
ఉత్కర్ష యోగ
శారీరికంగా, భావోద్వేగపరంగా, సామాజిక ఆరోగ్యాలను పెంపొందిస్తుంది
8 నుంచి 13 సంవత్సరముల వయసు పిల్లలకోసం ఉద్దేశించబడిది
పిల్లలలో మొదటి వారం నుండే మార్పును గమనించవచ్చు!
ఇక్కడ రిజిస్టర్ చేసుకోండిపిల్లలు ఎలా లాభపడతారు?

రోగ నిరోధక శక్తిని, ఆకలిని పెంచుతుంది
మా వ్యాయామాలు, ఇతర కార్యకలాపాలు ఆకలిని, శక్తిని, మంచి మనోభావాలని పెంపొందిస్తాయి.

పిల్లలలో కోపానికి సంబంధించిన సమస్యలని సరిదిద్దుతుంది
పిల్లలకు కోపం, దుడుకుతనం, నిరాశలను కనుగొని; ఆ శక్తిని ఉత్పాదకంగా మళ్ళిస్తుంది.

ఏకాగ్రతా వ్యవధిని పెంచుతుంది
పరిశోధనలద్వారా ధృవీకరించబడిన మా పద్ధతులు పిల్లలలో ప్రశాంతతను, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని మెరుగుపరచేందుకు సహకరిస్తాయి.

ఆనందాన్ని మెరుగుపరుచును
మా సరదా పరస్పర కార్యక్రమాల వల్ల, పిల్లలు వారిలో ఉన్న భయాలను, బిడియాన్ని వదిలి; వాళ్ళ సహజ ఆనంద ప్రాకృతిక రూపాన్ని తెలుసుకుంటారు!
ఉత్కర్ష యోగ అంటే ఏమిటి?
పిల్లలకు అంతులేని శక్తి ఉంటుంది కాని అది ఆందోళన, కోపము, ఆవేశము, ఇంకా నిరాశల వైపు వ్యక్తమౌతూ ఉంటుంది.
పిల్లలలోని ఈ శక్తిని సానుకూలమైన విషయాలవైపు మళ్ళించేందుకు ఈ ఉత్కర్ష యోగ సులభమైన శ్వాస పద్ధతులను నేర్పుతుంది. జ్ఞానంతో బాటుగా వారికి శక్తివoతమైన సుదర్శన క్రియను నేర్పటం జరుగుతుంది. ప్రశాంతమైన, సంతోషభరితమైన మనస్సుతో పిల్లలు చదువులపట్ల బాగా దృష్టి సారించగలుగుతారు. వారికి మంచి ఏకాగ్రత, విషయాలపట్ల స్పష్టత వస్తుంది. అంతేకాకుండా సమిష్టిగా ఉండే స్ఫూర్తిని, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించేందుకు సన్నద్ధం అవుతారు.
ఒక ఆహ్లాదకరమైన ఆకర్షణీయమైన పర్యావరణములొ, అనేకమందితో కలసిమెలసి, ఐక్యతతో, మన అనే భావనతో ఉండటం, ‘నేను చేస్తాను’ అని చిరునవ్వుతో చెప్పడం అనే లక్షణలను పిల్లలు ఈ శిక్షణ కార్యక్రమం నుంచి తీసుకువెళతారు.

మెరుగైన పనితీరు. సంగీతంపై నా ఆసక్తి పెరిగింది. క్రీడలు, చదువులలో నా పనితీరు మెరుగ్గా ఉంది. చాలా సరదాగా అనిపించింది!

అమయ్, 10
విద్యార్థి
ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను నా క్లాస్‌మేట్స్‌తో కూడా మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు, నేను నా అసెంబ్లీలో నమ్మకంగా ప్రసంగం ఇవ్వగలను!

మీరా, 13
విద్యార్థి
వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
నాకు ఈ శిక్షణలో పాల్గొనాలని ఉంది కానీ…
నాకు ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు చెప్పగలరా?
దీనిని గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ ప్రవేశపెట్టారు. ధ్యానం మాత్రమే కాకుండా యోగ, శ్వాస వ్యాయామాలు, పిల్లలకు వారి భయాలను ఆందోళలల నుంచి బయటకు తెచ్చి, ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణంగా జీవించే విధానం నేర్పబడుతుంది. పిల్లలకు ఆధ్యాత్మికత భారతీయ సంస్కృతితో పరిచయం కలుగుతుంది..
ఈ సాధన నా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా?
తప్పకుండా! క్రమం తప్పకుండ చేసే సుదర్శన క్రియ వలన తెలిసిందేంటంటే నిద్ర బాగా పట్టడం, రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరచడం, ఒత్తిడి ఇంకా నిరాశల స్థాయిలని తగ్గించడం. నీవు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఈ శిక్షణ పొందిన వారు పంచుకున్న యోగ్యతా ధృవపత్రాలను చదవడమే. నీవు శిక్షణ కార్యక్రమానికి ముందే నీ ఆరోగ్య సమస్యల గురించి మీ శిక్షకులకు తెలియజేస్తే దానికి తగ్గట్టుగా మంచి శిక్షణ ఇవ్వగలరు!
మీరు రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారు?
ఒక కారణం ఏంటంటే, రుసుము ఇవ్వటం వల్ల మీరు శిక్షణ కార్యక్రమానికి మీ సమయాన్ని తప్పకుండా కేటాయిస్తారు. రెండవది, మీకు జీవితంలో అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పడమే కాక, మీ విరాళం భారత దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, 70,000 గిరిజన పిల్లలను పాఠశాలలకు పంపడం, 43 నదులను పునరుద్ధరించడం, 2,04,802 గ్రామీణ యువతకు జీవనోపాధి నైపుణ్యాలను పెంపొందించడం, 720 గ్రామాలకు సౌర విద్యుత్ శక్తిని కలుగజేయడం మొదలైనవి.
నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. మరి నేను ఈ శిక్షణ ఎందుకు పొందాలి?
మీకు ఒత్తిడి లేదంటే బాగు బాగు. మీరు గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఒక్క సారి ఇది ఆలోచించండి: మీ దగ్గర డబ్బు అయిపోయే సమయంలోనే పొదుపు మొదలుపెడతారా? లేక ఏదైన ఆరోగ్య సమస్య ఎదురైనపుడే వ్యాయామం మొదలుపెడతారా? కాదు కదా? మీలోపల ఉన్న బలాన్ని, స్థైర్యాన్ని పెంచుకొని కష్ట సమయాల్లో దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? ఏదేమైనా అంతిమంగా మీరే నిర్ణయించుకోండి. మీలో ఒత్తిడి పెరిగేవరకు వేచిఉండి అప్పుడు మీకు అవసరమైనపుడు కూడా ఈ శిక్షణ కార్యక్రమం మీకు సహాయం చేయగలదు.