Service - VBI Volunteers rejoicing during river rejuvenation project

డైనమిజం ఫర్ సెల్ఫ్ అండ్ నేషన్ (DSN)

వ్యక్తిగతమైన బెరుకుదనం నుండి బయటపడి, మీ అంతర్గత శక్తిని, స్థిరత్వాన్ని అందుకోండి.

• అవరోధాలను అధిగమించి • భయాన్ని జయించి • మీలో దాగున్న శక్తిన్ని మేల్కొలపండి

*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

మీ మనస్సుకు గల అపరిమిత సామర్థ్యాన్ని గ్రహించండి.

మీరు ఊహించని స్థాయికి మీ నైపుణ్యాలను విస్తరించుకోండి.

icon

భయాన్ని జయించి

భయాల నుండి విముక్తి చెంది స్వేచ్ఛను అనుభూతిని పొందండి

icon

వైవిధ్యం చూపండి

సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడంలో మీ పాత్రను, ప్రాముఖ్యతను గ్రహించండి

icon

మీ సామర్థ్యాన్ని గ్రహించండి

మీ గురించి, మీ సామర్థ్యాల గురించి మీకున్న సంకుచిత భావనలను విచ్ఛిన్నం చేయండి

DSN కార్యక్రమం ప్రాముఖ్యత ?

మనందరికీ వ్యక్తిగత అడ్డంకులు, పాత అలవాట్లు లేదా సంకోచాలు ఉండటం సహజం. అవి మనల్ని వెనక్కి నెట్టి, మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించ నీయకుండా అడ్డు పడతాయి. అయినప్పటికీ, మనమందరం ఉత్తమంగా ఉండాలనే ఆశిస్తాం - మనకోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, చివరకు ప్రపంచం కోసం కూడా.

DSN అనేది మీలో ఒక శక్తివంతమైన, మార్పును తీసుకువచ్చే ప్రోగ్రామ్. ఇది మీ భయాలను, సందేహాలను తొలగించి, మీకు అంతర్గత స్థిరత్వాన్ని, శక్తిని ఇస్తుంది. మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.

DSN కార్యక్రమపు ముఖ్య అంశాలు

DSN అనేది ఒక శక్తివంతమైన, మార్పును తీసుకువచ్చే ప్రోగ్రామ్. ఇది మీ భయాలను, సందేహాలను తొలగించి, మీకు అంతర్గత స్థిరత్వాన్ని, శక్తిని ఇస్తుంది. మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.

icon

కార్యక్రమంలో పాల్గొనేవారికి అనేక ప్రక్రియలు, చర్చల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. దీనిలో సున్నితమైన, అవగాహనతో కూడిన వాతావరణం సృష్టించబడుతుంది.  ఈ వాతావరణంలో, పాల్గొనేవారు, తమ నిజ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, వాటికి అనుసంధానించే ప్రతిస్పందనలను పరిశీలించి, భయాలు, అవరోధాలను అధిగమించే సాధనాలను నేర్చుకుంటారు.

icon

కార్యక్రమంలో భాగంగా నేర్పబడే పద్మసాధన అనే యోగాభ్యాసం మీ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. 45 నిమిషాల ఈ యోగా భంగిమలు ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ మనోహరమైన పద్మసాధన మిమ్మల్ని సులభంగా లోతైన ధ్యాన స్థితిలోకి చేరుస్తుంది.

icon

పురాతన జ్ఞానంలోకి లోతుగా వెళ్లి, ఉన్నత జీవిత రహస్యాలను పునరావృతం చేస్తారు. వీడియో సెషన్‌లు, బృంద చర్చలు కలిగి ఉన్న ఈ కార్యక్రమం, మీ జీవితంలో నూతన అవగాహన క్షేత్రాలను తెరిచి, ఉన్నత జీవనానికి మార్గదర్శనం చేస్తుంది.

icon

ఈ కార్యక్రమం ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది, సమాజానికి దోహదపడేందుకు ఎంతో సహాయపడుతుంది. దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. సమాజంలో మార్పు తీసుకురావడంలో మన పాత్రను, ప్రాముఖ్యతను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఇది.

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఒక ఉద్యమాన్ని వారు చేపట్టారు.
మరింత సమాచారం