ఆందోళన మన వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితాల్లో ఆటంకాలను, ఇబ్బందులను కలిగిస్తుంది. ఇంకా ఘోరం ఏంటంటే మన మనసులో జరిగే దీని ప్రబావం శారీరకంగా కూడా నేక విధాలుగా ఉంటుంది. ఉదాహరణకు, మీ వణుకు వల్ల మొదట్లో మొహం మీద చెమట పట్టడం ఇంకా నోరు ఎండిపోవడం జరుగుతుంది. తరువాత రోజుల్లో ఇది ప్రొద్దున మలబద్దకం, ఛాతిలో మంట, నిద్రలేని రాత్రులు గడపడo వంటి వాటికి దారి తీస్తుంది. ఆందోళన తెచ్చే లక్షణాల పరిధి స్పష్టంగా విద్యుదయస్కాంత వర్ణమాలలా విశాలమైనది.
అయినప్పటికీ, ఈ విశాలమైన లక్షణాల వర్ణమాలకి మూలం: శరీరములో వాత దోషo (శరీరంలోని వాయువు అసమతుల్యంగా ఉండటం).
ఏదేని మూలకం సమతుల్యంగా ఉండాలంటే, ఆ మూలకానికి వ్యతిరేక గుణాలున్న ఆహారానికి, జీవనశైలికి కట్టుబడి ఉండాలి. వాత దోషానికి తేలికతనము, పొడితనము, చల్లదనము, కరుకుదనము అనేవి గుణాలు. అందుచేత, ఈ దోషాన్ని సమతుల్యంగా ఉంచాలంటే, ఆహారము, జీవనశైలి మార్పులో భాగంగా వెచ్చదనాన్ని కలిగించేేవి, భారమైనవి, జిడ్డు ఎక్కువ ఉండే పదార్థాలను సిఫార్సు చేయటం జరుగుతుంది.
ఆందోళనని తరిమేందుకు, ఇతర దుష్ప్రభావాలూ లేని విధానాలు
పైన పేర్కొన్న సమస్యను సాధారణ నివారణల ద్వారా సులువుగాలోకి తీసుకురాగలము. ఆందోళనను తరిమికొట్టే ఆయుర్వేద నివారణలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
-
వాత దోషాన్ని శాంతపరిచే ఆహరమును తీసుకోండి
మీ ఆహారములో తీపి, ఉప్పు, పులుపు రుచులను చేర్చండి., చేదు, ఘాటైన పదార్థాలను మానివేయండి. ఇక్కడ తీపి అంటే సహజంగా తియ్యగా ఉండే పండ్ల వంటి తీపి పదార్థాలు అని అర్థం, అంతేకాని శుద్ధి చేయబడ్డ చక్కెర కాదు. పొడిగా, చల్లగా ఉండే ఆహరపు పదార్థల కంటే వెచ్చగా, జిడ్డు, తేమ ఉన్న పదార్థాలను మీ ఆహారములో చేర్చండి.
-
మీ శరీర వ్యవస్థకు మూలికలు, ఔషధాలతో ఉపశమనం కలిగించండి
అశ్వగంధ, శంఖపుష్పి, బ్రహ్మి వంటి మూలికలు నరాల వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తాయి, మెదడులోని నిర్వీషీకరణ చేస్తాయి. కానీ, వీటిని వినియోగించే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఆయుర్వేద వైద్యులు మీ శరీర స్వభాావాన్ని బట్టి తగిన ఔషధాలను సూచిస్తారు. సరైన ఔషధుల సలహాల కొరకు శ్రీ శ్రీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి.
-
వాతప్రకృతికోసం ప్రత్యేకమైన ఆయుర్వేద మర్దనాన్ని చేయించుకోండి
శైల అభ్యంగన అనే ఓ ప్రత్యేకమైన ఆయుర్వేద మర్దనం శరీరపు లోతుల్లో ఉపశమనం కలిగిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన ఆయుర్వేద తైలాలు, వేడి నీటిలో కాచిన బసాల్ట్ రాళ్ళను ఉపయోగిస్తారు. ఆ రాళ్ళల్లోని వేడి వాత మూలకం లోని అసమతుల్యాన్ని శాంతింపజేసి శరీరానికీ మనస్సుకీ శాంతిని కలిగిస్తుంది.
-
నిత్యకృత్యాలు ఒకే విధంగా, ఒకే సమయానికి చేయటం అలవాటుగా మార్చుకోండి
రోజూ ఒక క్రమమైన సమయానికి నిత్యకృత్యాన్ని పాటించడము అనేది వాత మూలకం బాగా సమతుల్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అందుచేత, మీరు ప్రతిరోజూ నిద్రలోకి వెళ్లడం, మేలుకొలుపు, భోజనం చేయడం వంటివి ఒక నిర్దుష్ట సమయంలోనే చేయండి.
-
యోగ, ప్రాణాయామము, ధ్యానం చేయండి
యోగ, ప్రాణాయామము, ధ్యానము వలన ఆందోళనను సమర్ధవంతంగా తగ్గించవచ్చని శాస్త్రీయంగా నిరూపితమయింది. అందుకని, ఈ ప్రాచీన సాధనాల కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం అత్యంత అవసరమని సిఫార్సు చేయబడింది. ఈ సాధనాల ద్వారా మీరు ప్రశాంతతని సాధించినవారే కాకుండా మీరు మరింత సమర్ధతను, ఏకాగ్రతనుసాధిస్తారు.
యోగ, ప్రాణాయామము, ధ్యానము మీకు దగ్గరలో ఉన్న శ్రీ శ్రీ కేంద్రములో నేర్చుకోండి.