధ్యానంతో సమానమా?

కాదు, అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ (AMP) విపస్సనా ధ్యానంతో సమానం కాదు. ఒక వ్యక్తి అనుభవించగల అత్యంత శక్తివంతమైన అనుభవంగా దీనిని పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందే అంతర్గత జ్ఞానం, లోతైన అవగాహన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తో సహా వివిధ ప్రముఖ సంస్థల పరిశోధనలు, అధ్యయనాలు మేము అనుసరించే ధ్యాన పద్ధతులు మానసిక చురుకుదనం, బలమైన రోగ నిరోధక శక్తి, మెరుగైన జీవన నాణ్యత స్థితిని సాధించడంలో సహాయపడతాయని నిర్ధారించాయి.

ఈ ప్రోగ్రామ్ కోసం నేను రోజులో ఎన్ని గంటలు అందుబాటులో ఉండాలి?

ఈ కార్యక్రమం మొత్తం మూడు రోజులు ఉంటుంది. ఇది ఉదయం 6 లేదా 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 లేదా 9 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, మీ రోజువారీ జీవితం నుండి ఈ మూడురోజులూ పూర్తిగా సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు మీరే ఈ సెలవును బహుమతిగా ఇచ్చుకోండి. ఈ సమయంలో, మీరు మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతి తీసుకోవడానికి, పునరుజ్జీవం పొందడానికి అవకాశం ఇచ్చినవారవుతారు.

నేను మధ్యలో ఎన్ని విరామాలు పొందగలను?

ఈ కార్యక్రమం మొత్తం మీ రోజువారీ జీవితం నుండి విరామం ఇవ్వడానికి రూపొందించబడింది! అయితే, మధ్యలో కాలకృత్యాలకు, స్నానం, భోజనం, విశ్రాంతి మొదలైన వాటికి తగినంత వ్యవధి ఉంటుంది.

ఈ కార్యక్రమంలో నాకు ఏదైనా మంత్రం అందించబడుతుందా?

ఈ కార్యక్రమంలో వ్యక్తిగత మంత్రాలు లేకుండా, మార్గదర్శక ధ్యానాల శ్రేణిని కలిగి ఉంది. అయితే, మీకు మంత్ర ధ్యానంపై ఆసక్తి ఉంటే, మీరు మా సహజ్ సమాధి ధ్యాన యోగా కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు

నేను పాల్గొనకుండా అడ్డుపడే వైద్య పరిస్థితులు ఏవైనా ఉన్నాయా?

గతంలో మీరు బేసిక్ OMBW/హ్యాపినెస్ ప్రోగ్రామ్ చేసి ఉంటే, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఎలాంటి సమస్య ఉండకూడదు. అయినప్పటికీ, మీకేవైనా అనారోగ్యాలు / సమస్యలు ఉంటే, వాటి గురించి మీ టీచర్ కు చెప్పడం మంచిది.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను శాకాహారిగా ఉండాలా?

అస్సలు లేదు. ఈ కార్యక్రమానికి ఆహార ప్రాధాన్యతలు పట్టింపు లేదు. అయితే, మీరు కార్యక్రమ సమయంలో తేలికపాటి శాకాహార ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. ఇది మీకు ధ్యానంలో మరింత లోతుగా వెళ్లడానికి సహాయపడుతుంది.

‘సుదర్శన చక్ర క్రియ’ అనే కొత్త టెక్నిక్ గురించి విన్నాను. ఇది ఈ కార్యక్రమంలో భాగమా?

‘సుదర్శన చక్ర క్రియ’ అనేది ఒక శక్తివంతమైన విధానం. అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ (AMP) పూర్తిచేసిన తరువాత అది నేర్చుకోవడానికి అర్హులు అవుతారు. ఇది మీ రోజువారీ సాధనకు ఉచిత అప్‌గ్రేడ్. కార్యక్రమం పూర్తయిన తర్వాత, మీ శిక్షకునితో సంప్రదించవచ్చు.