icon-love

44 సంవత్సరాలుగా మానవ జీవన పరివర్తనలో నిమగ్నం

icon-earth-globe

10,000+ ప్రపంచవ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు

icon-location

182 దేశాలు

icon-group

80 కోట్లకు పైగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయడం జరిగింది

ప్రపంచ ధ్యాన దినోత్సవం: ఒక ప్రపంచ విప్లవం

నాలుగు దశాబ్దాలుగా, గురుదేవ్ లక్షలాది మందిని వారిలోని శక్తిని కనుగొనడానికి ప్రేరణ ఇచ్చారు: వ్యక్తులు, సంఘాలు మరియు దేశాలను మార్చడం జరిగింది. యుద్ధాలను ఆపడం మరియు ఉగ్రవాదుల లొంగిపోవడానికి మార్గం సుగమం చేయడం నుండి విద్యలో విప్లవాత్మక మార్పులు చేయడం మరియు రైతుల సాధికారతకు, గురుదేవ్ ధ్యానాన్ని ఉపయోగించి సమూల మార్పును తీసుకువచ్చారు. ఆయన ప్రయత్నాలు లెక్కలేనన్ని జైలు ఖైదీల, గ్రామీణ మహిళల జీవితాలను మార్చాయి మరియు యువత కోసం మాదకద్రవ్య రహిత క్యాంపస్లను నిర్మించడంలో, కార్పొరేట్ శ్రేయస్సును పెంపొందించడంలో మరియు ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడ్డాయి. 180 కంటే ఎక్కువ దేశాలలో లక్షలాది మందిని ప్రభావితం చేశాయి.

2024లో, UN డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం, గురుదేవ్ డిసెంబర్ 21, 2024న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ధ్యానంలో మార్గనిర్దేశం చేసారు.

కార్యాచరణలో భాగంగా ధ్యానం

నేను ఎందుకు చేరాలి?

icon

ఒక చారిత్రాత్మిక ఘట్టం

ఈ అంశం గురించి చదవడంతో ఆగిపోకుండా ఈ చారిత్రాత్మక ఘనతలో భాగమై నేను ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొన్నాను" అని ప్రకటించడం కంటే అత్యున్నత గౌరవం మరేముంటుంది?

icon

ప్రపంచ ధ్యానం

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కలిసి ధ్యానం చేయడమే గాక ఈ ఘట్టం జరిగే క్రమంలో బహుముఖ ప్రయోజనాలు చేకూరుతాయి.

icon

ధ్యానంలో మాస్టర్

గురుదేవ్ తో ధ్యానం కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు ఇది ఒక అనిర్వచనీయమైన అనుభవం!

మీరు శ్వాస తీసుకోగలిగితే, మీరు ధ్యానం చేయగలరు!

నాకు ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి...

నాకు ఏదైనా అర్హత అవసరమా?

మీరు శ్వాస తీసుకోగలిగితే మీరు ద్యానం చేయవచ్చు!

పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చా?

5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు.

ధ్యానంలో నాకు ముందస్తు అనుభవం అవసరమా?

లేదు! ధ్యానంలో నిపుణుడిగా ఉండటం తప్పనిసరి కాదు, మీరు వచ్చి శ్వాస తీసుకుంటే సరిపోతుంది.

నేను ఈ కార్యక్రమానికి ముందు ధ్యానాన్ని ప్రయత్నించవచ్చా?

అవును, మీరు YouTubeలో గురుదేవ్ ధ్యాన దానెల్ "Meditations from Gurudev"చూడడం ద్వారా గురుదేవుని వందలాది ధ్యాన వీడియోలు చూడవచ్చు.

2024 డిసెంబర్‌లో, న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుండి గురుదేవ్ నిర్వహించిన ధ్యాన కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో 85 లక్షల మందికి పైగా ప్రజలు కలిసి అనుసరించారు.

2025 కోసం మీ ఖాళీ స్థలాన్ని ఆదా చేసుకోండి

    *
    *
    *