చిన్న పిల్లలకు, యుక్త వయసు వారికి కార్యక్రమములు
ఒత్తిడిని తొలగించండి, ఏకాగ్రతను, రోగ నిరోధక శక్తిని పెంచుకోండి
పిల్లలకు సాధికారత, మానసిక ప్రశాంతతను, ఆలోచనలలో స్పష్టతను కలిగించే విధానాలను బోధించడం ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు పిల్లల పరిపూర్ణ ఎదుగుదలకు సహకరిస్తాయి. తద్వారా వారి భావాలలో, దృక్పథంలో స్థిరత్వం, తమలోని మంచిని ఇతరులతో పంచుకోవాలనే గుణాన్ని పోషించడం, సామరస్యంగా మెలగడం, ఇతరులతో కలసిమెలసి ఉండే భావజాలం ఏర్పడడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాలు యువకులకు ఆచరణాత్మకమైన విధానాలను, పరిశోధనల ద్వారా ధృవీకరించబడిన యోగ ప్రక్రియ ‘సుదర్శన క్రియ’ను, ఇంకా జీవితానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. ఒత్తిడిని, భావోద్వేగాలను అదుపులో ఉంచడం, ఏకాగ్రతను పెంచడం, చదువులో బాగా రాణించడం, తోటివారితో, పెద్దలు, గురువులతో సానుకూల సంబంధాలను పెంచుకోవడం జరుగుతుంది.
ప్రేరేపించు, శక్తివంతం చేయు, సాధించు
ప్రత్యేకంగా రూపొందించబడ్డ కార్యక్రమములు 5+ నుంచి 18 సంవత్సరముల పిల్లలకు సంపూర్ణ అభివృద్ధి కొరకు, మానసిక భావోద్వేగ శారీరిక స్థితిని మెరుగుపరచేందుకు ఉద్దేశించబడ్డాయి.
సుదర్శన క్రియ
పరిశోధనల ద్వారా ధృవీకరించబడిన శ్వాస ప్రక్రియ. ఒత్తిడిని, కోపాన్ని, ఆందోళనను బాగా తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడిన ఈ విధానం ద్వారా విశాల దృక్పథం కలుగుతుంది., ఏకాగ్రత, నైపుణ్యాలు మెరుగుపడతాయి.
యోగ సాధన
యోగాసనాలు అనేవి విశ్రాంతి, వ్యాయామాల కలయిక అని చెప్పవచ్చు. ఇవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. తేలికపాటి విధానాల ద్వారా జ్ఞాపకశక్తిని, ధారణా శక్తిని మెరుగుపరుచుకోవడం; ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా విశ్వాసాన్ని మరియు ఏకాగ్రతను పెంచుకోవడం జరుగుతాయి.
ఆచరణ సాధ్యమయ్యే ఉపకరణములు
సులభంగా జీవితంలో అమలు చేయగలిగే నైపుణ్యాలు పొంది, ఆచరించడం ద్వారా, ప్రతికూల పరిస్థితులు, ఆలోచనలతో సమర్థంగా వ్యవహరించగలగడం, పాఠశాల విద్యలో విజయాలు సాధించేందుకు ప్రేరణ, తోటివారి వలన కలిగే ఒత్తిడిలో, జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో సరైన నిర్ణయాలు తీసుకోవడం.
అందరూ పాల్గొనే ఆటలు
సరదా కార్యక్రమాలు, వ్యక్తిగత, సామూహిక వ్యాయామాలు, క్రియాశీలక చర్చల ద్వారా లక్ష్యాన్ని నిర్దేశించే శిక్షణ, మంచి నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కరణ, విభేదాలను పరిష్కరించడం, సామాజికంగా అనుకూలమైన, సహకరించే ప్రవర్తనను నేర్పటం.











