గ్రామీణ అభివృద్ధి

గ్రామీణ భారతదేశంలో సూర్య కాంత విద్యుత్తుని తీసుకురావడం, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిచడం, బలమైన స్థానిక పాలన మరియు ఇంకా ఎన్నో అందించడం.

విరాళం

icon

సవాళ్లు

సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం, సరిపోని విద్యుత్ సరఫర, హీనమైన మౌలిక విద్యా సదుపాయాలు

icon

వ్యూహం

మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంఘాల నిర్మాణం, స్థానిక యువతను శక్తివంతం చేయడం

icon

చేరువ

మహారాష్ట్రలో ఇంకుడు గుంతల ఏర్పాటు, ప్రతి ఇంటికి దీపం కార్యక్రమం

పర్యావలోకనం

గ్రామీణ భారతదేశం పిలుస్తోంది! ప్రాథమిక విషయాలు అయినటువంటి పరిశుద్ధత, పరిశుద్ధ త్రాగు నీరు, విద్యుత్తు, ఆర్థికాభివృద్ధి మొదలైన వాటి కోసమే కాదు. మాములుగా చెప్పాలంటే మరుగుదొడ్డి కట్టినా ఎవ్వరు వాడకపోతే ఉపయోగం ఏమిటి. ఎవ్వరూ సూర్య కాంత విద్యుత్తుని ఉపయోగించకపోతే అటువంటి ఉత్పాదక కేంద్ర ఉండి కూడా అర్థం ఏముంది. ఆదర్శ గ్రామం ఉండి కూడా సంఘం యొక్క సమస్యలు తీరకపోతే లాభం ఏంటి.

అందరూ గ్రామాలూ వదిలి పట్టణాలకు మంచి జీవం విధానం కోసమో లేక మంచి ఉద్యోగాల కోసమో తరలిపోవడం వలన, లోపానికి మొగ్గు చూపడానికి ఒక పెద్ద సమానమైన మరియు పెద్ద అవసరం ఉంది. అదే మనము సరిచేయాలి. ఒక నిలకడైన మార్పు రావాలంటే మేము నమ్మేది సంఘంలో పాలుపంచుకోవడం. అందుచేత, మేము మరుగుదొడ్లను కట్టిస్తే వాటిని వాడేందుకు ప్రజలను చైతన్యవంతులను చేస్తాము. మేము సూర్య కాంత విద్యుత్ కేంద్రాన్ని కట్టిస్తే, గ్రామస్తులకు సరిపడా పరికరాల్ని స్థాపించి వాటి మరమ్మతుని కూడా నేర్పిస్తాము. మేము ఆదర్శ గ్రామాలను గురించి చర్చించినపుడు, గ్రామా సమస్యలను గుర్తించే వారిని కనిపెట్టి మేము వారికి తగిన ప్రోత్సాహమిస్తాము.

క్లుప్తంగా, మా దృష్టిలో చెప్పాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజల అభివృద్ధి చేయి చేయి కలిపి నడుస్తాయి. ఇటువంటి ఒక ప్రాథమిక నమూనాగా, మేము ఈ క్రింది వాటికోసం పాటుపడుతున్నాము:

  • సూర్య కాంత విద్యుత్తుని మారుమూల గ్రామాలకు కల్పించడం
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా గ్రామీణ యువత మరియు మహిళలకు సాధికారత కల్పించడం
  • మరుగుదొడ్లను నిర్మించి వాటిని ఉపయోగించే విధంగా సంఘం సభ్యులను ఒప్పించడం
  • పరిశుద్ధ నీటిని ప్రసాదించడం
  • స్థానిక పాలనను పటిష్టం చేయడం
  • గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడం

దేశ ప్రజలు ఎప్పుడైతే అట్టడుగులో నుంచి తమను తాము విశ్వసిస్తారో, తమ జీవన విధానాన్ని విశ్వసిస్తారో, తమ సంప్రదాయాల్ని విశ్వసిస్తారో, తమ భాషను విశ్వసిస్తారో అప్పుడు భారతదేశం శక్తివంతమౌతుంది.

- గురుదేవ శ్రీ శ్రీ రవి శంకర

వ్యూహం

మా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం 3 అంచెల వ్యూహంగా ఏకకాలంలో ఆచరించబడింది:

  • మౌలిక సదుపాయాల అభివృద్ధి:

    సామాజిక మౌలిక సదుపాయాలు కల్పించే నైపుణ్య కేంద్రాలు లేక విజ్ఞాన మౌలిక సదుపాయాలు కల్పించే విజ్ఞాన పద్ధతి ద్వారా సుపరిపాల కానీ, మేము స్థానికుల అవసరాలను తీర్చేందుకు సదా కృషి చేస్తాము.

  • పరిష్కార ఆధారిత చర్యల కోసం స్థానిక యువతను శక్తివంతం చేయడం:

    కర్మ యోగ కార్యక్రమంలోని (ఇదివరకు ఉన్న పేరు వై ఎల్ టీ పీ) వివిధ కోణాల ద్వారా స్థానిక యువతను అభివృద్ధి చేయడం జరుగుతోంది. వీటి ద్వారా యువతకు సంఘం యొక్క సేవా కార్యక్రమాలను ప్రారంభించడానికి మరియు నిలకడగా నడిపించడానికి తగిన నైపుణ్యాలను, ప్రేరణను ఇంకా సామర్త్యాలను పొందుతారు. ఈ యువ నాయకులకు మేము కార్యక్రమాలను నడిచేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక సహాయము చేస్తాము.

  • సంఘాల-అభివృద్ధి కసరత్తులు:

    మేము ఆర్ట్ అఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా సంఘాల అభివృద్ధిని చేస్తాము. సంఘ నిర్మాణ కార్యక్రమాల్లో మొత్తం సంఘ సభ్యులు పాల్గొనే విధంగా మేము జాగ్రత్త తీసుకుంటాము, తద్వారా ఊరు మొత్తం దీర్ఘ కాలంలో అభివృద్ధి పథంలో నడుస్తుంది.

ప్రభావం

icon

70,000 గ్రామస్తులకు

భారతదేశంలోని చేరిక

icon

1,00,000 ఆరోగ్య శిబిరాలు

నిర్వహించడం

icon

3,04,681+ యువతకు

భారతదేశంలోని 402 జిల్లాల్లోని గ్రామాల్లో శిక్షణను ఇవ్వడం

icon

30 లక్షల రైతులకు

సహజ వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇవ్వడం

icon

4,75,000+ మంది

వివిధ వృత్తి నైపుణ్యాలలో 14 ఏళ్ళ పటు శిక్షణను అందివ్వడం

icon

110 ఆదర్శ గ్రామ పంచాయతీలను

అభివృద్ధి చేయడం

icon

1,11,000+ మహిళలకు

వృత్తి నైపుణ్యాలలో శిక్షణనివ్వడం

icon

3,819 ఇళ్లలో

62,000+ మరుగుదొడ్లను మరియు 1,000 జీవఇంధన కేంద్రాలను నిర్మించడం

icon

1,00,000+

స్వచ్ఛంద సేవకులు పరిశుభ్రత శిబిరాలను నిర్వహించడం

icon

45,000 మంది

భారతదేశంలోని 12 రాష్ట్రాలలోని గ్రామీణ యువత ప్రచార కార్యక్రమం (హెచ్ ఐ వీ / ఏ ఐ డీ ఎస్ అవేర్నెస్ ఫర్ రురల్ ఏదోలేసెంట్ కాంపెయిన్ - హెచ్ ఏ ఆర్ ఏ) సౌజన్యంతో లాభపడటం

icon

15,000+ మంది యువకులు

వ్యసనాల విముక్తి కార్యక్రమాల ద్వారా మేలు జరగడం

icon

4,000+ పంచాయతీ పెద్దలకు

సుపరిపాలనలో శిక్షణను ఇవ్వడం