చాలా కాలం క్రితం నలుగురు వృద్దులు సమాధానాలు వెతుకుతున్నారు. మొదటి వ్యక్తి దయనీయమైన స్థితిలో ఉన్నాడు మరియు అతని దుస్థితి నుండి ఎలా బయట పడాలో తెలుసులోవాలని కోరుకుంటున్నాడు.
రెండవ వ్యక్తి మరింత పురోగతి మరియు విజయాన్ని కోరుకుంటున్నాడు. మరియు దానిని ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నాడు . మూడవ వ్యక్తి జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరియు నాల్గవ వ్యక్తికి అంతా జ్ఞానం ఉంది, కానీ అతనికి ఏదో లోటు ఉంది మరియు అది ఏమిటో అతనికి తెలియదు.
కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు సమాధానాల కోసం తిరుగుతూ, అందరూ ఒక మర్రి చెట్టు ఉన్న స్థలం దగ్గరికి చేరుకున్నారు. మర్రిచెట్టు కింద ఒక యువకుడు పెద్ద చిరునవ్వుతో కూర్చుని ఉన్నాడు. ఆకస్మాత్తుగా వాళ్ళందిరికీ ఈ వ్యక్తి సమాధానం ఇవ్వగలడని ఆలోచన వచ్చింది. వల్ల సమస్యలను ఈ వ్యక్తి పరిష్కరిస్తాడని నలుగురు భావించారు. కావున వాళ్ళు నలుగురూ అలా అక్కడే కూర్చున్నారు. చిరునవ్వుతో మర్రిచెట్టు కింద కూర్చున్న యువకుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అయినా వారందరికీ వారు కోరుకున్న సమాధానం వచ్చింది.
ఇది గురు పూర్ణిమ యొక్క మొదటి కథ. అది పౌర్ణమి రోజు మరియు అలా గురుపరంపర (గురు క్రమం యొక్క వంశం) ప్రారంభమైంది. ఈ నలుగురు వృద్ధులూ గురువులయ్యారు.
వారికేమి కావాలో అది దొరికింది:
- దుస్థితి పోయింది
- సమృద్ధి మరియు సంతోషం వచ్చాయి
- అన్వేషణ ఆగిపోయింది
- జ్ఞాని తనను తాను వ్యక్తీకరించడానికి ఒక గురువును పొందాడు
ఆ నాల్గవ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, అతనికి జ్ఞానం అంతా ఉంది, కానీ అతనికి కనెక్ట్ చేయడానికి గురువు లేడు . కావున గురువుతో అంతరంగ కనెక్షన్ ఏర్పడింది.
అందుకే ఆదిశంకరాచార్యులు “మౌన వ్యాఖ్య ప్రకటిత, పర , బ్రహ్మ తత్వం యువనం” అన్నారు. (అర్థం: తన మౌన స్థితి ద్వారా సర్వోన్నతమైన బ్రహ్మం యొక్క నిజ స్వరూపాన్ని వివరించే దక్షిణామూర్తి (మొదటి గురువు)ని నేను స్తుతిస్తున్నాను మరియు నమస్కరిస్తున్నాను).
కథ యొక్క ఉపమానం
కథలో, ఉపాధ్యాయుడు యువకుడు ఎందుకంటే ఆత్మ ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటుంది, కానీ విద్యార్థులు వృద్ధులు. దీనితో ఇలాంటి ఉపమానాలు చాలా అనుబంధించబడ్డాయి. అన్వేషణ మిమ్మల్ని వృద్ధులుగా తయారుచేస్తుంది. ప్రపంచం కోసం, విముక్తి కోసం లేదా దేనికోసమైనా వెతకడం మిమ్మల్ని వృద్దులుగా తయారుచేస్తుంది. కాబట్టి శిష్యులు ముసలి వాళ్ళుగా ఉన్నారు. మరియు మాస్టర్ యువకుడిగా ఉన్నాడు.
మర్రి చెట్టుకు ప్రతీక ఏమిటి? ఒక మర్రి చెట్టు స్వంతంగా దానికదే పెరుగుతుంది. దీనికి ఎవరి శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం లేదు. ఒకవేళ మర్రి చెట్టు విత్తనం రాతిపగుళ్లలో చేరినట్లైతే, అంటే నీరు ఎక్కువగా లేని చోట కూడా అది పెరుగుతుంది. దానికి కావలసిందల్లా కొద్దిగా బురద మరియు చాలా కొంచెం నీరు. కొన్నిసార్లు దానికి అది కూడా అవసరం లేదు. మరియు ఒక మర్రి చెట్టు అన్ని సమయాలలో ఆక్సిజన్‌ను ఇస్తుంది. 24 గంటలూ ఆక్సిజన్‌ను ఇచ్చే వాటిలో ఇది ఒకటి. దాని అన్నీ ఇచ్చే స్వభావము గురు తత్త్వానికి ప్రతీక.
గురువు అంటే చీకటిని, దుస్థితిని, ఒంటరితనాన్ని, లేమిని తొలగించి సమృద్ధిని కలిగించేవాడు, ఎందుకంటే లేమి అనేది మనస్సులో మాత్రమే ఉంటుంది. కాబట్టి గురువు లేమిని తొలగించి స్వాతంత్య్రాన్ని తీసుకొస్తాడు.







