సహజ వ్యవసాయ పద్ధతులతో రైతులను బలోపేతం చేయడం
నేల నాణ్యతను సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం మరియు భారతదేశంలో రైతులను ఉద్ధరించడం.
వ్యూహం
సహజ వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇచ్చి వారికి అండగా ఉండడం
ప్రభావం
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే ఉత్పత్తి
చేరువ
30 లక్షల రైతులు సహజ వ్యవసాయ పద్ధతులలో శిక్షణ పొందారు
పర్యావలోకనం
రుణ బాధ, పంట దిగుబడి లేకపోవడం, సామాజిక ఒత్తిడి అన్నీ కలిపి అన్న దాతను ఇబ్బందిపెడతాయి. రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద మరియు బ్యాంకులలో ఖరీదైన రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల కొనుగోలు కొరకు ఋణం తీసుకుంటారు. వర్షాలు పడకపోతే రైతులు తమ ఉత్పత్తులను కోల్పోతారు మరియు పంట ఋణం తీర్చలేరు.
ఆర్ట్ అఫ్ లివింగ్ వారు ప్రారంభించిన శ్రీ శ్రీ సహజ వ్యవసాయ ప్రాజెక్ట్, భారత దేశం అంతటా రైతులకు సహజంగా పంటలను పండించడాన్ని ప్రోత్సహించి తద్వారా తక్కువ ఖర్చుతో మంచి పంటను మరియు మెరుగైన ఉత్పత్తిని మరియుమంచి లాభాలను తెప్పించడానికి వాగ్దానం చేస్తోంది.
ఇప్పుడు బాగా వాడుతున్న రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు మిశ్రమజాతి విత్తనాల వలన రైతులు పెద్ద రుణాలు తీసుకోవడమే కాకుండా నీటిని కలుషితం చేయడం మరియు నేల యొక్క పోషకాలను తగ్గించడంతో పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తోంది. ఆర్ట్ అఫ్ లివింగ్ వారు ప్రోత్సహించే సహజ వ్యవసాయ పద్ధతులతో పర్యావరణ అనుకూలమై ఉండి ప్రకృతిలో స్థిరమైనదే కాకుండా తక్కువ పెట్టుబడి కలది.
ఇలాంటి పద్ధతులు భారతదేశం ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ ఆధారంగా ఉన్న తొలి రోజులలో అమలులో ఉన్నాయి. కానీ 60ల్లో వచ్చిన హరిత విప్లవం విపరీతమైన ఎరువులు మరియు మిశ్రమజాతి విత్తనాల వాడకానికి దారితీసి దేశంలోని రైతులను పీకల్లోతు రుణంలోకి నెట్టేసి పర్యావరణాన్ని కూడా దెబ్బతీసింది. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడానికి, నేలను పరిరక్షించడానికి పర్యావరణాన్ని కాపాడడానికి మరొక విప్లవానికి పిలుపునిస్తుంది.
శ్రీ శ్రీ సహజ వ్యవసాయ కార్యక్రమం ఈ విప్లవాన్ని ప్రారంభించింది.
నేను నేను కేవలం 1.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి 15 రోజులకొకసారి 8,000 కిలోల పచ్చ మిర్చిని పండించాను. మా జిల్లా తీవ్ర కరువు బారిన పడినప్పుడు, మిగతా రైతులందరికీ కరువు పరిహారం వచ్చింది, నాకు మాత్రం మంచి లాభాలు వచ్చాయి.…
మహబూబ్ బాషా
లక్ష్మణపురం, కర్నూలు జిల్లా
వ్యూహం
ఆర్ట్ అఫ్ లివింగ్ యొక్క యువచార్యుల బహుముఖ వ్యూహంతో, వ్యవసాయ శిక్షకులు మరియు అనేక ప్రభుత్వ అధికారులు దేశంలోని రైతులకు సహాయం చేస్తున్నారు. ఆర్ట్ అఫ్ లివింగ్ వారు అన్ని రాష్ట్రాలలో సహజ వ్యవసాయం పట్ల వివిధ శిక్షణలను అందిస్తుంది.
శిక్షకులు దేశీయ విత్తనాలు, దేశవాళీ ఆవులు, సహజ ఎరువులు మరియు పురుగు మందుల సైద్ధాంతిక పరిజ్ఞానము అందించడమే కాకుండా వాటి ఆచరణాత్మక ప్రదర్శనను నిర్వహిస్తారు.
శిక్షణ కార్యక్రమం ఈ క్రింది వాటిపై అవగాహనా కల్పించబడింది:
- వివిధ సేంద్రీయ ఎరువులు తయారుచేసే పద్ధతులు
- పొలంలో సరైన ఎరువులు వేసే పద్ధతి
- పంటను సేంద్రీయంగా నిర్వహించడానికి మార్గాలు
- కోత తర్వాత ఉత్పత్తిని సహజంగా నిర్వహించడానికి విధానాలు
శిక్షణాంతరం రైతులను సహజ వ్యవసాయం వైపు మళ్ళించేలా ఆర్ట్ అఫ్ లివింగ్ చేయూతనందిస్తుంది.
ఆర్ట్ అఫ్ లివింగ్ వారు స్థాపించిన కిసాన్ మంచ్ ద్వారా రైతులు వారి వారి సమస్యలను చర్చించుకోవచ్చు.
రైతులకు వారి ఉత్పత్తులకు తగ్గ ధర రావడానికి మేము ప్రత్యక్ష మార్కెట్ ని ఏర్పాటు చేస్తాము.
3 రోజుల శిక్షణ
సహజ వ్యవసాయంలోని ప్రాథమిక అంశాలు
మార్గదర్శకత్వం
ప్రాంతం మరియు ఋతువును బట్టి వ్యక్తిగతీకరించిన సమాచారం అందివ్వడం
చేయూత
యువచార్యులు రైతులు సహజ వ్యవసాయాన్ని కొనసాగించేలా చూస్తారు
కిసాన్ మంచ్
రైతులు కలుసుకొని సమస్యలను మరియు ఆలోచనలను చర్చించుకోవడం
ప్రత్యక్ష సంత
దళారీ వ్యవస్థను తొలగించి రైతులు తగిన ధరకి అమ్మే వెసులుబాటు ఉండడం
మానవ మనుగడ కొరకు వ్యవసాయం వెన్నెముక. ఏదైనా నాగరికత అభివృద్ధి చెందడానికి, వ్యవసాయం ఆరోగ్యంగా మరియు స్థిరంగా ఉండాలి. ప్రాథమిక పరిశ్రమ అయిన వ్యవసాయంపై మళ్లీ దృష్టి పెట్టాలి.
- శ్రీ శ్రీ గురుదేవ రవి శంకర
విప్లవంలో పాలుపంచుకోండి
మీ మద్దతుతో మనం ఇంకా ఎంతో సాధించగలం. పర్యావరణహిత పద్ధతులతో, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేలా రైతులకు సహాయపడండి.