శాంతి

"గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నది. మనం చూస్తూనే  వున్నాం ఎక్కడో ఓ చోట ఆందోళనలు చెలరేగుతూనే వున్నాయి. నేటి సమాజంలో ఆందోళనలు రేకెత్తించడం చాలా సులభం. 

అందరిలోనూ చిరాకు మరియు ఒత్తిడి స్థాయిలు చాలా ఎక్కువగానే వున్నాయి ఎదో ఒక  చిన్న కారణం భావోద్వేగాలను రేకెత్తించ గలదు, ప్రజల్ని వీధుల్లోకి లాగ గలదు. అంతరంగంలో శాంతిని సృష్టించడం, ప్రజల్ని అహింసాయుతంగా శాంతియుతంగా సామూహికంగా, సంతోషకరమైనరీతిలో, నిర్మాణాత్మకమైన చర్యల్ని తీసుకునే దిశలో

నడిపించడం చాలా నైపుణ్యంతోకూడిన సవాలు.AOL ఇటువంటి నిర్మాణాత్మక దిశగా మార్పు కోసం చేసిన ఒక వినమ్రమైన

ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సహకరిస్తున్నారు.నేడు ప్రజలు, ధ్యానాన్ని, దేశ నిర్మాణంలో ఆంతరంగిక శాంతి యొక్క పాత్రని అంగీకరించడం నాకు చాలా ఆనందంగా వుంది."

- శ్రీ శ్రీ రవిశంకర్ గారు

పరిచయం

1981లోAOL సంస్థ మొదలు పెట్టిన నాటి నుండి దాని వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు  ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా అవిరళమైన కృషి చేస్తున్నారు. ఈ సంస్థ ఆధ్యాత్మికతని మరియు  సమాజ సేవకి ముఖ్యంగా కావలసిన బలాన్నిబాధ్యతని ఇస్తుంది.

ప్రపంచ శాంతి కావాలన్న సంకల్పం  నుండే దానికి కావలసిన శక్తి ఉత్సాహం ఉద్భవిస్తాయి. మన శ్రీ శ్రీ ఆశించిన, హింస మరియు ఒత్తిడి లేని ప్రపంచం సాధించడం కోసం శాంతి వైపు మన పయనం అత్యవసరం.

యుద్ధాలు విపత్తులు ప్రజల్లో భయాందోళనలు పగ ప్రతీకారాలు పెంచుతాయి. AOL సంస్థ ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇచ్చట నేరస్థులు బాధితులు ఇరువురూ సమ దృష్టితో చూడబడతారు. విభిన్న నేపధ్యాల ప్రజలు సామరస్యంతో కలిసి మెలిసి శాంతియుతంగా జీవించాలన్న లక్ష్యంతో చేస్తున్నదే ఈ చిన్ని ప్రయత్నం.

శాంతి దూత – శ్రీ శ్రీ

పరస్పర వైరం కొనసాగుతున్న ఎన్నో దేశాలకి శాంతిదూతగా వ్యవహరించారు శ్రీ శ్రీ. రెండు వైరి దేశాల ప్రతినిధులని ఒక్కచోట చేర్చి వారి దేశాల్లో హింసాత్మక పరిస్థితుల్ని నిర్వీర్యం చేసారు. విభిన్న విశ్వాసాల సంస్కృతుల వారిని ఒక్కచోట

చేర్చి సామరస్యంతో మెలిగేలా చేసారు. ఇన్కా చదవన్ది

మనోవేదన  - ఉపశమనం

“Sఒత్తిడి మరియు ఉద్రిక్తత హింసకి మూల కారణం అంటారు శ్రీ శ్రీ.  మనలో ఒత్తిడిని తీసేస్తే మనసు తేలికై శాంతిని పొందుతుంది, స్నేహము, సహకారము, బాధ్యత, నేను నావారు వంటి మానవతా విలువలు సహజంగా చిగురిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు మరియు యుద్ధ సమయాల్లో AOL నిర్వహించిన శిబిరాల్లో  పై అవగాహన ఎంతో తోడ్పడింది.

యుద్ధ బాధితుల హృదయాల్లో గల పగ ప్రతీకారం భయం ఆందోళన తొలగి మానసిక ప్రశాంత అనుభూతి చెందారు. తీవ్రవాదులు మారి,  వారి దౌర్జన్య మార్గమును విడనాడారు. ఇన్కా చదవన్ది

స్థిరమైన శాంతి

ప్రపంచ వ్యాప్తంగా గల  కోట్లాది మంది ప్రజల్లో ఒకే స్ఫూర్తిని నింపి ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది AOL. దీని వలన వివిధ దేశాలకి చెందిన విభిన్న నేపధ్యాలు కలిగిన వారు పక్షపాతాలు మరిచి సుహృద్భావంతో సామరస్య భావనతో ఒకచోట చేరగాలిగారు.

ఉగ్రవాదుల దాడి – న్యూయార్క్ నగరం సెప్టెంబర్ 2001

సెప్టెంబర్ 11, 2001న పంతొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు అల్ఖైదాతో కలిసి ఆత్మాహుతి దాడులు చేసారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే AOL వారు IAHVతో కలిసి మనోవేదన ఉపశమన శిబిరాలు నిర్వహించి అమెరికా దేశ వ్యాప్తంగా వేలాది మంది బాధితులకు  దాడి సాక్షులకు వారి మనోవేదనకి ఉపశమనం కలిగించారు. ఇన్కా చదవన్ది

 

 

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More