ఖైదీల జీవితాలను మార్పు తీసుకురావడం
మానసిక గాయాల నుండి ఉపశమన సంరక్షణ మరియు నైపుణ్య శిక్షణతో ఖైదీల పునరావాసం.
సవాలు
హింసా వలయంలో చిక్కుకున్న ఖైదీలు
వ్యూహం
కోపం, ఒత్తిడి మరియు హింసను తగ్గించడానికి నిరూపితమైన పద్ధతులతో ఖైదీలలో మార్పు తీసుకురావడం
చేరువ
ప్రపంచవ్యాప్తంగా 65 కు పైగా దేశాలలో ఉనికితో, 8,00,000+ ఖైదీలు మరియు సిబ్బందిలో మార్పు తీసుకువచ్చింది.
సంక్షిప్త వివరణ
నేరానికి పాల్పడవలసి వచ్చిన ప్రతి వ్యక్తికీ, తమను తాము మార్చుకుని అర్థవంతమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక అవకాశం ఇవ్వాలని మేము విశ్వసిస్తున్నాము. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జైలు కార్యక్రమం, జైళ్లలో ఖైదు చేయబడిన వారికోసం మరియు నేర న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారికోసం రూపొందించబడింది.
ఈ కార్యక్రమం ఒత్తిడిని తగ్గించే నైపుణ్యాలను నేర్పించడం, మానసిక గాయాలను మాన్పడం, మరియు ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఆచరణాత్మక పద్ధతులను అందించడం ద్వారా ఎన్నో జీవితాలను మార్చివేసింది.
ఈ కార్యక్రమం, ఖైదీలు మరియు హింసా చరిత్ర ఉన్న వ్యక్తులు నేరాలనే తిరోగమన చక్రం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
వివిధ జైలు అధికారులు మరియు సాయుధ దళాలతో కలిసి పనిచేస్తూ, మేము ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఖైదీల కోసం కార్యక్రమాలను నిర్వహించాము. మా కార్యక్రమాలతో ప్రభావితమైన ఎంతోమంది ఖైదీలు ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఉపాధ్యాయులుగా మారి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి మాతో కలిసి పనిచేస్తున్నారు.
[ఆర్ట్ ఆఫ్ లివింగ్] వారి జైలు కార్యక్రమం గురించి తెలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది, ఎందుకంటే అది ఒత్తిడిని తొలగించడం, మనసుకు, భావోద్వేగాలకు విశ్రాంతినివ్వడం, మరియు ఒక వ్యక్తిలోని ఉత్తమ సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి సరిగ్గా అవసరమైన వాటినే అందించింది . ఒకప్పుడు…
డా. కిరణ్ బేడి
పిపిఎమ్జి, పిఎన్బిబి, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ జనరల్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఆచరించడం చాలా సులభమని మరియు ఇది చాలా ప్రభావవంతమైనదని నేను కనుగొన్నాను. ఖైదీలు మరియు అధికారులు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక శ్రేయస్సు ద్వారా అపారమైన ప్రయోజనం పొందారు.
డి.ఆర్. కార్తికేయన్
జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ డైరెక్టర్ జనరల్
ప్రతి నిందితుని లోపల, సహాయం కోసం ఆర్తనాదం చేస్తున్న ఒక బాధితుడు ఉంటాడు. మీరు బాధితుడిని స్వస్థపరిచినప్పుడు, నిందితుడు అదృశ్యమవుతాడు.
- గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
సవాలు
సంవత్సరాల తరబడి నిర్బంధం ఆత్మగౌరవాన్ని మరింతగా కోల్పోవడానికి, కోపం, ఆందోళన మరియు నిరాశ వంటి భావనలు పెరగడానికి దారితీస్తుంది. చాలా మంది ఖైదీలు తాము నేరాలనే ఈ తిరోగమన చక్రం నుండి ఎప్పటికీ బయటపడలేమని గట్టి నమ్మకాన్ని పెంచుకుంటారు.</p
విడుదలైన తర్వాత, సమాజం వారిని అంగీకరించనందున, ఖైదీలు ప్రధాన సమాజ స్రవంతిలో కలిసిపోవడం ఒక సవాలుగా మారుతుంది. అందువల్ల, చాలా మంది ఖైదీలు విడుదలైన తర్వాత తిరిగి నేరాలకు పాల్పడుతూ ఒక దుష్టచక్రాన్ని ఏర్పరుస్తారు.
జైలు సిబ్బంది కూడా కఠినమైన పరిస్థితులలో నిరంతరం పనిచేయడం వల్ల అధిక శ్రమ మరియు ఒత్తిడికి గురవుతారు కాబట్టి, ఖైదీల వైఖరులను మార్చడం వారికి కష్టమవుతుంది.
హింసా చక్రం

వ్యూహం
మా జైలు కార్యక్రమంలో ఇవి ఉంటాయి:
ఖైదీలను మానసికంగా స్వస్థపరచడం: మా జైలు కార్యక్రమంలో ఖైదీలు మానసిక గాయం, అపరాధభావం, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాల వలయం నుండి బయటపడటానికి సహాయపడే ప్రత్యేక శ్వాస పద్ధతులను నేర్పిస్తాము. మేము ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తాము, ఇవి చివరికి ఖైదీలు ఈ భావోద్వేగాలను అధిగమించడానికి సహాయపడతాయి. ఖైదీలు కోపం మరియు ఒత్తిడి నుండి విముక్తి పొందినప్పుడు, వారు విడుదలైన తర్వాత తిరిగి నేరాలకు పాల్పడటం కంటే సమాజానికి దోహదపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జీవనోపాధి కల్పించడం: ఖైదీలు విడుదలైన తర్వాత గౌరవప్రదమైన మార్గాల ద్వారా తిరిగి జీవనోపాధి పొందేలా మేము వారికి వృత్తి శిక్షణను నిర్వహిస్తాము.
జైలు సిబ్బంది ఒత్తిడిని తగ్గించడం: మేము జైలు సిబ్బంది మరియు చట్ట అమలు సంస్థలలో పనిచేసే ఇతరుల ఒత్తిడిని తగ్గించడానికి మరియు వారిని మరింత సమర్థవంతంగా మార్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను నిర్వహిస్తాము.





