మా గురించి

వ్యక్తులను బలోపేతం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయటమే మా లక్ష్యం

ప్రపంచవ్యాప్త ఉద్యమం...

  • 44 సంవత్సరాల వారసత్వం
  • 180 దేశాల్లో 10,000+ కేంద్రాలు
  • 80 కోట్లకు పైగా జీవితాలలో ప్రభావవంతమైన మార్పు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ లాభాపేక్ష లేని విద్యా, మానవతా విలువల సంస్థ 1981లో ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారిచే స్థాపించబడింది. ఈనాడు 180 దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గురుదేవుల వారు "ఒత్తిడి లేని, హింస లేని సమాజం ఉంటే తప్ప శాంతిని సాధించలేము" అనే గురుదేవుల ఆకాంక్షకు అనుగుణంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంఘం వైవిధ్యమైనది, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక సూత్రం అని, జీవితాన్ని సంపూర్ణంగా జీవించే తత్వశాస్త్రమని చెప్పవచ్చు. దీనిని సంస్థ కంటే ఒక ఉద్యమం అని చెప్పటం బాగుంటుంది. వ్యక్తి, తనలో తాను శాంతిని కనుగొనడం మరియు మన సమాజంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, జాతీయతలతో కూడిన ప్రజలను ఏకం చేయడం; తద్వారా మానవ జీవితాన్ని మెరుగుపరచుకోవడం మౌలిక లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

- గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

కేంద్రాలు

10,000+ కేంద్రాలు, 180 దేశాల్లో మా ఏకైక లక్ష్యం ప్రపంచ శాంతి, మనమంతా ఒకే కుటుంబం (వసుధైవ కుటుంబకం).

సంప్రదించండి

భారతదేశ కార్యాలయం

+91 80 6761 2345, +91 80 2843 2833 (ఫ్యాక్స్)

కార్యక్రమాలు మరియు నమోదు విచారణ:  support@artofliving.online

ఆఫీస్ ఆఫ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్, 21వ కి.మీ., కనకపుర రోడ్, ఉదయ్‌పురా, బెంగుళూరు సౌత్, కర్ణాటక - 560082, ఇండియా secretariat@artofliving.org

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

వివిధ జాతులు, సంస్కృతులు, ఆర్థిక, సామాజిక స్థాయిలు, దేశాలకు చెందిన ప్రజలను శ్రీశ్రీ ఏకం చేయగలిగారు. 180కి పైగా దేశాలలో వ్యాపించి ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమాజం ఒక ఆధ్యాత్మిక వసుధైవ కుటుంబాన్ని నెలకొల్పింది. గురుదేవుల సందేశం ఒక్కటే: “హింస, ద్వేషాలపై ప్రేమ, జ్ఞానాలదే పైచేయి అవుతుంది.” ఇవి కేవలం మాటలు కావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా నిరంతరమూ చర్యలుగా, ఫలితాలుగా మారుతూ సమాజాన్ని మార్చుతున్న సత్యవాక్కులు.
మరింత సమాచారం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉచిత పాఠశాలలు

గిఫ్ట్ ఎ స్మైల్

ప్రతీ ఏటా 1,00,000+ మందికి పైగా పేద పిల్లలకు సమగ్రమైన విద్యను మేము అందిస్తున్నాము. దీనికి మీ విరాళాలు అత్యంత అవసరం. మీరిచ్చే విరాళాలలో దాదాపు 95శాతానికి పైగా ఈ కార్యక్రమం కోసమే వినియోగించబడతాయి.

విరాళం ఇవ్వండి