
మేధా యోగ లెవెల్ 1
ఒత్తిడిని జయించండి, ఏకాగ్రతను మెరుగుపరుచుకోండి, కోపాన్ని అదుపుచేసుకోండి
యుక్త వయసు పిల్లలు 13 నుంచి 18 సంవత్సరముల వారికి
మొదటి వారం నుండే మార్పును గమనించండి!
ఇక్కడ రిజిస్టర్ చేసుకోండియుక్త వయసు వారు దీనివలన ఎలా లాభం పొందుతారు ?

కోపాన్ని, దురుసుతనాన్ని ప్రశాంతతో జయించండి
కోపాన్ని దురుసుతనాన్ని విచారాన్ని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా జయించి ఒత్తిడి నుంచి విముక్తి పొంది, ఆందోళలను తగ్గించుకోండి.

ఏకాగ్ర మెరుగుపరచుకోండి
మీ కృషిని మంచి ఏకాగ్రతతో సరైన వైపు మళ్ళించడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఫలితం పొందండి.

ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోండి
తోటివారి నుంచి వచ్చే ఒత్తిడి, పోటీతత్వం, బాహ్య శరీరంలో కలిగే మార్పులు, హార్మోనుల మార్పులవలన కలిగే సమస్యలు, యుక్తవయసులో ఎదురయ్యే అనుబంధాల సమస్యలు - కౌమార దశలో కలిగే ఇటువంటి సవాళ్ళన్నిటినీ సమర్థంగా దాటి ముందుకు సాగండి.
మేధా యోగ అంటే ఏమిటి?
ఒక పరిశోధన ప్రకారం ‘ఆనందకరమైన ఉండే యువత ఆరోగ్యకరమైన పెద్దలుగా’ మారుతారు. కానీ, నేడు అటువంటి ఆనందం యువతలో తగ్గిపోతోంది. చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు చదువులు, పరీక్షలు, సహ విద్యార్థులు, సంబంధాలు - ఇలా ఎన్నో రకాల పోరాటాలతో ఒత్తిడి కలుగుతోంది.
మేధా యోగ మొదటి స్థాయిలో, పిల్లలను ఒత్తిడి లేకుండా ఆనందకరమైన వారిగా, విజేతలుగా మార్చే విధానం మీద ధ్యాస పెడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలోని కొన్ని ప్రత్యేకమైన శ్వాస పద్ధతుల ద్వారా పిల్లలు చెడు భావాల నుంచి బయటపడి, ఒత్తిడిని సంభాళించేందుకు సహకరిస్తుంది. చదువులు, తోటివారితో ఉన్న పోటీ, ఆత్మ గౌరవం వంటి అంశాల మీద చర్చలు, సలహాల ద్వారా పిల్లలు తమ పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు ఈ శిక్షణ కార్యక్రమం తోడ్పడుతుంది. ఇవే కాకుండా జీవిత నైపుణ్యాలైన సమిష్టి కృషి, తోడ్పాటు వంటి విషయాలను పిల్లలంతా కలసి చేసే పద్ధతులు, ఆడే ఆటల ద్వారా నేర్పి, వారిని సానబెట్టడం జరుగుతుంది. ఒక సరదాగా ఉండే, ఆకర్షణీయ వాతావరణంలో నేర్చుకోవడం, సమైక్య భావనతో, కలిసికట్టుగా పొందే ఈ అనుభవాలమూలంగా, విజయము, ఆనందము అనేవి ఎప్పుడు కలిసే ఉంటాయని యువతతెలుసుకుంటారు.
ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను నా క్లాస్‌మేట్స్‌తో కూడా మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు, నేను నా అసెంబ్లీలో నమ్మకంగా ప్రసంగం ఇవ్వగలను!

మీరా, 13
విద్యార్థి
నేను అనేక ప్రయోజనకరమైన జీవిత పాఠాలను నేర్చుకున్నాను. గురుదేవ్ లాగే నేను కూడా అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, వారిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను.

అక్షయ్, 16
విద్యార్థి
నాలో మెరుగైన, మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన నన్ను నేను కనుగొన్నాను. నేను సుదర్శన క్రియను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తున్నాను, ఇది నా ఏకాగ్రత మరియు విద్యా నైపుణ్యాలను మెరుగుపరిచింది.

శ్రియ, 15
విద్యార్థి
మేధా యోగపై పరిశోధన

కచ్చితత్వం
యుక్త వయసు పిల్లల్లో కచ్చితత్వం సగటున 22 శాతం పెరిగింది.

మానసిక ఉన్నత స్థితి
మానసికంగా మెరుగైన స్థితి లో 29 శాతం పెరుగుదల

భావోద్వేగ సమస్యలు
- భావోద్వేగ సమస్యల తగ్గుదల 69 శాతం.

అత్యుత్సాహం
- 67 శాతం తగ్గుదల.

తోటివారితో సమస్యలు
- తోటివారితో ఉన్న సమస్యలు 67 శాతం తగ్గుదల.

ప్రవర్తనలో సమస్యలు
- 78 శాతం తగ్గుదల.
వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
నాకు ఈ శిక్షణలో పాల్గొనాలని ఉంది కానీ…
నాకు ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు చెప్పగలరా?
మేధా యోగ ఒక పురాతమైన యోగాభ్యాస, వ్యాయామాలతో కూడిన. శ్రీ శ్రీ గురుదేవ్ రవి శంకర్ దీనిని ప్రవేశపెట్టారు. ధ్యానము, యోగ, శ్వాస వ్యాయామాలు మాత్రమే కాకుండా, పిల్లలకు వారి భయాలు ఆందోళనల నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణంగా జీవించే విధానం ఇందులో నేర్పబడుతుంది. వారు తమ సమస్యలని బాహాటంగా వ్యక్త పరిచే స్వేచ్ఛను పొంది, తోటివారితో కలసిమెలసి ఉండగలుగుతారు. పిల్లలకు యుక్త వయసులో చాలా అవసరమయ్యే “మన” అనే భావన ఈ శిక్షణ కార్యక్రమం కలిగిస్తుంది. పిల్లలకు ఆధ్యాత్మికత భారతీయ సంస్కృతితో పరిచయం కూడా ఏర్పడుతుంది.
నేను అంతర్జాలంలో ఎలా నమోదు చేసుకోవాలి?
అంతర్జాలంలో ఆర్ట్ అఫ్ లివింగ్ కి వెళ్లి “నమోదు చేసుకోండి” మీద నొక్కి మీ పిల్లల వివరాలు నింపాలి. అది పూర్తి అయిన తరువాత మీకు రుసుము చెల్లించు లింక్ తెరచుకుంటుంది. అక్కడ విరాళం చెల్లిస్తే నమోదు పూర్తి అయినట్లే. తర్వాత మేము మీతో వాట్సాప్ ద్వారా ఇంకా లేఖ (ఇమెయిల్) ద్వారా కార్యక్రమపు సమయాలని తెలియజేస్తాము.
ఇంకో అంతర్జాల శిక్షణనా? నాకు పాల్గొనాలని లేదు…
మాకు మీ సమస్య అర్థం అయ్యింది. కానీ మీ పిల్లలకు మానసిక సంఘర్షణ లేని ఆనందకరమైన ఉత్పాదకమైన జీవితం అందితే అది మీకు ఆనందకరమే కదా. ఈ కార్యక్రమం మీ పిల్లలలకు, వారికి తెలియకుండానే అనుభవించే శారీరిక మార్పుల వల్ల కలిగే ఒత్తిళ్ళు తద్వారా ఎదుగుదలలో కలిగే ఆటంకాలను తట్టుకునేందుకు సహకరిస్తుంది.
నా పిల్లలు ఈ కార్యక్రమంలో ఏవైనా ప్రశ్నలు అడగవచ్చా?
తప్పకుండా! ఈ శిక్షణ కార్యక్రమం పరస్పర సంభాషణలు, చర్చలతో జరుగుతుంది. మీ పిల్లలు వారి ఉద్దేశాలను, వారు గమనించిన విషయాలను తెలిపి, వారి సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
నా పిల్లలు మితభాషులు, మొహమాటస్తులు కాబట్టి వారు ఈ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొనలేరు. అటువంటప్పుడు ఇది ఉపయోగమేనా ?
కచ్చితంగా ఉపయోగకరం! ఈ కార్యక్రమం మీ పిల్లలకు ఉపయోగకరమే. మొహమాటపడే పిల్లలు వారిలో ఉన్న భయాలను జయించి అందరితో ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాన్ని నేర్చుకుంటారు.