యూత్ ఎ౦పవర్మె౦ట్ సెమినార్ – ఎస్ (YES) - యుక్త వయస్సు పిల్లల లోని శక్తి యుక్తులను పెంపొందిచు కార్యక్రమము

పిల్లలో కుడా తీవ్రమైన ఒత్తిడి ఈరోజులలో అనివార్యస్థితి. తన తోటి వాళ్ళని చూసి కలిగే ఒత్తిడి తీవ్రమైనది. అలాగే  పరీక్షలు, తల్లితండ్రులు,భాందవ్యాలు, ఆటలు, మరియు ప్రవేశ పరీక్షలు వల్ల కలిగే ఒత్తిడి. మీరు ప్రతి వీటన్నిటినీ ఎలా నిర్వహి౦చగలరు? ఎస్ (YES) కార్యక్రమము తేలికపాటి యోగాసనముల ద్వార మీ శారీరకమైన శక్తిని, కొన్ని రకములైన శ్వాస క్రియలు మరియు సుదర్శన క్రియ ద్వారా మీ మానసిక శక్తిని పె౦పొ౦దిస్తు౦ది.

అందరు కలసి ఒకరిని గురించి ఒకరు తెలుసుకొనే పద్దతులు, సముహముగా కూర్చొని మాట్లాడుకోవడము, చాలా వినోదములతో  కూడిన ఆటలతో ఈ కార్యక్రమమువుంటుంది. స్నేహితులతో మెలిగే పద్దతి, బంధుత్వములను  చక్కగా నిర్వహి౦చడ౦, చదువులలో చక్కని ఏకాగ్రత కలిగిఉ౦డడ౦, మీలో ఉన్న శక్తియుక్తులను పె౦పొ౦ది౦చుకోవడ౦ – వీటన్నిటికి తోడ్పడే చిట్కాలు నేర్చుకో౦డి.

సుదర్శన క్రియ యొక్క శక్తి వలన సరియైన  నిర్ణయములను తీసుకోగల శక్తిని పొందుతారు. మానసిక దౌర్భల్యము  మరియు సభా పిరికితనమును తేలికపాటి పద్దతుల ద్వారా పోగొట్టు కొనగలరు. మిమ్మల్ని ప్రేమిస్తూ అందరికి ప్రేమను పంచుతూ, సమస్యలను  ఒత్తిడితో కాక, చక్కని చిరునవ్వుతోపరిష్కరించ గలుగుతారు.

రండి ఈ ప్రపంచమును ప్రత్యేక దృష్టితో చుడండి.

Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More