
సుదర్శన క్రియ ఫాలో-అప్
మీ అభ్యాసాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లండి.
సానుకూల దృక్పథం గల, ఆధ్యాత్మిక సమాజం యొక్క సహవాసాన్ని ఆస్వాదించండి. పురాతన జ్ఞానాన్ని చర్చించండి. మీ రోజువారీ అభ్యాసాన్ని నిలకడగా కొనసాగించేందుకు ప్రేరణ పొందండి.
* ముఖ్య సూచన: అధీకృత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ ద్వారా ఏదో ఒక కోర్సులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన క్రియను నేర్చుకున్న వారికి మాత్రమే ఫాలో-అప్ అందుబాటులో ఉంటుంది.
ఉచిత ఫాలో-అప్‌లు దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో నిర్వహించబడతాయి.
మీ దగ్గరలోని ఫాలో-అప్ కేంద్రాన్ని కనుక్కోండిఫాలో-అప్ లో చేరితే నాకు ఏమి లభిస్తుంది?

మీ అభ్యాసాన్ని రిఫ్రెష్ చేసుకొండి
హ్యాపీనెస్ ప్రోగ్రాం లో నేర్చుకున్న పద్ధతులను పునరుద్ధరించండి. మీ రోజువారీ సాధనను నిలకడగా కొనసాగించే స్ఫూర్తిని పొందడానికి లేదా స్ఫూర్తినివ్వడానికి ఫాలో-అప్‌లు ఒక అద్భుతమైన స్థలం.

ఆచరణాత్మక జ్ఞానం
ప్రాచీన జ్ఞానాన్ని చర్చించి, ఆధునిక జీవితానికి అనువుగా దాన్ని ఎలా అన్వయించాలో నేర్చుకోండి. మీ కఠిన సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోండి.

సమాజంతో అనుబంధం
భారతదేశంలోని ఏ నగరంలోనైనా మరియు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో సానుకూల-ఆలోచనాపరులు, ఆధ్యాత్మిక సమాజం యొక్క సహవాసాన్ని ఆస్వాదించండి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలో-అప్స్ అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాలు వారానికోసారి గ్రూప్ ఫాలో-అప్‌లను అందిస్తాయి, ఇవి ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లేదా యెస్ ప్లస్ (Yes Plus) ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన వారందరికీ అందుబాటులో ఉంటాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు ఈ సెషన్‌లను నిర్వహిస్తారు, ఇవి ఉచితంగా అందించబడతాయి.
గ్రూప్ ఫాలో-అప్‌లను – ‘సత్సంగాలు’ అని కూడా పిలుస్తారు : శ్వాస పద్ధతులతో మీ అనుభవాన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి, మీ ఇంటి అభ్యాసాన్ని బలపరచడానికి మరియు తోటి అభ్యాసకులతో సమాజంలో ఉండడానికి ఒక ఉత్సాహభరితమైన స్థలం.