నిస్పృహ

ఎప్పుడైతే మీలో ప్రాణశక్తి తగ్గిపోతుందో అప్పుడు నిస్పృహ (కుంగుబాటు) కలుగుతుంది.

ప్రాణశక్తిని త్వరితంగా ఎలా పెంచుకోవాలో నేర్చుకోండి.

నిస్పృహ ఎప్పుడు కలుగుతుంది? మీలో ప్రాణశక్తి తగ్గినపుడు నిస్పృహ కలుగుతుంది. మీలో పోరాడాలనే కోరిక నశించిపోతుందో అప్పుడు నిస్పృహ కలుగుతుంది. “నాకు (ప్రయోజనం) ఏమిటి?” అనే ప్రశ్నలో మీరు చిక్కుకున్నపుడు మీరు నిస్పృహలో ఉంటారు.

జీవితాన్ని విశాలమైన దృష్టి కోణంలో చూడడాన్ని నేర్చుకోవడం, మీలోని శక్తిని పెంచుకోవడం వలన మీ ప్రాణ శక్తి నిస్పృహ నుంచి మిమ్మల్ని బయటపడేలా చేయగలదు. వ్యాయామం, పౌష్టికాహారం, ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ మొదలైన విధానాల ద్వారా మీ ప్రాణ శక్తిని పెంచుకోవచ్చు. అప్పుడు మీకు తేలికగా, సంతోషంగా, ఉత్సాహభరితంగా అనిపిస్తుంది.

ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం

సంబంధిత కార్యక్రమాలు

డిప్రెషన్‌ను తొలగించేందుకు ధ్యానం అత్యుత్తమ మార్గం