యోగా, ధ్యానం, శ్వాస ప్రక్రియలు, రోజువారీ జీవితంలో ఆచరించగలిగే జ్ఞానం కలగలిసిన సమగ్రమైన విధానాలతో కూడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను ప్రభావితం చేశాయి. చక్కటి జ్ఞానంతో కూడి, వ్యక్తిగత వికాసానికి తోడ్పడే ఈ కార్యక్రమాలు మానసిక ఒత్తిడిని నిర్మూలించి అంతరంగంలో ప్రగాఢమైన ప్రశాంతతను, ఆనందాన్ని పొందేందుకు, జీవితపు సమగ్ర అభివృద్ధికి అవసరమయ్యే శక్తివంతమైన విధానాలను మనకు అందిస్తున్నాయి.
