నేను ఎప్పుడు నిద్ర పోవాలి?
ధర్మమే ప్రకృతి. శరీరం ధర్మాన్ని కలిగి ఉంది. ఒకవేళ శరీరం నిద్ర కావాలని కోరుకుంటే మీరు విశ్రాంతి అందించాలి. కానీ శరీరం నిద్ర పోవాలని కోరుకుంటే మనం ఏమి చేస్తాము? ఆసక్తికరమైన సినిమా వస్తుందని టెలివిజన్ పెట్టుకుంటాము. మనం శరీరానికి (శరీర ధర్మానికి) వ్యతిరేకంగా వెళ్తున్నాము. శరీరానికి దాని అవసరాలు దానికి ఉన్నాయి. మనం శరీరం చెప్పేదాన్ని తప్పకుండా వినాలి.
నేను ఎంతసేపు నిద్ర పోవాలి?
శక్తికి నాలుగు వనరులు ఉన్నాయి:
-
ఆహారం: ప్రాచీన భారత దేశంలో ఎవరైనా తమాషాగా ప్రవర్తిస్తుంటే ప్రజలు “మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?” అని అడగడానికి బదులు “మీరు ఇతనికి ఏమి ఆహారం ఇచ్చారు ?” లేదా “మీరు ఈ రోజు ఏం తిన్నారు?” అని అడిగేవారు. ఏదో ఒక విధంగా ఇది నిజం. ఆహారం మొదటి శక్తి వనరు.
-
నిద్ర: ఒక బుద్ధిమంతుడైన వ్యక్తిని రెండు రోజులపాటు నిద్ర పోనివ్వకపోతే, అతను మామూలుగా ఉండలేడు. అతని లేదా ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పు ఉంటుంది. కాబట్టి నిద్ర, లేదా సరియైన విశ్రాంతి చాల ముఖ్యం.
-
శ్వాస: ఇది మూడవ శక్తి వనరు. కొన్ని నిమిషాల శ్వాస, కొంచెం యోగా, శరీరాన్ని, మనస్సును శక్తివంతం చేస్తుంది. ఆత్మను ఉద్ధరిస్తుంది.
-
సంతోషకరమైన మనస్సు: సౌకర్యవంతమైన మనస్సు మరింత ప్రశాంతముగా, ఏకాగ్రతతో ఉంటుంది. కొన్ని నిమిషాల ధ్యానం మనస్సును సౌకర్యవంతముగా, సంతోషంగా తయారుచేస్తుంది.
మీకు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. మీకు జీవితంలో ఒక అభిరుచి, లక్ష్యం ఉన్నప్పుడు ఇంకేదీ ముఖ్యం కాదు. మీ లోపల ఉన్న శక్తిని కనుక్కుంటారని మీకు తెలుసు. కానీ నిద్రకు, విశ్రాంతికి కొంచెం సమయం తీసుకోండి. నిద్ర చాలా ముఖ్యమైనది.
నిద్ర కోసం ఎలా సిద్ధం కావాలి?
సాధారణంగా మనం పడుకునేటప్పుడు మనకు లేని వస్తువుల గురించి, మన వైఫల్యాల గురించి ఆలోచిస్తాము. పడుకునేముందు మీరు వైఫల్యాలు, ఆశాభంగాలు లేదా ఎవరో ఎదో అన్నారని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అదంతా మన అంతశ్చేతనలోకి వెళ్తుంది. అంటే మనం ఆ విత్తనాన్ని నాటుతున్నాం అన్నమాట. ఆ తర్వాత నిద్ర పోతాము. దాని ప్రభావం వలన మర్నాడు ఉదయం నిద్ర లేచినప్పుడు మీకు అలసిపోయినట్లు, ప్రతికూలంగా, నిరాశ చెందినట్లు అన్పిస్తుంది.
ఒకవేళ రాత్రిపూట మీరు ఆలోచించాలనుకుంటే మీ ధ్యాసను మీ విజయాల మీద లేదా జీవితంలోని సానుకూల అంశాల మీద పెట్టండి. మంచి ఆలోచనలు, మంచి విషయాలను గురించి ఆలోచించండి. మంచి క్షణాల గురించి ఆలోచించిన తర్వాత నిద్ర పొండి లేదా ప్రార్ధన చేయండి. జీవితంలో దేనిపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నామో దానిని ఆలోచించడమే ప్రార్ధన.
ఇలాంటి ఆలోచనలను అక్కడ నాటండి. వాటిని మీ మనసు అనే ఆకాశంలో పెట్టండి. తర్వాత విశ్రాంతిగా నిద్ర పోండి. అప్పుడు మీకు ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా తాజాగా, సజీవంగా అన్పిస్తుంది. మీరు నిద్ర పోవడానికి ముందు సానుకూల ఆలోచనలు విత్తితే నిద్ర లేచిన తర్వాత చాలా తాజాదనాన్ని అనుభవిస్తారు.
త్వరగా నిద్ర పోవడానికి పది చిట్కాలు
-
“త్వరగా” అన్నదాన్ని వదిలివేయండి: నేను త్వరగా నిద్ర పోవాలనే ఆందోళనే మొదటి ఆటంకం. అది మనల్ని మెలకువగా ఉంచుతుంది. ఆ ‘త్వరగా’ అనేదాన్ని వదిలివేస్తే మీరు నిద్ర పోగలుగుతారు.
-
ఆలస్యంగా తినొద్దు: రెండవది ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం లేదా అధిక జీవక్రియ రేటు కలిగి ఉండడం. మరీ ఎక్కువ, తక్కువ కాకుండా సరియైన మోతాదులో ఆహారం తీసుకోవటం మంచి నిద్రకు సహాయం చేస్తుంది.
-
ప్రాణాయామం చేయండి: కొంత ప్రాణాయామం, కొంతసేపు గాఢమైన శ్వాసలు తీసుకోవడం సహాయం చేస్తుంది. ఇది తప్పకుండా సహాయం చేస్తుంది. లోతైన శ్వాస, కొంచెం యోగా కూడా సహాయం చేస్తుంది.
-
ధ్యానం: ధ్యానం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. చాలాసార్లు, ఎక్కువ సమయం, ఎక్కువ ధ్యానం చేయండి. (ధ్యానం నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
-
గతాన్ని, భవిష్యత్తును వదలివేయండి: మూడవది విచారాలు. మీరు రేపటి గురించి ఆందోళన చెందుతారు లేదా గత సంఘటనలకు విచారపడతారు. గతకాలపు జ్ఞాపకాలు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన అనేవి నిద్రలేమికి మూల కారణాలలో కొన్ని.
-
యోగ నిద్ర: ఒకవేళ మీరు నిద్ర పోలేకపోతే యోగ నిద్ర చేయండి. క్రింద పడుకుని ఆర్ట్ అఫ్ లివింగ్ ఆప్ లో గానీ, గురుదేవ్ ఛానల్ లో గాని యోగ నిద్ర సూచనలను వివండి. శరీరం లోని వివిధ భాగాలకు మీ ఏకాగ్రతను తీసికెళ్ళండి. ఇది మీకు నిద్ర పోవడానికి సహాయం చేస్తుంది.
-
తేలిక పాటి సంగీతం వినండి: తేలిక పాటి వాద్య సంగీతం కూడా సహాయం చేస్తుంది. ఆ సంగీతం మీ మొత్తం శరీరంగుండా వెళ్తున్నట్లు భావించండి. కేవలం పడుకుని మీకు అంతగా పరిచయం లేని ఏదో ఒక వాద్య సంగీతాన్ని వినండి. మీకు పరిచయమున్న సంగీతం అయితే మీరు పాడడం మొదలు పెడతారు, దానిని జపిస్తారు. కానీ మీరు అపరిచితమైన, తేలిక పాటి సంగీతం ఎంచుకుంటే అది మీకు నిద్రను కలిగిస్తుంది.
-
పాలు త్రాగండి: కొంచెం గోరువెచ్చని లేదా చల్లని పాలు నిద్రపోయేముందు తీసుకోవడం చాలా మందికి సహాయం చేసింది.
-
పవర్ ఆఫ్ నుండి పవర్ డౌన్: నిద్ర పోవడానికి చాలా ముందు, కనీసం ఒక గంట ముందు మీ ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి. నిద్ర పోవడానికి ఒక గంట ముందు నుండి మరియు నిద్ర లేచిన గంట వరకు ఫోన్ కర్ఫ్యూ పాటించండి.
-
కష్టపడండి: ఎవరైనా ఒక రోజంతా కష్టపడి పని చేస్తే దోమలున్నాసరే నిద్ర పోతారు. దోమలే కాదు, ఎలుకలు కొరికినా సరే అతనికి / ఆమెకు నిద్రాభంగం కలగదు. కానీ మీరు పగటిపూట సమయం వృధా చేస్తే మీకు మెత్తని, సౌకర్యవంతమైన పరుపు ఉన్నా సరే రాత్రిపూట నిద్ర పోవడం సాధ్యం కాదు. మీరు విసురుకుంటారు, ప్రక్కకి తిరుగుతారు. ఒక్క దోమ చేసే శబ్దం కూడా మిమ్మల్ని మేల్కొల్పుతుంది. మీ నిద్రలేని రాత్రికి దోమ బాధ్యత వహించదు. మీ బద్దకమే మిమ్మల్ని నిద్రపోనివ్వదు. రోజంతా పరుపు మీద పడుకునే ఉంటే రాత్రి నిద్ర ఎలా వస్తుంది? అతి నిద్ర పోయే వాళ్ళు నిద్రను ఆనందించలేరు. కానీ రోజంతా పొలాలలో కష్టపడి పనిచేసి అలసిపోయిన వాళ్ళు నిద్ర పోవడంలోని సంతృప్తిని కనుగొంటారు.
విశ్రాంతిగా ఉండడానికి, సుఖనిద్ర కోసం శక్తివంతమైన విధానాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆందోళన, నిద్రలేమి రుగ్మత నుండి విముక్తి కలిగించే వర్క్ షాప్ కు సైన్ అప్ చేయండి.
బోనస్ : నిద్ర మరియు అభివ్యక్తీకరణ
రాత్రి పూట మీకు ఒక కోరిక ఉంది అనుకుందాం. మీరు కొంచెం టీ లేదా నీళ్లు లేదా జ్యూస్ తాగాలనుకుంటారు. కానీ అది చేయకుండానే నిద్రపోయారు. అప్పుడు రాత్రి పూట ఏమవుతుంది? కలలో మీరు త్రాగుతూనే ఉంటారు లేదా గాఢమైన నిద్ర పోలేరు.
మంచి నిద్ర పొందాలంటే మీకు ఏమి అవసరం? మానసికంగా (కోరికలను) వదిలివేయాలి. రహస్యం ఏమిటంటే మీరు వదిలివేస్తే అది నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఆ కోరికను పట్టుకుని ఉంటే అది నెరవేరదు. మీరు ఏమి చెయ్యాల్సిన అవసరం ఉంది? మీకు ఒక కోరిక ఉంది. దాన్ని మీరు గురువుకు గాని, ఏదైనా ఉన్నతమైన / గొప్ప శక్తికిగాని ఇచ్చేసి, మీరు విశ్రాంతిగా ఉండండి. మీరు వదిలి వేసినప్పుడు మాత్రమే విశ్రాంతిగా ఉండగలరు. మీరు మీ యొక్క నిజమైన స్వభావంలో ఉండగలరు.