నిద్రకు సరైన దిశ ఏది?
ఆయుర్వేద త్రయంలో ఉన్నవి ఆహారము, విహారము (సమతుల్య జీవనం) మరియు నిద్ర. అందుకనే మంచి విశ్రాంతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వబడింది. కాబట్టి ఆయుర్వేదంలో మంచి నిద్రకు బహు సూచనలు కలవు. మనం తల ఎటువైపు పెట్టి పడుకోవాలి లాంటి అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. శాస్త్రం ప్రకారం పడుకునే సరైన దిశ ఏంటిది? వాస్తు శాస్త్రం (ఆయుర్వేదం ల) ప్రకారం సరైన దిశ ఏది? ప్రతి రోజు ఏ దిశలో పడుకోవాలి? మంచి నిద్రకు సరైన దిశ ఏది? ఎటు వైపు మనము తిరిగి పడుకుంటే మంచిది?
శాస్త్రం ప్రకారం నిద్రకు సరైన దిశ ఏది?
భూమి యొక్క ఆయస్కాంత వ్యతిరేకతను నివారించే దిశలో నిద్ర ఉండాలి. భూమి అతి భారీ అయస్కాంతం (అయినప్పటికీ తక్కువే), కానీ దాని ప్రభావం మనుషుల మీద గణాంకపరంగా బాగానే పడుతుంది.
భూమి యొక్క అనుకూల అయస్కాంత శక్తి ఉత్తర ధృవం వైపు, మరియు దక్షిణం వైపు ప్రతికూలంగా ఉంటుంది. ఒక మనిషి శరీర తల అయస్కాంత అనుకూల శక్తి వైపు, మరియు పాదాలు ప్రతికూల శక్తి వైపు ఉండాలి. భిన్న సజాతి ధృవాలు వికర్షిస్తాయి, కావున మనం ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే వ్యతిరేకత శక్తుల కారణంగా అలసిపోయే అవకాశం కలదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎటు వైపు పడుకుంటే మంచిది
వాస్తు, ఆయుర్వేదం లాంటి ఓ శాస్త్రం, దిశల గురుంచి తెలియజేసేది, ఇదొక నిర్మాణ విజ్ఞానం, పర్యావరణ సామరస్యం మరియు యోగక్షేమాల గురించి చెప్పే పురాతన శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రతకడానికి మరియు పని చేయడానికి అనుకూలమైన వ్యవస్థను పంచమహాభూతాలు (ఆకాశము, వాయువు, జలము, అగ్ని మరియు భూమి), దిశలు మరియు మెరుగైన ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యము, సంతోషము కోసం ఉండే శక్తి క్షేత్రాలు ద్వారా ఏర్పాటు చేయడం.

నేను ఉత్తర అమెరికాలోని ఒక ప్రఖ్యాత వాస్తు నిపుణుడు అయిన మైఖేల్ మాస్ట్రోని అడిగితే ఆయన చెప్పిందేంటంటే “మనం ఎప్పుడూ కూడా తల ఉత్తరం వైపు పెట్టి పడుకోము, ఎందుకంటే ఉత్తర ధృవం వైపు నుంచి అనుకూల అయస్కాంత శక్తి వస్తుంది, కాబట్టి మన శరీరము ఒక అయస్కాంతము అయిఉండి, మన తల అనుకూల ధ్రువణతగా ఉండటం మూలాన రెండు అనుకూల అయస్కాంత క్షేత్రాలు దగ్గర రావడం లాంటిది (అందుకే!); అవి మళ్లిపోయి రక్తసరఫర, ప్రసరణ మరియు జీర్ణక్రియలకు భంగం కలిగి ప్రశాంతమైన నిద్ర పట్టదు. మీకు ఆరోగ్య సమస్యలుంటే, దక్షిణ దిశలో పడుకుంటే చాల మంచిది (దక్షిణ అర్ధగోళంలో నివసించే వారికీ కూడా ఈ సలహాలు వర్తిస్తాయి).”
మన శాస్త్రాలు ఎటు వైపు పడుకోవాలి అని చెబుతున్నాయి
ప్రాచ్యం దిశ స్థిత దేవస్తాత్పూజార్ధం చ తచ్చ్చిరః
(సుశ్రుత సంహిత 19.6)
సుశ్రుత సంహిత తలని తూర్పువైపు ఉండాలని సిఫార్సు చేస్తుంది. దక్షిణం వైపు పాదాలు ఉన్నట్లయితే ప్రాణ శక్తి క్షీణిస్తుంది. జైవిక ఊర్ద ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ప్రాణ శక్తి పాదాల నుండి ప్రవేశిస్తుంది మరియు పిండంలోకి ఆత్మ తల ద్వారా ప్రవేశిస్తుంది.
యథా స్వకీయాన్యజినాని సర్వే సంస్తీర్య వీరాః శిశుపుర్ధరణ్యామ్ అగస్థశస్తాం (దక్షిణాం) అభితో దిశంతు
శిరాంసి తేషాం కురుసత్తమానాం (మహాభారతం)
భగవంతుడైన శ్రీ కృష్ణుడు యుధిష్టురునికి చేసిన హితోపదేశం నిద్ర ఎప్పుడూ దక్షిణం వైపు తల మరియు కాళ్ళు ఉత్తరం వైపునకు ఉండాలి.
ఉత్తరం వైపు నిద్ర పోవడం
ఉత్తరం వైపు నిద్ర పోవడం అస్సలు మంచిది కాదు. దాని వల్ల ఒంట్లో నుంచి శక్తి బయటికి పోయి, శరీరము-మనస్సు-ఆత్మ యొక్క ఏకీకరణకి భంగం కలుగుతుంది. వైద్యపరంగా మన శరీరంలో ఉన్న ఇనుము మెదడులో ఘనీభవించడం వలన రక్త ప్రసరణలో సమస్యలు, ఒత్తిడి పెరగడం, శారీరిక మరియు మానసిక సమస్యలు ఇంకా నిద్రలేమి రావచ్చు.
వసంత్ లాడ్ అనే వైద్యులు చెప్పేదేంటంటే “మరణించిన వారే ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటారు.” నిజానికి, హిందు పద్ధతి ప్రకారం, చనిపోయిన తరువాత ఆత్మ శరీరము నుండి ఉత్తరం దిక్కు వైపు వెళ్ళిపోతుంది అనే నమ్మకం ప్రకారం, శవాన్ని దహనం చేసేవరకు ఉత్తరం వైపు తల పెట్టి పడుకోబెట్టడం జరుగుతుంది.
తూర్పు వైపు నిద్ర పోవడం
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అందుకని ఆ దిక్కు మంచి అనుకూలమైన శక్తి ప్రసరణకు, కార్యాచరణకు, పునరుత్తేజం మరియు బలాన్ని పొందేందుకు సూచిక. ఎప్పుడైతే మీరు తూర్పు వైపునకు పడుకుంటారో సూర్య కిరణాలు మీ తల నుండి ప్రవేశించి కాళ్ళ ద్వారా పోయి మీ తల చల్లగా మరియు కాళ్ళు వెచ్చగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చదువుకునే పిల్లలకు అవసరం, ఎందుకంటే వాళ్ళ మెదడుని మెరుగుపరిచి ఏకాగ్రతను పెంచి ఆరోగ్యం మొత్తంగా ఉండేదుకు సహకరిస్తుంది.
ఇది ధ్యానానికి, ఇంకా ఇతర ఆధ్యాత్మిక ఉన్నతికి మంచిది. తూర్పు-పడమర దిక్కున పడుకుంటే సృజనాత్మకత పెరగడం, గర్భధారణకు మేలు, మూడు దోషాలను (వాతా, పిత్త మరియు కఫ) సమతుల్యం చేయడం జరుగును.
అధ్యయనాల ప్రకారం ఈ దిక్కున పడుకున్నవారికి చిన్న చిన్న పరియాయాల గాఢ నిద్ర (ఉత్తరం దక్షిణం వైపు పడుకోవడం కంటే) వలన తక్కువ కలలు రావడం ఇంకా మంచి నిద్రపట్టడం జరుగుతుంది.

పశ్చిమం వైపు నిద్ర పోవడం
పశ్చిమం వైపు పడుకోవడం మంచిది కాదు. కొంత మంది ఇది రాజసిక తత్వాన్ని, ఆశయాన్ని లేక అలసత్వాన్ని పెంచడం చేస్తుందని, ఇంకొంతమంది తటస్థంగా ఉంటుందని అంటారు. కానీ వాస్తు ప్రకారము, పశ్చిమం వైపు తల పెడితే మంచి నిద్ర పట్టకపోవడం ఒకవేళ పట్టినా భంగమవడం, పీడకలలు రావడం లేదా హింసాపూరిత ఆలోచనలు రావడం జరగవచ్చు.
దక్షిణం వైపు నిద్ర పోవడం
అయస్కాంత సిద్ధాంతం ప్రకారం, ప్రతికూల దక్షిణం మరియు అనుకూల తల మధ్య పరస్పర ఆకర్షణ వల్ల ఒక సామరస్యపు నిద్ర పడుతుంది. పురాణ, శాస్త్రాల ప్రకారం, దక్షిణం అనేది యమధర్మరాజుకు సంబంధించిన దిక్కు. అందుకని ఒక మంచి గాఢమైన పునరుసుద్ధరించే మరణం లాంటి నిద్రను ఇస్తుంది. వాస్తు నిపుణులు ఈ దిక్కుని మంచి ఆరోగ్యం, రక్త ప్రసరణను తగ్గించేదిగా, ఇంకా మంచి శక్తినీ, ఐశ్వర్యాన్నీ, శ్రేయస్సునీ, సామరస్యతను వృద్ధి చేస్తుందని నమ్ముతారు.
వాత దోషం గలవారు, తరచుగా ఆందోళనకి గురవడం మరియు చల్లని చేతులు కల వారైఉంటారు, తలని దక్షిణం వైపు గానీ ఆగ్నేయం (దక్షిణం మరియు తూర్పు కలయిక) వైపు గానీ పెట్టడం సూచించబడింది.
పిత్త దోషం తీవ్రత గలవారు పరిమిత సమయం వరకు వాయువ్యం (ఉత్తరం మరియు పశ్చిమం కలయిక) వైపు పడుకోవాలి.
పశ్చిమం వైపు పరిమిత సమయం వరకు తల పెట్టి పడుకుంటే కఫ వికృతి సంతులత తిరిగి వస్తుంది.
వెల్లకిల పడుకున్నపుడు తల పెట్టే దిశ గుండె పనితీరుపై, రక్త ప్రసరణపై గానీ లేక ఒత్తిడి కలిగించే గ్రంధి (కార్టిసోల్) విడుదల చేసే స్రవంపై గానీ ప్రభావం తెలుసుకునేందుకు భారత దేశంలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని శరీరధర్మశాస్త్ర శాఖ 2009 లో పరిశోధన చేయడం జరిగింది. ఎవరినైతే దక్షిణ దిశలో పడుకోమని చెప్పడం జరిగిందో, వారి సిస్టోలిక్ రక్త పోటు, డయాస్టోలిక్ రక్త పోటు, గుండె సవ్వడి మరియు ఒత్తిడి స్రవం (కార్టిసోల్ సీఠం) తక్కువగా ఉంది. ఇవి ఎంతో గొప్ప పురోగతి, అయినప్పటికీ ఇంకా వేర్వేరు గుంపులతో పరిశోధన చేయాల్సి ఉంది.
పురాతనమైన వాస్తు శాస్త్రంలో మరియు ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలనే ఆధునిక శాస్త్ర విజ్ఞానం పదే పదే చెబుతోంది.
ముగింపు
- దక్షిణం-ఉత్తరం: దక్షిణం వైపు తల మరియు ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించవచ్చు.
- తూర్పు-పడమర: తూర్పు వైపు తల మరియు పశ్చిమం వైపు కాళ్ళు పెట్టి నిద్రించవచ్చు.
- పశ్చిమం వైపు తల పెట్టి పడుకోవడం శ్రేయస్కరం కాదు
- ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించడం నిషేధం

నిద్ర పోవడానికి ఏదైనా సరైన దిశ ఉందా?
ఆయుర్వేదం మీ ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వలన ఊపిరి తీసుకోవడం సులభంగా ఉంటుందని సూచిస్తుంది. అది మీ గుండెపై ఒత్తిడిని తగ్గించి, ప్రసరణకు సహాయం చేయడం తద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరచడం జరుగుతుంది. ఒక పురాతనమైన యోగ వ్యక్తీకరణ ప్రకారం నిద్ర యొక్క శారీరిక నిర్మాణ స్థలం గురించి ఇప్పుడు చూద్దాం.
“ఒక భోగి బోర్లా పడుకుంటాడు, ఒక రోగి వెల్లకిలా పడుకుంటాడు, ఒక యోగి పక్కకు తిరిగి పడుకుంటాడు.”
పక్కకు తిరిగి పడుకోవడం వలన మన సూర్యనాడికి (కుడి నాసికారంధ్రము) మరియు చంద్రనాడికి (ఎడమ నాసికారంధ్రము) ప్రేరణ కలిగి ఒంట్లో ప్రాణశక్తి పెరుగుతుంది. అది ఒంట్లోని కణాలను జాగరూపుగా ఉంచి దైవ చింతనతో ముడిపెట్టి మన శరీరానికి మనస్సుకి రక్షణని ఇస్తుంది.
అటువంటి చైతన్యము మన శక్తి క్షేత్రము ద్వారా ప్రవహించినపుడు మన శరీరానికి మంచి ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా మన చుట్టూ ఉన్న పర్యావరణానికి ప్రసరిస్తుంది.
కాబట్టి ఎప్పుడూ పక్కకు తిరిగి పడుకోవడం మంచిది.
అనురాధ గుప్త ఒక ఇంజనీర్, (ఎం. బి. ఏ.) ఆయుర్వేద సలహాదారు. ఆమె కార్పొరేట్ నేపథ్యం కలిగిఉండి కూడా ‘ఆర్ట్ అఫ్ లివింగ్’ కి స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేస్తున్నారు. వారిని మీరు లింక్డ్ఇన్ ద్వారా గానీ పేస్బుక్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.








