

ఉచిత పాఠశాల: భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తున్న విద్య
ఉచిత పరిపూర్ణమైన విద్యను మారుమూల తండాలలో, పల్లెటూళ్లలో, పట్టణాలలో, నగరాలలో ఉన్నటువంటి నిస్సహాయక పిల్లలకు అందించడం.

వ్యూహం
- తల్లితండ్రులు మరియు పెద్దలను విద్యాభ్యాసం
- అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం
- అధికారిక బోధన నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ

ప్రభావం
1,00,000+ పిల్లలు భారత దేశంలోని 1,327 ఉచిత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.

లింగ నిష్పత్తి
మా పాఠశాలల్లో లింగ నిష్పత్తి జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.
పర్యావలోకనం
విలువలతో కూడిన పరిపూర్ణ విద్యను ఒత్తిడి రహిత వాతావరణములో భారతదేశంలోని దుర్భలమైన పరిస్థితిలో ఉన్న సంఘాల పిల్లలకు అందించడమే మా ధ్యేయం. గత మూడు దశాబ్దాలుగా, ఆర్ట్ అఫ్ లివింగ్ వారు ఎన్నో విద్యా కార్యక్రమాలను అమలు పరిచారు, అందులో భాగంగా విద్యావ్యవస్థలో విలువలను జోడించడం మరియు పిల్లలకు జీవనోపాధి అవకాశాలను ఇంకా సురక్షితమైన భవిష్యత్తును అందిచడం జరుగుతుంది. ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రస్తుతం దేశంలో 22 రాష్ట్రాల్లో 1,00,000+ మంది పిల్లలకు 1,327 ఉచిత పాఠశాలల్లో విద్యను అందిస్తోంది. అందులో భాగంగా:
- రహదారి మరియు విద్యుత్ లేని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో, మరియు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉచిత పాఠశాలలు
- మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులను ప్రభుత్వ పాఠశాలలకు అందించే పాఠశాల దత్తత కార్యక్రమం
- పట్టణాల్లోని మురికివాడల్లోని వ్యసనాలకు మరియు హింసకు చేరువ ఉండే పిల్లలకు సరైన మార్గదర్శక కార్యక్రమాలు
ఉచిత పాఠశాలల నిర్మాణ మరియు నిర్వహణలో ఆర్ట్ అఫ్ లివింగ్ వారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వాటిని అధిగమించారు. మొత్తం ప్రక్రియలో మన పిల్లలకు పాఠాలు చెప్పడం కంటే సులువైన పని మరొకటి లేదని మేము తెలుసుకున్నాము. చుట్టూ ఉన్న సంఘం దృక్పథంలో మార్పు తేవడం మరియు విద్య యొక్క గొప్పతనం గురించి తెలియపరచడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని విలువ ఆధారిత విద్యలో ఆర్ట్ అఫ్ లివింగ్ వారు తెచ్చిన ప్రత్యేకమైన విలువ అది.
ఉచిత విద్య
భవిష్యత్తును కానుకగా ఇవ్వండి
బెంగళూరులోని పాఠశాలలో (ఉచిత పాఠశాలలు) ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. మా ఊరి వారు ఇప్పుడు నన్ను చూసి చాల గర్వంగా ఉంది అంటున్నారు, అంతేగాక వారి పిల్లలను కూడా పాఠశాలకు పంపాలని ఆలోచిస్తున్నారు

ప్రియాంక
బెంగళూరు మెట్రో రైల్ యొక్క మొదటి మహిళా సారథి, ఆర్ట్ అఫ్ లివింగ్ వారి ఉచిత పాఠశాల పూర్వ విద్యార్థిని
నేను మేఘాలయాలోనే ఉండిఉంటే నాకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యుండేది. ఇక్కడ నాకు మంచి విద్య లభించింది, దానితో నాకు నేను జీవితంలో ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసం పెరిగింది.

రీడలిన్ లిఙ్గదోహ
బెంగళూరులోని ఉచిత పాఠశాల పూర్వ విద్యార్థిని
నేను ఒక మేస్త్రీని. నా కుమార్తెకు పాఠశాల ఫీజు చెల్లించే స్థితిలో లేను. శ్రీ శ్రీ జ్ఞాన్ మందిర్ నాకు సహాయం చేసింది — నా కూతురికి ఉచితంగా మరియు మంచి విలువలతో కూడిన విద్యను అందించింది. ఒత్తిడిలేని, ప్రేమభరితమైన, ఆకర్షణీయమైన…

అజిత్ జాధవ్
తండ్రి, శ్రీ శ్రీ జ్ఞాన్ మందిర్, శింగనాపూర్, మాన్ తాలూకా, సతారా జిల్లా
సవాళ్లు
భారతదేశములో దాదాపు 40% 18 సంవత్సరాల వయసు లోపలవారు ఉంటారు. ఏప్రిల్ 2010 లో, విద్య ప్రతి పిల్లవానికి ప్రాథమిక హక్కుగా నిర్ణయం తీసుకున్న 135 దేశాల సమూహంలో భారత దేశం చేరింది. విద్య అనేది ఒక హక్కు అమలు చేయడం మరియు దేశంలో 5 కోట్ల మందికి విద్యను అందించడం కష్టమైన పని. సరైన అర్హత కలిగి ఉన్న పిల్లలకు మరియు యువకులకు విద్యను అందించే ఇటువంటి సవాళ్ళను ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ ప్రభుత్వం దగ్గర మరియు వివిధ సంస్థల వద్ద ప్రస్తావిస్తుంది. దేశంలో దాదాపు 96% పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, 72% 5వ తరగతిలోనే, 57% 8వ తరగతిలోనే మరియు ఎక్కువలో ఎక్కువగా 37% 10వ తరగతితోనే ముగిస్తారు.
కొన్ని సవాళ్ళను చూద్దాం:
- వివిధ సామాజిక ఆర్థిక సమస్యలు కారణంగా పెద్దలు వారి పిల్లలను పాఠశాలల్లో నమోదు చేయరు.
- పిల్లలు ఇంట్లో కొన్నిరకాల ఒత్తిళ్లకు గురై పాఠశాలలకు వెళ్లడం కొంత కాలం తర్వాత మానేస్తారు.
- వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక సమస్యల కారణంగా పిల్లల చదువు మందగిస్తుంది.
- శిక్షకులు మంచి అవకాశాల కోసం వెళ్ళిపోతారు.
ఇలాంటి పరిస్థులను అధిగమించడానికి మేము కొన్ని వినూత్న పరిష్కారాలు ఆలోచించము. మా యొక్క ప్రమాదాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా సంపూర్ణ విధానంలో పిల్లలనే కాకుండా, తల్లితండ్రులు, సంఘాలు మరియు శిక్షకులు కూడా ఉంటారు.
≈ 66%
* 2016లో విద్యా రేటు
భారతదేశంలో చదువులో వెనుకబడిన వారు
5 సంవత్సరాల కన్నా తక్కువ పాఠశాల విద్య ఉన్న వ్యక్తులు
≤ 37%
ప్రాథమిక విద్యను ప్రారంభించే వారిలో
X తరగతి పూర్తి చేయండి
దేశంలో పాఠశాలను మధ్యలోనే వదిలేసేవారి సగటు పెద్దది.
విద్య అనేది నాగరికతకు సమీకరణ చేయు పెద్ద సాధనం. అది బలహీనులను బలవంతులుగా చేయగల, ప్రపంచానికి శాంతిని ప్రసాదించగలదు, పేదరికాన్ని తగ్గించగలదు. సంతోషానికి వెతుకులాటలో అది మాత్రమే కనపడే ఒక వెలుగు.
- గురుదేవ శ్రీ శ్రీ రవి శంకర
వ్యూహం
మా వద్ద విద్యావ్యవస్థ కార్యకలాపాలకు కాలాంతర్గతంగా మార్పులు చేసిన అద్భుతమైన వ్యూహం ఉంది. ఆ వ్యూహం మూడు స్తంభాల ఆధారంగా నిర్మింపబడింది.:
సంఘంతో సన్నిహితంగా ఉండటం: ఆర్ట్ అఫ్ లివింగ్ వారు క్రియాశీలంగా సంఘాన్ని ప్రభావితం చేసేవారిని కలిసి పిల్లలు పాఠశాలల్లో నిత్యం ఉండేలా చూస్తారు. మేము పిల్లలను చదివించే ముందు వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాము. పాఠశాల శిక్షకులను మేము వారి సంఘాల నుంచే ఎంపిక చేసి తగు శిక్షణను ఇవ్వడం ద్వారా సంఘం బలోపేతం అవుతుంది. దీని వలన చదువు మధ్యలోనే ఆపేసే పిల్లల సంఖ్య తగ్గుతుంది.
ఉచితంగా విద్యను అందించడం: మా వద్ద చదువుకునే మొదటి తరం పిల్లలు పెద్ద భాగంలో అతి బీద కుటుంబాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఆర్ట్ అఫ్ లివింగ్ వారు విలువలతో కూడిన ఉచిత విద్యను బడుగు బలహీన వర్గాలకు అందించడమే కాకుండా, వారి పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా చేసే సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అడ్డంకులను కూడా మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము.
విలువలతో కూడిన విద్య: ఆర్ట్ అఫ్ లివింగ్ వారు పిల్లలకు సంపూర్ణనంగా పోషణను అందిస్తుంది. విద్య పట్ల మా వ్యూహం ఎక్కువగా సరైన విద్యతో పటు జీవితానికి సరిపడా నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఇంకా వ్యక్తిగత నైపుణ్యాలను నేర్పించడమే కాకుండా వారికి ఆధ్యాత్మికంగా రకరకాల ధ్యాన పద్ధతులను నేర్పించబడును మరియు మానవీయ విలువలకు పునాది వేయడం జరుగును. దీని వలన, కుటుంబ విలువలు బలపడతాయి మరియు ప్రగతిశీల వైఖరి ద్వారా సామాజిక మరియు సాంస్కృతిక అడ్డంకులు తక్కువైతాయి.

సంఘంతో సన్నిహితంగా ఉండటం
సంఘం నుంచే తగ్గ వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం

ఉచితంగా విద్యను అందించడం
పెద్ద సంఖ్యలోని విద్యార్థులు మొదటి తరం వారే

విలువలతో కూడిన విద్య
ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత నైపుణ్యాలు మరియు ఆధ్యాత్మిక పద్ధతులు
మొదటి తరం విద్యార్థులకు ఉచిత విద్య
ప్రభావం
ఈ విభాగములో మేము చేస్తున్న నిరంతర శ్రమ వలన, ఆర్ట్ అఫ్ లివింగ్ దేశములోని 22 రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లోని 1,327 ఉచిత పాఠశాలల్లో 1,00,000+ పిల్లలకు చదువు చెప్పగలుగుతున్నాము. మా పాఠశాలల యొక్క ప్రత్యేకతలు కొన్ని:
- ఎక్కువ మంది పిల్లలు మొదటి తరం వారే ఉండడము.
- మా పాఠశాలలు ఎక్కువగా ప్రభుత్వం పాఠశాలలు నడిపించలేని ప్రాంతాల్లో ఉండడము.
- విద్యార్థులకు బట్టలు, పాద రక్షలు, పుస్తకాలు, రాసుకునేందుకు అవసరమైనటివి, వాహన వెసులుబాటు మరియు మధ్యాన భోజనం కల్పించడము.
- మేము యోగ, ధ్యానము, ఆటలు మరియు సంగీతము, నృత్యము, బొమ్మలు గీయించడం ఇంకా చిత్రలేఖనము వంటి సృజనాత్మక కార్యకలాపాలను మంచి ఆరోగ్యమైన శరీరము మరియు మనస్సు ఎదుగుదలకు నేర్పించడము.
- మా పాఠశాలల్లో దేశం యొక్క సగటు నిష్పత్తి కంటే ఎక్కువగా 48 మంది అమ్మాయిలతో 52 అబ్బాయిలు ఉండడం.
- ఇప్పటివరకు మేము 2,000+ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.
1,00,000+
విద్యార్థులకు
ఉచిత విద్యను అందివ్వబడుతోంది
1,327
ఉచిత పాఠశాలలు
22 రాష్ట్రాలలో నిర్వహింపబడుతున్నాయి
2,000+
ఉపాధ్యాయులకు
శిక్షణ ఇవ్వబడింది
48 : 52
అమ్మాయిలతో అబ్బాయిల నిష్పత్తి
దేశ సగటుతో పోల్చితే అధికం