Service - VBI Volunteers

కర్మ యోగ

యువ నాయకత్వ శిక్షణా కార్యక్రమం (YLTP)

మీ ఆత్మవిశ్వాసం, అంతర్గతశక్తితో సమాజంలో పరివర్తన కోసం కృషి చేయండి

7 రోజుల వర్క్‌షాప్

*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది

రిజిస్టర్ చేసుకోండి

కార్యక్రమ ప్రయోజనాలు

ఈ కార్యక్రమంలో ఇప్పటికే లక్షమందికి పైగా యువత చేరి, తమ జీవితాలను మార్చుకున్నారు, సమాజములో మార్పుకు దోహదపడ్డారు.

icon

సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్నిపెంపొందించుకోండి

సవాళ్లను ఎదుర్కొని మీ లక్ష్యాన్ని సాధించేందుకు మీలో ఉన్న శక్తిసామర్థ్యాలను, ఆత్మ విశ్వాసాన్ని గుర్తించండి.

icon

మానసిక దృఢత్వాన్ని సాధించండి

మానసిక స్పష్టత మెరుగుపర్చుకోండి, ఆత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందించుకుని, కుంగుబాటు, కోపం, మానసిక ఒత్తిడి నుండి విముక్తులు కండి

icon

గొప్ప నాయకుడు అవ్వండి

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించే నదుల పునరుజ్జీవం, మరుగు దొడ్లు, పాఠశాలలు నిర్మించటం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాల నిర్వహణలో పాల్గొని మీలో ఉన్న నాయకత్వం లక్షణాలను మేల్కొలపండి.

icon

సూక్ష్మ వ్యాపారవేత్త అవ్వండి

వ్యాపారవేత్త కావాలనే మీ కలను ఈ ప్రోగ్రాం ద్వారా నిజం చేసుకొండి, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన నైపుణ్యాలు అన్నీ మీకు అందిస్తాము

icon

ఒక్క ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దండి

ఆనందకరమైన, సుసంపన్నమైన గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాలు సంపాదించుకోండి.

గ్రామీణ యువకుల సాధికారత ప్రోగ్రాం

గ్రామీణ యువతకు తన జీవితాలను తామే నిర్వహించుకోవటం కోసం వారికి మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలు ఇందులో నేర్పబడతాయి.

మరింత తెలుసుకోండి

మహిళలకోసం ప్రత్యేకంగా రూపొందించిన కర్మయోగ (WLTP)

ఆత్మరక్షణ కోసం శిక్షణ

ఋతుక్రమం సమయంలో ఆరోగ్య సంరక్షణ

ప్రభుత్వ పథకాలు, మహిళలకు సంబంధించిన చట్టాలపై వారికి అవగాహన కల్పించటం

స్థానిక పరిపాలనలో, గ్రామ సభలలో మహిళల పాత్ర మొదలైనవాటిపై దృష్టి సారిస్తుంది.

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఒక ఉద్యమాన్ని వారు చేపట్టారు.
మరింత సమాచారం

నాకు ఈ కార్యక్రమంలో చేరాలని ఉంది, కాని…

ఈ కార్యక్రమం పూర్తివారంరోజులు నిర్వహించబడుతుందా?

అవును, ఇది పూర్తి ఏడు రోజుల కార్యక్రమం. రోజు మధ్యలో అవసరమైన విరామాలు, విశ్రాంతి సమయాలు ఉంటాయి.

ఈ ఏడు రోజుల్లో ఏమేం నేర్పబడుతాయి?

యోగ, ధ్యానం, సుదర్శన క్రియ, అనుభవపూర్వకమైన జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, భావవ్యక్తీకరణ నైపుణ్యం, ఉపాధి నైపుణ్యాలు, సమాజ బృందాల నిర్వహణా నైపుణ్యం మీకు నేర్పబడతాయి.

సమాజానికి మార్పు తీసుకురావాలనే అనే ఆసక్తి నాకు లేదు, మరి ఈ కార్యక్రమం నాకు ఎలా సహాయపడుతుంది?

ఈ కార్యక్రమం మీకు మానసిక ,శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో, పనిలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.

ఈ కార్యక్రమం ప్రత్యేకించి గ్రామీణ యువత కోసమేనా?

ఈ ప్రోగ్రాం ప్రాథమికంగా 18 నుండి 35 వయసులో ఉన్న యువత కోసం నిర్వహిస్తున్నాము.

నేను నగరంలో నివసిస్తున్నాను , కానీ నాకు గ్రామాల్లో సేవ చెయ్యాలి అని కోరిక. నాకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందా?

తప్పకుండా! మీకు గ్రామాల్లో సేవా చేసి అవకాశం దొరుకుతుంది. అందుకు కావలసిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.