
ఆన్ లైన్ మెడిటేషన్-బ్రెత్ వర్క్ షాప్
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన శ్వాస ప్రక్రియ - సుదర్శన క్రియ™ ను నేర్చుకోండి. దీనిని ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది ఎంతో ఇష్టపడుతూ ఆచరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది • ఒత్తిడిని తొలగిస్తుంది • సంబంధాలను మెరుగుపరుస్తుంది • మీ జీవితాన్ని ఆనందంగా, ప్రయోజనకరంగా మార్చుతుంది
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
ఇక్కడ రిజిస్టర్ చేసుకోండిప్రయోజనాలు
శ్వాస యొక్క రహస్యాలను తెలుసుకోండి లోతైన ధ్యానం అనుభవించండి.

ఒత్తిడి నుండి త్వరగా ఉపశమనం పొందండి
ఈ కార్యక్రమం ద్వారా మీరు యోగ లోని ప్రత్యేక శ్వాస ప్రక్రియలను నేర్చుకుంటారు. ఇవి ఒత్తిడిని తగ్గించి, ఆందోళన, మానసిక కుంగుబాటు వంటి ప్రవృత్తుల నుండి ఉపశమనం కలిగించి, మీ మనస్సుకు స్పష్టతను, సానుకూల స్థితిని తిరిగి తీసుకొస్తుంది.

మనసు నియంత్రణతో స్థైర్యం పొందండి
మనస్సు యొక్క స్వభావాన్ని తెలుసుకున్నపుడు మీకు జీవితం పట్ల మంచి దృష్టికోణం లభిస్తుంది. దానివలన గతంలో మీరు అనుభవించిన చికాకులు, అసహనం, దిగులు వంటివి ఇకపై ఇబ్బంది పెట్టలేవు.

సుదర్శన క్రియ తో సులభంగా ధ్యానంలోకి వెళ్ళచ్చు
ధ్యానం చేసేందుకు ప్రయత్నించినపుడు మనసు ఊగిసలాడుతూ ఉండటంతో విసిగిపోయారా? ఇక్కడ మీరు నేర్చుకునే ప్రక్రియ లోని ముఖ్యమైన విధానం ‘సుదర్శన క్రియ’. ఇది చాలా సులువైనది, అత్యంత శక్తివంతమైనది. ఇది మిమ్మల్ని లోతైన ధ్యానస్థితికి తీసుకువెళ్ళగలదు.

ఉత్తమ మార్గదర్శకత్వంలో యోగ, ధ్యానం నేర్చుకొని ప్రగాఢమైన విశ్రాంతిని పొందండి
మేము అందించే అనాయాసమైన విధానంతో, సులభంగా యోగాసనాలను నేర్చుకోవచ్చు. వాటిని జీవితంలో సునాయాసంగా అంతర్భాగంగా చేసుకొని గొప్ప ఆరోగ్యాన్ని, మంచి మనోదృష్టిని, విశ్రాంతిని పొందవచ్చు. గురువు పర్యవేక్షణలో సాగే ఈ ధ్యాన పద్ధతులు మీ అంతరంగ సౌందర్యాన్ని మీ అనుభవంలోకి తెస్తాయి.
ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం
సుదర్శన క్రియ గురించి విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతుంది?
నిపుణులచే సమీక్షించబడి, ప్రపంచవ్యాప్తంగా పత్రికలలో ప్రచురించబడిన 100కు పైగా అధ్యయనాల ప్రకారం, ఈ ప్రక్రియను నేర్చుకున్నవారిలో:
▴ 33%
6 వారాలలో పెరిగింది
రోగనిరోధక శక్తి
▴ 57%
6 వారాలలో తగ్గాయి
ఒత్తిడి కలిగించే రసాయనాలు
▴ 21%
ఒక్క వారంలోనే పెరిగింది
జీవితం పట్ల సంతృప్తి
సుదర్శన క్రియ శరీరంలో సామరస్యాన్ని చేకూరుస్తుంది

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆధ్యాత్మిక సాధన

జీవితంలో పెను మార్పును తీసుకొచ్చే

వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
నాకు ఈ శిక్షణ వర్కుషాప్ లో పాల్గొనాలని ఉంది కానీ...
ఈ సాధన నా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా?
అవును, ఖచ్చితంగా ! క్రమం తప్పకుండా చేసే సుదర్శన క్రియ వలన తెలిసిందేంటంటే నిద్ర బాగా పట్టడం, రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరచడం, ఒత్తిడి, నిరాశానిస్పృహల స్థాయిని తగ్గించడం జరుగుతాయి. మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఈ శిక్షణ పొందిన వారు పంచుకున్న ప్రశంసా పత్రాలను చదవడమే. మీరు శిక్షణ కార్యక్రమంలో చేరడానికి ముందే మీ ఆరోగ్య సమస్యల గురించి మీ శిక్షకులకు తెలియజేస్తే, వారు దానికి అనుగుణంగా సరైన శిక్షణ అందించగలరు!
కేవలం నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం వలన నా జీవితం మార్పు చెందుతుందా?
జీవితం ఒక క్షణంలో మారవచ్చు. మీకు ఇష్టమైనవారితో గడిపే ఒక్క క్షణమైనా, లేదా కారు నడిపే సమయంలో అవగాహన కోల్పోయిన ఒక్క క్షణమైనా మీ జీవితాన్నే మార్చేయగలదు. ఒక ఉద్వేగపూరితమైన క్షణం మిమ్మల్ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్నే మార్చేయగలదు. మీ జీవితాన్ని మార్చడమే కాక ఈ శిక్షణ కార్యక్రమం ఇచ్చే ఉపకరణాల వల్ల మీరే మీ జీవితాన్ని బాగుచేసుకొనే విధంగా సిద్ధమవుతారు. ఈ నాలుగు రోజుల్లో మీరు సుదర్శన క్రియను నేర్చుకుంటారు, ఇది ఒక విస్తృతంగా పరిశోధదించబడి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అవలంబించిన ప్రక్రియ. ఈ సాధన చేసినవారు వారి జీవితాల్లో గొప్ప మార్పును అనుభవించారు.
మీకు ఇవే కాక, జీవిత కాలం ఉచిత ఫాలో అప్ సమావేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో పరిచయాలు పెంపొందుతాయి. మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ఉన్నత స్థాయి శిక్షణా కార్యక్రమాలను కూడా చేసే అవకాశం లభిస్తుంది. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
ఈ సాధన వలన ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?
ఎప్పటికీ నిలిచి ఉండే చిరునవ్వే దీని ప్రభావం 🙂 సుదర్శన క్రియను ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు అభ్యసిస్తూ, ఆరోగ్యపరమైన లాభాలను పొందుతున్నారు.
ఈ సాధన పూర్తిగా సురక్షితమైనది. మీకేమైనా దీర్ఘకాలంగా ఆస్తమా (ఉబ్బసం వ్యాధి), అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, వెన్నెముక సమస్యలుంటే తగిన విధంగా శిక్షణ మార్చి ఇవ్వబడుతుంది .
నాకు ఎలాంటి ఒత్తిడీ లేదు. నాకు ఈ శిక్షణ అవసరం ఏమిటి?
మీకు ఒత్తిడి లేకుంటే చాలా మంచిదే. మీరు గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఒక్క సారి ఇది ఆలోచించండి: మీ దగ్గర డబ్బు అయిపోయే సమయంలోనే పొదుపు మొదలుపెడతారా? ఏదైన ఆరోగ్య సమస్య ఎదురైనపుడే వ్యాయామం మొదలుపెడతారా? కాదు కదా? కాబట్టి, అటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని, దానికి కావలసిన అంతర్గతమైన శక్తిని ముందే పెంపొందించుకోవడం మంచిది కదా ? లేదా, మీరు ఒత్తిడి పెరిగే సమయం ఆసన్నమయ్యేవరకు వేచి వుండచ్చు. నిర్ణయం మీదే ! ఏదైనా, ఈ శిక్షణ కార్యక్రమం ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మీరు రూ.3000/- ఎందుకు వసూలు చేస్తున్నారు?
నిజానికి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నవారు మేము మరింత ఎక్కువే వసూలు చేయాలని సిఫార్సు చేశారు. ఎందుకంటే ఈ విరాళం - మీకు జీవితంలో అవసరమయ్యే విద్యలను నేర్పడమే కాక, మీ డబ్బు భారత దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు : 70,000 గిరిజన బాలలను పాఠశాలలకు పంపడం, 43 నదులను పునరుద్దరించడం, 2,04,802 గ్రామీణ యువతకు జీవనోపాధి నైపుణ్యాలను పెంపొందించడం, 720 గ్రామాలకు సౌర విద్యుత్ శక్తిని కలుగజేయడం మొదలైనవి. ఈ రుసుము సరిపోదని, మరింత ఎక్కువ చెల్లించాలని మీరు కూడా అనుకుంటే మాకు ఏ అభ్యంతరమూ లేదు.