గురు పరంపర అనేది సమాజo యొక్క ప్రయోజనం కోసం తరతరాలుగా జ్ఞానాన్ని బదిలీ చేయడానికి అనుమతించిన గురువుల వంశాన్ని సూచిస్తుంది. అది  గురువు నుండి శిష్యునికి జ్ఞానాన్ని అందించడం అనే   సంప్రదాయం. భారత ఉపఖండంలోని ప్రధాన జ్ఞాన పాఠశాల లోని  జ్ఞాన నిల్వలను భద్రపరిచే ఒక అభ్యాసం.

గురు పరంపర యొక్క ప్రాముఖ్యత

గురు-శిష్య (గురువు-శిష్యుడు) సంప్రదాయం ఏ తరం కూడా అపరిచితులు కాకుండా,ప్రతి తరానికి మానసిక వేదనను నయం చేసే జ్ఞానం  కలిగి ఉండేలా చూసింది.

ఒక వంశం (పరంపర) నుండి వచ్చిన ప్రతి గురువు  వారి కాలపు తరానికి సంబంధించిన శాశ్వతమైన జ్ఞానాన్ని తయారు చేసారు . ప్రతి గురుపరంపర ప్రపంచానికి ఎనలేని కృషి చేశారు. వారి నుండి గొప్ప గ్రంథాలు వెలువడ్డాయి మరియు ప్రతి సంప్రదాయంలోని గురువులు ఆకట్టుకునే వ్యక్తులు మరియు లక్షణాలను కలిగి ఉండేవారు . వారిని స్మరించుకోవడం వల్ల వారి గుణాలు మనలో  కూడా కొద్దిసేపైనా  సజీవంగా  ఉంటాయి.

అద్వైత గురు పరంపర

అద్వైత తత్వశాస్త్రం విశ్వంలోని ప్రతి ఒక్కటీ మరియు ప్రతి ఒక్కరూ ఒకటే  చైతన్యం అని చెబుతుంది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఇలా వివరిస్తున్నారు, “అద్వైత తత్వశాస్త్రం క్వాంటం ఫిజిక్స్ లాంటిది, ఇది ప్రతిదీ కేవలం తరంగ పనితీరు అని విశదపరుస్తుంది.  రసాయన శాస్త్రంలో, చాలా  మూలకాలు మరియు ఐసోటోపులు ఉన్నాయి. కానీ క్వాంటం భౌతిక శాస్త్రవేత్తకు, ఒక ఆవర్తన పట్టిక ఉనికిలో లేదు. ప్రతి  ఒక్కటి  కేవలం పరమాణువులు  మాత్రమే.”

అద్వైత గురు పరంపర అనేది అద్వైత పవిత్ర తత్వానికి చెందిన గురువుల వంశం. ఆదిశంకరాచార్య, వేద వ్యాస, మహర్షి వశిష్ఠ వంటి ప్రముఖులు ఈ గురువుల వంశానికి చెందినవారు. వారి సహకారం  అద్వైత జ్ఞానాన్ని యుగయుగాలుగా సజీవంగా ఉంచాయి. ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి గ్రంధాల జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక అనుభవాలను అందించే ఇతర జ్ఞాన వనరులను బదిలీ చేయడానికి ఈ వంశం అనుమతించింది.

అద్వైత గురువుల యొక్క మనోహరమైన కథలు

ఆదిలో, శివుడు మాత్రమే ఉన్నాడు, శాశ్వతమైన చైతన్యం – మొదటి గురువు. జాగృతికి ప్రతీక అయిన ఆదిశేషుని ఆసరాతో నారాయణుడు  ఈ చైతన్య సాగరంలో తేలియాడాడు. నారాయణుడు తన చుట్టూ ఉన్న స్పృహతో ఏకత్వాన్ని అనుభవించినప్పుడు, బ్రహ్మ దేవుడు, విశ్వం యొక్క సృజనాత్మక ప్రవృత్తి పుట్టింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనేక రూపాలుగా మారిపోయాడు. సూక్ష్మ శక్తులైన శివుడు, నారాయణుడు మరియు బ్రహ్మ సృష్టి యొక్క పనిని పరిపాలిస్తారు.

మానస పుత్ర (మనస్సులో పుట్టిన కుమారుడు) లేదా వ్యక్తిగత స్పృహ బ్రహ్మ చైతన్యం నుండి పుట్టింది. అతను మానవులలో అత్యంత జ్ఞానోదయం పొందిన ఋషి వశిష్ఠుడు. ఋషి వశిష్టుడు శ్రీ రాముడికి ఈ ప్రపంచ యొక్క విధులను నిర్వర్తించేటప్పుడు కేంద్రీకృతంగా మరియు సమదృష్టితో ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేశాడు. ఋషి వశిష్ఠుడు మరియు శ్రీరాముని మధ్య జరిగిన సంభాషణ యోగవాశిష్టలో పొందుపరచబడింది, ఇది ప్రపంచం యొక్క భ్రాంతికరమైన స్వభావానికి సంబంధించిన ఒక గ్రంథం.

ఋషి వశిష్టుని కుమారుడు శక్తి. శక్తి తర్వాత పరాశరుడు. కాలము , ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, వైద్యం మరియు వైదిక ఆచారాలపై పరిపూర్ణ జ్ఞానం ఉన్న ఋషి పరాశరుడు.  రిషి పరాశరుడు ఒక మత్స్యకార మహిళను  వివాహం చేసుకున్నాడు మరియు ఆమెతో కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అనే కుమారుడు జన్మించాడు, అతను అద్వైత గురు పరంపర చరిత్రలో గొప్ప పండితులలో ఒకడు.

ఋషి వ్యాసుడు వేదాలను క్రోఢీకరించడానికి వివిధ ప్రాంతాల ఋషులను కలవడానికి భారత ఉపఖండం అంతటా ప్రయాణించాడు. అతనికి వేదాలలోని 1180 శాఖలు తెలుసు మరియు వేదాంత సూత్రాలను (అంటే ఉపనిషత్తుల సారాంశం), మహాభారతం భగవద్గీత అందులో   ఒక  భాగం , యోగసూత్రాలు, వ్యాసభాష్యం మరియు శ్రీమద్ భాగవతం రచించాడు.

వ్యాస మహర్షి తరువాత అతని కుమారుడు శుకదేవుడు, పుట్టుకలో ఒక ఆసక్తికరమైన కథను కలిగి ఉన్నాడు. ఒకసారి శివుడు పార్వతీ దేవికి ఒక కథ చెబుతుండగా, వివరణ  మధ్యలోపార్వతీ దేవికి నిద్ర మొదలవుతుంది. ఇంతలో, ఓ చిలుక కూడా కథ వింటోంది. జ్ఞానంతో కూడిన కథ కావడం వలన , భగవంతుడు తన వృత్తాంతాన్ని  కొనసాగించాలని కోరుకుంటుంది . కాబట్టి అతను పార్వతీ దేవి యొక్క ధ్రువీకరణ  ధ్వనులను   అనుకరించడం ప్రారంభించాడు. భగవంతుడు కథను ముగించి, పార్వతీ దేవి నిద్రపోవడం గమనించాడు మరియు, ఆ కథకు మరొకరు నిశ్చయాత్మకమైన శబ్దాలు గాత్రదానం  చేసారని  గ్రహించాడు.

అతను ఎవరో చూశాడు – చిలుక. భగవంతుడు కోపంతో అతని వెంట పరుగెత్తాడు. చిలుక వ్యాసుడు మరియు అతని భార్య యొక్క కుటీరంలో  దాక్కుంది. ఋషి వ్యాసుడు చిలుక తరపున శివుడిని క్షమించమని వేడుకున్నాడు మరియు దానికి ఆశ్రయం ఇచ్చాడు. చిలుక యొక్క ఆత్మ ఋషి వ్యాసుని భార్య గర్భంలోకి బదిలీ చేయబడింది. తరువాత శుక దేవ అని పిలువబడిన ఆ ఆత్మ ఈ ప్రపంచపు భ్రమలో చిక్కుకుపోతుందనే భయంతో పుట్టడానికి తిరస్కరించింది మరియు అతను గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి ప్రసంగాల నుండి జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రాధాన్యమిస్తాడు . 16 సంవత్సరాల తరువాత, అతను శుకదేవుడుగా జన్మించాడు, అతను అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్ రాజుకు భక్తి గ్రంధమైన శ్రీమద్ భాగవతాన్ని వివరించాడు. ఈ పవిత్ర గ్రంథం, కలియుగానికి అంతిమ పరిహారంగా పరిగణించబడుతుంది, ఇది విష్ణువు మరియు అతని అవతారాలు, ముఖ్యంగా శ్రీకృష్ణుడి కథల సమాహారం.

అదే విధంగా, చాలా మంది గురువులు అద్వైత గురు పరంపరలో భాగమయ్యారు. అద్వైత తత్వశాస్త్రం యొక్క మనోహరమైన లోతు ఉన్నప్పటికీ, ప్రధాన తత్వశాస్త్రం కంటే ఆచారాలు ఎక్కువ ప్రాముఖ్యతను పొందిన తరువాతి యుగాలలో దాని విలువ మరియు ప్రజాదరణను కోల్పోవడం ప్రారంభించింది.

ఆదిశంకరాచార్యుడు : అద్వైత తత్వాన్ని పునరుద్ధరించిన గురువు

7వ శతాబ్దం CEలో, ఆదిశంకరాచార్య తన గురు గోవింద్ భగవద్ పాదాన్ని ఆధునిక మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున కలుసుకున్నారు. గురు గోవింద్ ఆదిశంకరాచార్యులను  ‘మీరు ఎవరు?’  అని అడిగాడు,దానికి ప్రతిస్పందనగా, ఆదిశంకరాచార్య నిర్వాణ శతకాన్ని రచించారు, దీని ప్రారంభ పారా క్రింది విధంగా ఉంది.

मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं

न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।

न च व्योम भूमिर्न तेजो न वायुः

चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే.

న చ వ్యోమ్ భూమిర్న తేజో న వాయుః

చిదానంద రూపః శివోహం శివోహం॥

నేను మనస్సు లేదా తెలివి లేదా అహం కాదు,

నేను వినికిడి (చెవులు), లేదా రుచి (నాలుక), వాసన (ముక్కు) లేదా చూసే (కళ్ళు) అవయవాలు కాదు.

నేను ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు.

నేను శివుడను, చైతన్యం-ఆనంద స్వభావం యొక్క సర్వోత్కృష్టమైన శుభప్రదం.

నేనే (శివుడు) ఐశ్వర్యవంతుడను

గురు గోవిందుడు తన శిష్యునితో సంతోషించాడు. అతనికి సన్యాస దీక్ష ప్రారంభించాడు . కొంతకాలం పాటు, గురు గోవింద్ సనాతన ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించడంలో సహాయపడే పనులను ఆదిశంకరాచార్యకు అప్పగించారు. అంతరించిపోతున్న అద్వైత గ్రంథాలను శంకరాచార్యులు పునరుద్ధరించారు. ఉపనిషత్తుల యొక్క మరచిపోయిన జ్ఞానాన్ని సరళమైన పద్ధతిలో ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. అతను భారత ఉపఖండంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ దిశలలో  నాలుగు జ్యోతిర్ మఠాలను స్థాపించాడు.

ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు మరియు తరువాతి గురువులు అద్వైత తత్వశాస్త్రం యొక్క జ్ఞానాన్ని కొనసాగించడంలో సహాయపడ్డారు. వారికి ధన్యవాదాలు, మనమందరం ఒక్కటే అని అనుభూతి  చెందడానికి  మనకు అవకాశం ఇప్పటికీ ఉంది.

స్వామి హరి హర ఇన్‌పుట్‌ల ఆధారంగా

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity

     
    *
    *
    *
    *
    *