

అంతర్గత శాంతి ఉంటే ప్రపంచ శాంతి ఉన్నట్టే
సంభాషణ ద్వారా విభేదాలను పరిష్కరించడం మరియు వ్యక్తిగత స్థాయిలో శాంతిని పెంపొందించడం

సవాళ్లు
- తీవ్రవాదులు, ప్రభుత్వం మరియు సంఘాల సభ్యుల మధ్య నమ్మకంలో లోటు
- వ్యక్తులలో లోతుగా పాతుకుపోయి ఉన్న ఒత్తిడి

వ్యూహం
సంభాషణలు మరియు గాయం-ఉపశమనం ఇంకా ఒత్తిడి-ఉపశమన కార్యక్రమాలు

ప్రభావం
- 7400+ సాయుధ తిరుగుబాటుదారులకు లొంగిపోవడం మరియు వారిని ప్రధాన సామజిక వ్యవస్థలోకి మిళితం చేయడం
- 16,000+ యుద్ధ ప్రభావిత పిల్లలు గాయం-ఉపశమన శిక్షణ పొందడం
- 20,000+ మంది యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాల నుండి ప్రాణాలతో బయటపడిన వారికీ పునరావాస సాధనాలను అందించడం
- పోరాడుతున్న వర్గాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి
పర్యావలోకనం
కష్టమైన పని అయినటువంటి విభిన్నమైన భావజాలాలున్న వివిధ సమూహాల మనస్పర్థలను పరిష్కరిస్తే, ప్రపంచ శాంతి నెలకొంటుంది. స్వార్థ ప్రయోజనాలు, హింస యొక్క సుదీర్ఘ చరిత్ర, నమ్మకము ఇంకా మాట లేకపోవడము, వ్యక్తులలో తీవ్ర ఒత్తిళ్లు అన్నీ కలిపి గొడవలను పరిష్కరించడం కష్టతరం అవుతోంది.
గురుదేవ శ్రీ శ్రీ రవి శంకర ప్రకారం, ప్రపంచ శాంతికి ఈ కష్టాలను సహనంతో, పట్టుదలతో మరియు వ్యక్తులలో శాంతిని పెంపొందించడం ద్వారా అధిగమించవచ్చు. వ్యక్తులలో అంతర్గత శాంతిని పెంపొందించడం ద్వారా ఘర్షణలకు కారణమయ్యే వారిలో మార్పు తేవడం మరియు బాధితులకు ఉపశమనం కలిగించడం కుదురుతుంది. సంభాషణను నెలకొల్పడం చేయడం ద్వారా, నమక్కంలోని లోపాల్ని సరిచేయవచ్చు. ఇటువంటి పనులు చేయడం వలన, ప్రపంచ శాంతిని నిజంగానే చూడగలుగుతాము.</p
గురుదేవుల వారు స్వయముగా మరియు స్వచ్ఛంద సేవకుల ద్వారా, వివిధ వర్గాలు మరియు ప్రభుత్వంలోని వివిధ స్థాయిల వారితో సంభాషణలు మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా శాంతిని ప్రోత్సహించారు. ఆర్ట్ అఫ్ లివింగ్ మరియు మానవ విలువల కోసం అంతర్జాతీయ సంఘం (ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ హ్యూమన్ వాల్యూస్) వారు జాగ్రత్తగా రూపొందించబడ్డ ఒత్తిడి-ఉపశమన కార్యక్రమాలు మరియు గాయం-ఉపశమన కార్యక్రమాల ద్వారా తీవ్రవాదులు, సాయుధ తిరుగుబాటుదారులు, యుద్ధ అనుభవజ్ఞులు, శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న వారు ఇంకా మారుమూల అడవుల్లో కార్యకలాపాలను నిర్వహించు సాయుధ సంఘాల వారు ఇంకా అనేకమందికి అంతర్గత శాంతిని పరిచయం చేసింది.
మా ప్రమేయం ద్వారా సానుకూల పరిణామంగా తీవ్రవాదులు మరియు సాయుధ తిరుగుబాటుదారులు లొంగిపోయి, దీర్ఘకాలిక విద్వేషాన్ని వదిలేసారు. మా ప్రమేయం ద్వారా యుద్ధం నుండి బయటపడినవారు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
నేనొక తీవ్రవాద సంఘానికి జిల్లా నాయకుడను. నేనుప్పుడూ నాతో ఆయుధాన్ని తీసుకెళతాను. నాకెప్పుడూ సరిగ్గా నిద్ర ఉండేది కాదు, ఎందుకంటే ఎన్నో దిగుళ్లు ఇంకా అపరాధ భావనలో మునిగి ఉండేవాడిని. ఎన్నో నిద్ర మాత్రల సహాయం తీసుకున్నాను. ఆర్ట్ అఫ్ లివింగ్…
ఒకప్పటి తీవ్రవాది
మా వ్యూహంలో భాగంగా
మేము ఈ క్రింది ఇవ్వబడినవి అంశాలను కలిపిన ఒక బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తాము:

అంతరంగంలో నుంచి శాంతిని పొందడం
గాయం మరియు ఒత్తిడి-ఉపశమన కార్యక్రమాల ద్వారా

బహుళ-సమూహ సంభాషణలు
వివిధ వ్యక్తులు మరియు వర్గాల మధ్య

ప్రాంతీయ సంఘాలను నిర్మించడం
ఉపశమనం కలిగించే క్రమంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం

అవసరమైనవి అందిచడం
అత్యవసర పరిస్థితులలో కావలసినవి అందించడం

వేదికల సృష్టి
సమావేశాలు, నిపుణుల సంఘాలు మరియు బాహ్య మద్దతు
శాంతి అనేది సంఘర్షణ లేకపోవడం కాదు; అది మనలో ఉన్న ఒక అనుకూలమైన దృగ్విషయం. మన మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మన బుద్ధి బాగా పనిచేస్తుంది, మన భావోద్వేగాలు తగ్గి అనుకూలంగా మారుతాయి, మరియు మన ప్రవర్తన కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇవన్నీ ప్రభావాలు మనలో ఉన్న శాంతిని కనుగొనే క్రమంలో దొరికేటివే, మరి అటువంటి అంతర్గత శాంతియే ప్రపంచ శాంతికి కీలకం.
- గురుదేవ శ్రీ శ్రీ రవి శంకర
ప్రభావం
సేవా కార్యక్రమాల ముఖ్యాంశాలు
52 సంవత్సరాల కొలంబియన్ సంఘర్షణను పరిష్కరించడంలో పాత్ర, 2016
అంతర్జాతీయ సంఘాల జోక్యం ఒప్పుకోని సమయములో ఎఫ్ ఏ ఆర్ సి నాయకులు కొలంబియా ప్రభుత్వంతో చర్చలు జరగడానికి గురుదేవ శ్రీ శ్రీ రవి శంకర ముఖ్య పాత్ర వహించారు. కొలంబియాలోని ఆర్ట్ అఫ్ లివింగ్ యొక్క ఉనికి వలన, గురుదేవులకు కొలంబియా వారి అత్యున్నత పురస్కారము "ది ఆర్డెన్ డే ల డెమోక్రసియా సైమన్ బోలివర్" ప్రదానం చేశారు.
జమ్మూ మరియు కాశ్మీరు: పైగం-ఏ-మొహబ్బత్, 2017
ఆర్ట్ అఫ్ లివింగ్ అనుక్షణం జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులను మార్చే ప్రయత్నం చేస్తూ ఉండడం వలన ఎంతో మంది ఉగ్రవాదులు లొంగిపోయారు. పైగం-ఏ-మొహబ్బత్ అనే ఒక ఏకైక సయోధ్య కార్యక్రమం ద్వారా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని అయినటువంటి వీరమరణం పొందిన సైనికుల కుటుంబీకులను, ప్రతిదాడిలో గాయపడిన వారి కుటుంబీకులను, మరియు చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబీకులను కలపడం చేపట్టింది.
16000+ యుద్ధ-ప్రభావిత పిల్లలు 2016-2019లో గాయం ఉపశమనం-శిక్షణ పొందుతున్నారు
జోర్డాన్ మరియు లెబనాన్లో ఎన్నో వేల మంది యుద్ధ-ప్రభావిత పిల్లలకు మా గాయం ఉపశమనం-శిక్షణను ఇచ్చి వారిని మానసిక ఉపశమనం వైపు మళ్లేందుకు సహకరించాము. ఐ ఏ హెచ్ వి మొదలు పెట్టినవి ఉపశమనము, స్థితిస్థాపకతను మరియు తీవ్రవాద నిరోధన కార్యక్రమము - ఈ కార్యక్రమములో భాగంగా జోర్డాన్ మరియు లెబనాన్లో శరణార్థ మరియు స్థానిక సంఘాలను భావోద్వేగంగా నయం చేయడం మరియు దృఢమైన సమన్వయ శాంతియుత సంఘాన్ని నిర్మించడం.
ఉగ్రవాద యువతకు పునరావాసం కల్పించడం
700 మాజీ ఉల్ఫా (యు ఎల్ ఎఫ్ ఏ) ఉగ్రవాదులకు ఒత్తిడి రహిత శిక్షణను ఇవ్వడం ద్వారా వారికి పునరావాసం కల్పించబడింది. ఇదే కాకుండా బీహార్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఉగ్రవాదులు లొంగిపోయి ఆర్ట్ అఫ్ లివింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇరాక్ పునర్నిర్మాణం, 2003
2003 సెప్టెంబర్ నుండి, ఆర్ట్ అఫ్ లివింగ్ వారు 50,000 యుద్ధ ప్రభావిత ప్రజలకు సహాయం చేసారు. ఇరాక్ లో ఉన్న సంఘాల నాయకులకు ప్రజలను రక్షించడానికి ప్రచారాలు మరియు కార్యక్రమాలను ప్రారంభించడానికి గల తగు శిక్షణను మేము ఇచ్చాము. మహిళా సాధికారత కార్యక్రమాలు ద్వారా ఆడవాళ్ళ భావోద్వేగ మరియు మానసిక అవసరాలను తీర్చడం ఇంకా వారికి ఆర్థిక స్థిరత్వానికి తగు శిక్షణను ఇవ్వడం జరిగింది. మా కార్యక్రమాలలో యాజిదీలు, షియాలు ఇంకా క్రిస్టియన్లు ఉన్నారు.
ఈశాన్య ప్రాంతంలో ఉప్లా (యూ పి ఎల్ ఏ) తీవ్రవాద సంస్థ ఏకపక్ష కాల్పుల విరమణ, 2018 ప్రకటించింది
ఒత్తిడి రహిత శిక్షణను ఇవ్వడము మరియు ప్రభుత్వముతో చర్చలు నెలకొల్పడం ద్వారా 150 మంది ఉప్లా (యునైటెడ్ పెఒప్లె'స్ లిబరేషన్ ఆర్మీ - యూ పి ఎల్ ఏ) సంస్థకు చెందిన వారు 2018లో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించారు.
జోర్డాన్, లెబనాన్ మరియు సిరియా మానవతావాద ప్రయత్నాలు, 2003
2003 నుంచి ఆర్ట్ అఫ్ లివింగ్ వారు ఈ ప్రాంతంలో బాగా పని చేస్తున్నారు. ఇరాక్, సిరియా మరియు లెబనాన్ నుండి శరణార్థ యువతకు మేము ఇక్కడ తగు శిక్షణను నిర్వహించాము. ప్రమాదం అంచుల్లో ఉన్న ఈ యువతకు శాంతి-స్థాపన శిక్షణను ఇవ్వడం ద్వారా వారు భవిష్యత్తులో శాంతి కొరకు సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తారు.
మణిపూర్‌లో తీవ్రవాదులు లొంగిపోయారు, 2017
గురుదేవుల వారు ఈశాన్య ప్రాంతంలో ఎంతో కాలంగా ఉన్న గొడవలను మరియు తిరుగుబాటును పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆర్ట్ అఫ్ లివింగ్ వారి నిరంతర ప్రయత్నాల వలన 68 మంది తీవ్రవాదులు లొంగిపోయారు. అంతే కాకుండా మాజీ తీవ్రవాదులను ప్రధాన శ్రవంతిలోకి తిరిగి కలిపేందుకు తగు కార్యక్రమాలను నిర్వహించింది.
ఈశాన్య స్థానిక ప్రజల సదస్సు జరిగింది, 2017
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈశాన్య ప్రాంతాల్లోని విభిన్న సమూహాల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది, అందులో మాజీ తీవ్రవాదులను సైతం పిలవడం ద్వారా అక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది.
శ్రీలంకలో జాతి సంఘర్షణ యొక్క గాయాన్ని తగ్గించడం
శ్రీ శ్రీ గురుదేవ వారి ప్రేరణ పొంది ఆర్ట్ అఫ్ లివింగ్ శ్రీలంక వారు వైద్యం మరియు సయోధ్య కోసం శాంతి-నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించడం మరియు అనేక వందల మాజీ ఎల్ టీ టీ ఈ పోరాట యోధులకు జీవిత-సహాయక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గురుదేవ వారి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు శ్వాస సాంకేతికత సుదర్శన క్రియ 1800 మాజీ ఎల్ టీ టీ ఈ పోరాట యోధులకు సహాయపడి వారు ప్రధాన శ్రవంతిలోకి తిరిగి కలిసేందుకు ఉపయోగపడింది.
యు ఎస్ ఏ: ప్రాజెక్ట్ వెల్కమ్ హోమ్ ట్రూప్స్, 2006
మధ్య తూర్పు నుంచి యుద్ధం చేసి తిరిగి వచ్చిన యుద్ధ అనుభవజ్ఞులు 2006లో మొదలైన ఐ ఏ హెచ్ వీ ప్రాజెక్ట్ వెల్కమ్ హోమ్ ట్రూప్స్ (పీ డబ్ల్యూ హెచ్ టీ) ద్వారా ఉపశమనాన్ని అందించే ప్రత్యం చేశారు. పీ డబ్ల్యూ హెచ్ టీ శ్వాస-ఆధారిత సాధనాలను అందించే మనస్సు-శరీర స్థితిస్థాపకత అందించే కార్యక్రమం ద్వారా ఒత్తిడి, ఆందోళన మరియు నిద్ర సంబంధిత సమస్యలును తగ్గించే ప్రయత్నం చేస్తుంది. యుద్ధం మిగిల్చే గాయం తాలుకూ ఒత్తిడితో యుద్ధ అనుభవజ్ఞులు వారి సమస్యలు 40 - 50% తగ్గటానికి పీ డబ్ల్యూ హెచ్ టీ సహకరించిందని స్టాండ్ఫోర్డ్ లోని జర్నల్ అఫ్ ట్రూమాటిక్ స్ట్రెస్ అనే పత్రికలో ప్రచురించింది.
మాటలను నెలకొల్పడం
గురుదేవుల వారు అస్సాం అల్లర్లు (2012), అమర్‌నాథ్ భూ వివాదం (2008), గుజ్జర్ల నిరసనలు (2008), మరియు 2001లో నక్సల్ తిరుగుబాటు వరకు వివిధ ఘర్షణలకు సంభాషణను ఏర్పరచడం చేసారు.