Kyc kyt children teens

నో యువర్ ఛైల్డ్ వర్క్ షాప్ (KYC)

మీ పిల్లల ప్రవర్తనను తెలుసుకోండి

చిన్నపిల్లలు యవ్వనంలోకి అడుగిడే ఈ వయసులో జరిగే శారీరక, మానసిక మార్పులను తెలుసుకోండి. మీ సందేహాలను తీర్చుకుని, తల్లిదండ్రులుగా వారికి సరైనవిధంగా మార్గదర్శనం చేయండి.

*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

ఈ సదస్సులో మీరేం నేర్చుకుంటారు?

icon

పిల్లల ప్రవర్తన

వివిధ పరిస్థితులలో పిల్లలు ఎలా ఆలోచిస్తారో తెలుసుకుంటారు

icon

సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ

మీ మాటలకు వారు వ్యతిరేకంగా కాకుండా, సానుకూలంగా స్పదించే విధంగా మీ భావాలను వ్యక్తపరచటం

icon

వ్యక్తిత్వ వికాసం

మీ పిల్లల్ని బుద్ధిమంతులుగా, సామాజిక బాధ్యతలు స్వీకరించేవారిగా, అదే సమయంలో సున్నితంగా వ్యవహరించేవారిగా పెంచే విధానాలు

icon

విలువలతో కూడిన పెంపకం

కాలపరీక్షకు నిలచిన మానవీయ విలువలను వారికి అందించటం

పిల్లల పెంపకం గురించి

తల్లిదండ్రులు తెలుసుకోవటం ఎందుకు ముఖ్యం?

తల్లితండ్రులు కావడం అనేది జీవితంలో అత్యంత సంతోషకరమైన,అనందభరితమైన విషయాలలో ఒకటి. అంతే కాక, అది మీ జీవితంలో అతి పెద్ద బాధ్యత కూడా. భోజన, వసతి సౌకర్యాలు, మంచి చదువు పిల్లలకు అందించటంతో మీ బాధ్యత తీరిపోదు.

పిల్లలంటే మీరు విధించే నియమాలకు కట్టుబడి ఆడే తోలుబొమ్మలు కారు. వారితో మన సంబంధాలు అంత సులభంగా చెప్పగలిగేవి కావు. ఈనాటి టెక్నాలజీభరితమైన, ఎవరికి వారే స్వతంత్రంగా జీవించే అతిచిన్న కుటుంబాల సమాజంలో తల్లిదండ్రులకు, వారి పెద్దవారి అండదండలు, అనుభవంతో కూడిన సలహా సంప్రదింపులు మృగ్యమైపోయాయి. నిజంగా చెప్పాలంటే అలా చేయి పట్టుకుని నడిపించటం అనేది స్వాగతించవలసిన విషయం మాత్రమే కాదు, ఈరోజుల్లో అది చాలా అవసరం కూడా. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది.

వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానవతావాది, ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఒక ఉద్యమాన్ని వారు చేపట్టారు.
మరింత సమాచారం

నాకు ఈ కోర్సు చేయాలని ఉంది, కాని….

పూర్వం పెద్దవారు అనేకతరాలనుండి తమ పిల్లల్ని తామే పెంచేవారు, మరి ఈరోజున ఈ కార్యక్రమం అవసరమా? ఇది పిల్లల్ని పెంచడంలో ఎలా సహాయపడుతుంది?

పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు చాలాభాగం అతిచిన్న కుటుంబాలుగా ఉంటున్నాయి. ఇది ఒక కొత్త తీరు. పూర్వపు కుటుంబాలలో పెద్దవారు ఉండేవారు, కుటుంబమంతా ఎలా మసలుకోవాలో విధివిధానాలు ఉండేవి, వాటిని అందరూ పాటించేవారు. ఈనాటి ప్రపంచీకరణ నేపథ్యంలోని స్వేచ్ఛాయుత ప్రపంచంలో అటువంటి విధివిధానాలు మసకబారిపోయాయి. ప్రతీ ఒక్కరికీ వారి విధివిధానాలు ఉంటున్నాయి. అందువల్ల వారికి ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఈ కార్యక్రమం తల్లిదండ్రులకు, వారి పిల్లలను మంచి పౌరులుగా రూపొందించేందుకు తగిన మార్గదర్శనం చేస్తుది. పెద్దల సలహాలు అనే ఆధారం లేని చిన్న కుటుంబాలకు ఇది చీకట్లో చిరుదీపం లాంటిది.

రెండు గంటలు మాత్రమే సాగే ఈ కార్యక్రమం నా పిల్లల పెరుగుదలకు సంబంధించిన ఆందోళనలు పరిష్కరించడంలో ఎలా సహాయపడుతుంది?

చూడండి, పిల్లల్ని పెంచటం అనేది ఒక జీవితకాలం జరిగే ప్రక్రియ. ఐతే ఈ రెండు గంటల సదస్సులో మేము పిల్లల ప్రవర్తనకు మూలకారణాలను విశ్లేషిస్తాము. ఆ విధంగా పిల్లలను, వారి పూర్తి సామర్థ్యంతో ఎదిగేలా చేసేందుకు అవసరమైన జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అందిస్తాము. మేమిచ్చే సమాచారం, జ్ఞానం మీకు, మీ పిల్లలకు గల అనుబంధాన్ని సంరక్షించి, వారు తమ యుక్తవయస్సులో సమర్థంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది..

ఈ కార్యక్రమం ఏ విధమైన సమస్యలను పరిష్కరిస్తుంది?

పిల్లల ఆహారపు అలవాట్లు, ప్రవర్తనా విధానాలు, భవిష్యత్తు అవకాశాలు, తాము ఎంచుకునే లక్ష్యాలు, ఎంపికలు, తోటివారి ఒత్తిడి, భావ వ్యక్తీకరణ సమస్యలు,సెల్ ఫోన్ లేదా కంప్యూటర్, టీవీ ఎక్కువసేపు చూడటం వంటి అనేక సమస్యలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. తద్వారా మీకు ఆ సమస్యలకు మూలకారణం అర్థం అవుతుంది.

నేను నా పిల్లలను ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చా?

ఇది తల్లిదండ్రులకు మాత్రమే ఉద్దేశించినది.

నేను ఉద్యోగం చేస్తూ, తల్లిగా/తండ్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలను ఆచరించేందుకు నాకు ఎవరి సహాయమైనా అవసరం అవుతుందా?

ఈ కార్యక్రమంలో మీరు నేర్చుకునే విషయాలు మీ పనిని, వ్యక్తిగత జీవితాన్నిమరింత సమర్థంగా సమన్వయం చేసుకునేందుకు తోడ్పడతాయి. యుక్తవయస్సులో ఉన్న మీ పిల్లల ప్రవర్తనను సానుకూలంగా అర్థం చేసుకోగలుగుతారు.

నా అబ్బాయికి / అమ్మాయికి దేనిపైనా దృష్టి నిలుపలేని సమస్య (హైపర్ ఏక్టిక్టివిటీ డిజార్డర్) తీవ్రంగా ఉంది. నారి ప్రవర్తనకు ఈ కోర్సు ఏమైనా సహాయపడుతుందా?

దీనికోసం మీరు మీ కౌన్సిలర్ను సంప్రదించండి. ఏదేమైనప్పటికీ, ఈ కార్యక్రమంద్వారా మీ పిల్లల ప్రవర్తనకు గల మూల కారణాన్ని విశ్లేషిస్తాము కాబట్టి, అది మీ పిల్లలకు మీకు అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది.

నా బిడ్డకు కౌన్సిలర్స్ సలహా అవసరమా, అక్కర్లేదా అనే అయోమయంలో నేను ఉన్నాను.

మీ బిడ్డ ప్రవర్తనకు మూలకారణాన్ని గుర్తించడంలో ఈ కార్యక్రమం మీకు సహాయం చేస్తుంది. దీనిద్వారా మీ సందేహాలకు సమాధానం లభించవచ్చు.

ఆన్‌లైన్ విద్యవలన నా బిడ్డ ఆన్‌లైన్ ఆటలకు, ఇంటర్నెట్‌కు బానిసయ్యాడు, ఈ సమస్యను పరిష్కరించడంలో ఈ వర్క్ షాప్ నాకువఎలా సహాయపడుతుంది ?

పిల్లల వ్యసన ప్రవర్తన అనేది వారి భావోద్వేగ స్థాయి నుండి ఉత్పన్నమవుతుంది. వారి ప్రవర్తనకు మూలకారణాన్ని గురించి తెలుసుకోవడంలో వర్క్‌షాప్ మీకు సహాయపడుతుంది. పిల్లలకు ప్రత్యేకించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు వారిని వ్యసనాలనుండి దూరం చేయటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు.

నా బిడ్డ (శారీరకంగా, లేదా మానసికంగా) ప్రత్యేక అవసరాలు ఉన్నాయి.అతడికి/ఆమెకు ఈ వర్క్‌షాప్ ఎలా సహాయం చేస్తుంది?

శారీరకంగా వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులకు చాలా శక్తి, సహనం, సానుకూల దృక్పథం చాలా అవసరం.ఈ కార్యక్రమం మీ పిల్లలకు రోజువారీ జీవితంలో అవసరమైన మంచి పద్ధతులను గుర్తించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. తల్లిదండ్రులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే పద్ధతులను నేర్చుకుని, సాధన చేయటం అవసరం.

కోవిడ్ మహమ్మారి నా పిల్లల దినచర్యను, ప్రవర్తనను మార్చేసింది ,ఈ ప్రతికూల మార్పులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు, నాకు ఈ వర్క్‌షాప్ ఎలా సహాయం చేస్తుంది?

పిల్లల ప్రవర్తనకు మూల కారణాన్ని గుర్తించడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. ఆ విధంగా ఇది వారి ప్రవర్తనలో మంచిమార్పును తెచ్చేందుకు మీకు సహాయపడుతుంది. పిల్లలలో కోవిడ్ ప్రభావంతో కలిగిన మార్పులు, వయసురీత్యా వచ్చే ఇతర మార్పులను సైతం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మీకు సహాయపడుతుంది.