Meditation session during happiness program

హ్యాపినెస్ ప్రొగ్రామ్

ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది ఎంతో ఇష్టపడుతూ అభ్యసిస్తున్న, అతి శక్తివంతమైన శ్వాస ప్రక్రియ - సుదర్శన క్రియ™ ను నేర్చుకోండి.

ఒత్తిడిని తొలగిస్తుంది • మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది • రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

3 రోజులు, లేదా 6 రోజుల పాటు, రోజుకు 2-3 గంటలు నేర్చుకోవచ్చు

*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

ఈ ప్రోగ్రామ్ వలన నాకు ఏమి లాభం?

icon

మానసిక ప్రశాంతత పెరుగుతుంది

మనస్సును శాంతపరచి, మీ దైనందిన జీవితంలో మరింత ఆనందాన్ని కలిగించే ప్రభావవంతమైన ప్రక్రియలను మీరు నేర్చుకుంటారు.

icon

మరింత శక్తి

అలసటను అధిగమించి, అధిక శక్తి స్థాయిలను అనుభవించగలరు. ఏ రోజు పనులు ఆ రోజే పూర్తి చేయగలరు.

icon

ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి

ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి, క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా విశ్రాంతిని అందించే ప్రక్రియలను నేర్చుకుంటారు. ఈ ప్రక్రియలపై జరిగిన అనేక శాస్త్రీయ పరిశోధనలు వీటి ప్రభావాన్ని ధృవపరుస్తున్నాయి.

icon

మీ మనస్సు పై నియంత్రణ

ఆధునిక జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ప్రాచీనకాలపు రహస్యాలను ఈ కార్యక్రమం మీకు అందిస్తుంది. దీనివలన మీరు మెరుగైన అవగాహనతో, జ్ఞానంతో జీవించగలుగుతారు.

ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం

సుదర్శన క్రియ గురించి విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతుంది?

నిపుణులచే సమీక్షించబడి, ప్రపంచవ్యాప్తంగా పత్రికలలో ప్రచురించబడిన 100కు పైగా అధ్యయనాల ప్రకారం, ఈ ప్రక్రియను నేర్చుకున్నవారిలో:

33%

6 వారాలలో పెరిగింది

రోగనిరోధక శక్తి

57%

6 వారాలలో తగ్గాయి

ఒత్తిడి కలిగించే రసాయనాలు

21%

ఒక్క వారంలోనే పెరిగింది

జీవితం పట్ల సంతృప్తి

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఒక ఉద్యమాన్ని వారు చేపట్టారు.
మరింత సమాచారం

నేను చేరాలనుకుంటున్నాను కానీ…

ఈ ప్రక్రియ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయా?

ఎట్టి పరిస్థితిలోనైనా చెక్కుచెదరని చిరునవ్వు మాత్రమే మీకు లభించే ఫలితం!🙂. సుదర్శన క్రియను ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు అభ్యసిస్తూ, ఆరోగ్యపరమైన లాభాలను పొందుతున్నారు. ఈ ప్రక్రియలను అభ్యసించటం పూర్తిగా సురక్షితం.

మీకు ఉబ్బసం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, వెన్నునొప్పి మొదలైనవి ఉంటే, క్లాసులో టీచర్లు మీకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేస్తారు.

ఈ అభ్యాసం నా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా?

ఖచ్చితంగా అవును! సుదర్శన్ క్రియ యొక్క క్రమమైన అభ్యాసం - నిద్రను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడి మరియు మానసిక కుంగుబాటు స్థాయిలను తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ వర్క్ షాప్ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తుల ఈ ప్రశంసా పత్రాలు చదవగలరు. మీ రోగాలను మీ టీచర్ కి ముందే తెలియజేయండి, తద్వారా వారు మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, మీరు ఉత్తమ అనుభవాన్ని పొందడానికి మార్గదర్శనం చేయగలరు.

మీరు ఫీజులు ఎందుకు వసూలు చేస్తారు?

మొదటి కారణం, మీరు మీ సమయాన్ని ఈ వర్కుషాప్ కి కేటాయించి, నిబద్ధతతో నేర్చుకునేలా చేయటం కోసం. రెండవ కారణం, మీకు అవసరమైన జీవిత నైపుణ్యాలను నేర్పించడంతో పాటు, మీ విరాళం భారతదేశంలో అనేక సేవా ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది.
ఉదాహరణకు - 70,000 మంది గిరిజన పిల్లలకు పాఠశాల విద్య అందించడం, 43 నదులను పునరుద్ధరించడం, 2,04,802 గ్రామీణ యువతకు జీవనాధార నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారిని శక్తివంతంగా చేయడం, ఇంకా 720 గ్రామాలను సౌర దీపాలతో వెలిగించడం.

నాకు ఎలాంటి ఒత్తిడీ లేదు. ఈ వర్క్ షాప్ లో ఎందుకు చేరాలి?

మీరు ఒత్తిడిలో లేకపోవడం ఎంతో హర్షించదగిన విషయం! మీరు ఉత్తమమైన జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే, ఓసారి ఈ విషయాన్ని పరిగణించండి : మీరు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే పొదుపు చేయడం ప్రారంభిస్తారా? లేదా మీకు అనారోగ్యం కలిగినప్పుడు మాత్రమే వ్యాయామం ప్రారంభిస్తారా? కాదు కదా ?
అలాగే , మీకు అవసరమైన సమయాలలో ఉపయోగించేందుకు శక్తి నిల్వలు ఎంతో అవసరం. కాబట్టి మీ ఆంతరిక బలాన్ని, పునరుద్ధరణ శక్తిని పెంపొందించుకోవటం చాలా ముఖ్యం. ఇది ఆలోచించాల్సిన విషయం. అలా కాదంటే, మీ రుఒత్తిడికి గురయ్యే వరకు వేచి చూస్తానంటే, ఉండవచ్చు. నిర్ణయం మీదే! ఏదేమైనా, ఈ వర్క్‌షాపు మీ సహాయం కొరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.