బ్లెస్సింగ్స్ ప్రొగ్రామ్
ఇతరులకు స్వస్థత చేకూర్చే మీలోని శక్తిని గుర్తించండి
మీరు ఇచ్చే ఆశీర్వాదాలు ఒకరి జీవితాన్ని మార్చగలవు.
అర్హత: సుదర్శన క్రియ (హ్యాపినెస్ ప్రోగ్రామ్) నేర్చుకుని ఉండాలి, రెండుసార్లు సైలెంట్ రిట్రీట్స్ [అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్] చేసి ఉండాలి
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
ఇక్కడ రిజిస్టర్ చేసుకోండిసంతృప్తి అనేది చైతన్యం యొక్క అద్భుతమైన లక్షణం. ఇది మనకు ఆశీర్వదించే శక్తిని మరియు ఇతరులను స్వస్థపరచే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ బ్లెస్సింగ్స్ ప్రోగ్రాం ప్రత్యేక ధ్యాన పద్ధతుల ద్వారా సమృద్ధి, సంతోషం, పూర్ణతల అనుభవాన్ని అందిస్తుంది. ఈ లక్షణాలు మనందరిలో సహజంగానే ఉంటాయి; ఈ కార్యక్రమం వాటిని మన అనుభవంలోకి తీసుకువస్తుంది.
ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమకోసం కాకుండా ఇతరులకు ప్రదానం చేయబడుతుంది. మనలోని ప్రేమ, పరోపకార స్వభావం మరియు సేవా భావనల పరాకాష్టగా ఇతరులను ఆశీర్వదించే దివ్య శక్తి మనలో ప్రకాశిస్తుంది. ఇతరుల సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది, వారికి శాంతిని, సామరస్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని సూచిస్తుంది. "ఇతరుల సంక్షేమం కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఇతరులను ఆశీర్వదించగలడు." ఈ కార్యక్రమం లో పాల్గొన్న అనేక మంది అద్భుతమైన అనుభవాలను నివేదించారు.
మీ లోని శక్తిని వెలికి తీయండి
సమృద్ధి, సంతృప్తుల పరాకాష్ఠను అనుభవించండి.
స్వస్థతను అందించే సాధనంగా తయారవండి.
మీలోని దైవిక ఆశీర్వాద శక్తిని గుర్తించండి.
ఇది నా జీవితంలో నేను అందుకున్న అత్యంత అద్భుతమైన బహుమతులలో ఒకటి.
గాయత్రి యూ
రిసోర్స్ మేనేజర్