జీవితాన్ని ఆనందమయం చేస్తూ..
సం.1981 నుండీ శ్వాస ప్రక్రియలు, ధ్యాన, యోగ కార్యక్రమాలద్వారా ప్రజల సంపూర్ణ ఆరోగ్యంకోసం పనిచేస్తున్నది.
మీ సమస్యలకు మా పరిష్కారాలు...
ప్రపంచవ్యాప్త ఉద్యమం...
- 44 సంవత్సరాల ఘనచరిత్ర
- 180కి పైగా దేశాలలో 10,000కు పైగా కేంద్రాలు
- 80కోట్లకు పైగా జీవితాలను స్పృశించింది
ధ్యాన కార్యక్రమాలు
ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండగలిగే సున్నితమైన కళ
This Diwali
Gift Happiness
Don't just give your loved ones material gifts!
Gift them Happiness!
Gift them the Sudarshan Kriya™ !
Gift them the Sudarshan Kriya™
Show me howThis Diwali
Gift Happiness
Don't just give your loved ones material gifts!
Gift them Happiness!
Gift them the Sudarshan Kriya™!
Gift them the Sudarshan Kriya™
Show me howPan IndiaHappiness Program
Anand Utsav
Exclusive ● Live Session with Gurudev Sri Sri Ravi Shankar
Learn Sudarshan Kriya™ Online / In-Person
Starting 13th August 2024
Learn Moreజీవితంలో పెను మార్పును తీసుకొచ్చే

ఆందోళనను 44% తగ్గించే సులువైన శ్వాస పద్ధతి

సుదర్శన క్రియ శరీరంలో సామరస్యాన్ని చేకూరుస్తుంది

World Happiness Day
Global Happiness Program
- Live sessions with Gurudev!
- Learn Sudarshan Kriya™ - the world’s most powerful breathing technique.Loved and practiced by 4.5+ crore people around the globe.
- Join Gurudev LIVE on March 20 on the Sattva App!
March 17-23, 2025
యోగా కార్యక్రమాలు
యోగ అనేది శరీరం, మనసుల సమన్వయం
మీ జీవితాలను మార్చివేసే శ్వాస ప్రక్రియ
సుదర్శన క్రియ™
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులకు మూలస్తంభంగా నిలచిన సుదర్శన క్రియ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు ఒత్తిడిని తగ్గించేందుకు, తగినంత విశ్రాంతిని పొందేందుకు, తమ జీవన నాణ్యతను మెరుగుపరచుకునేందుకు తోడ్పడింది. నాలుగు ఖండాలలో చేపట్టిన పరిశోధనలు, యేల్, హార్వర్డ్ సహా పరిశోధకులచే పరిశీలింబడే అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన నివేదికల ప్రకారం సుదర్శన క్రియ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించి జీవితం పట్ల సంతృప్తిని పెంపొందించటంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుదని వెల్లడైంది.
Kisan Samruddhi Mahotsav
January 29-30, 2025
Featuring Jal Yukt Shivir 2.0, an extraordinary water conservation project that has transformed lives across Maharashtra.
నా శక్తి స్థాయిలు పెరిగాయి, మరియు ముఖ్యంగా నాలోని ప్రతికూలతను తొలగించడానికి ఒక సాధనం లభించింది. నాకు ఒత్తిడితో కూడిన రోజు ఉన్నప్పుడు నేను పూర్తిగా సుదర్శన్ క్రియపై ఆధారపడగలను.

శశాంక్ దీక్షిత్, 40
ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్
అన్నింటికంటే ముఖ్యంగా, తక్కువ సమయంలోనే ఎక్కువ సాధించగలుగుతున్నాను, నేను ఎప్పుడూ చేయాలనుకున్న పనులను కూడా చేయగలుగుతున్నాను. నా పనిపై దృష్టి పెట్టగలను, ప్రాజెక్టులు చేపట్టగలను, ఈత నేర్చుకున్నాను, సంగీతం నేర్చుకున్నాను, ఇంకా ఎన్నో పనులు చేయగలుగుతున్నాను!

అమన్ కె. లోహియా, 34
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్
సుదర్శన్ క్రియ తర్వాత, నేను నా నైపుణ్యాలను విస్తరించగలిగాను. ఉదాహరణకు, ఈవెంట్లను నిర్వహించడంలో మరియు సమన్వయం చేయడంలో నా సామర్థ్యం మెరుగుపడింది. ఇది వివిధ రకాల వ్యక్తులు మరియు పరిస్థితులను ఎదుర్కోవటానికి నాకు సహాయపడింది.

సౌరభ్ పాల్
ఇంజనీర్ మరియు తబలా ప్లేయర్
నొప్పి మామూలే అనుకునేదాన్ని కానీ సుదర్శన్ క్రియ సాధన చేసిన తర్వాత నా పేరు "ఖుషి" (ఆనందం) గా మారింది. ఇప్పుడు ఆనందం నా జీవన విధానం.

శైలజ, 38
ట్రైనర్, ఐటీ ప్రొఫెషనల్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
నాకు ఈ కార్యక్రమం చేయాలని ఉంది, కాని...
ధ్యానం అనేది 60 ఏళ్లు పైబడిన వృద్ధులకోసం కాదా?
ధ్యానం వలన జీవితంలో ఎన్ని లాభాలు కలుగుతాయో గమనిస్తే, ఇది అందరికీ ఎంతో అవసరం అని మీరే అంటారు. ప్రాచీనకాలంలో ధ్యానాన్ని ఆత్మదర్శనం కోసం, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఉపయోగించేవారు. కష్టాలను, సమస్యలను తొలగించే మార్గంగా ధ్యానాన్ని చూసేవారు. వ్యక్తిగతమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు సైతం ధ్యానం మార్గంగా ఉండేది.
మీరు అంతగా కావాలనుకుంటే ఆత్మజ్ఞానం పొందటాన్ని పక్కన పెట్టండి. ఈనాటి జీవితంలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళనల నివారణకు ధ్యానం అవసరం. మీరు ఎంత ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే, అంత ఎక్కువగా ధ్యానం చేయండి. మీ బాధ్యతలు, ఆశయాలు మరింత ఎక్కువైనపుడు, మీరు ధ్యానం చేయవలసిన అవసరం కూడా మరింత ఎక్కువ అవుతుంది.
మీరు ఏ పనీ చేయకుండా ఉండేవారైతే, మీకు ధ్యానం అంత ఎక్కువ అవసరం కాకపోవచ్చు. మీరు తీరిక లేకుండా పనిచేస్తుంటే, మీకు ఖాళీ సమయం తక్కువగా ఉంటే, కోరికలు, ఆశయాలు ఎక్కువగా ఉంటే – మీరు ధ్యానం చేయాల్సిన అవసరం అయానం మీ ఒత్తిడిని, అలసటను దూరం చేయటమే కాదు, మీ నైపుణ్యాలను మెరుగుపరుస్తుందిం, నాడీవ్యవస్థను, మనసును బలోపేతం చేస్తుంది. శరీరంలోని మలినాలను నిర్మూలించి మనసుకు సాంత్వన చేకూర్చటంద్వారా ఒత్తిడిని, ఆందోళనను తొలగించటంలో సహాయం చేస్తుంది. అంతే కాదు, ధ్యానం మిమ్మల్ని అన్ని విషయాలలోనూ మెరుగైన సామర్థ్యం కలవారిగా తీర్చిదిద్దుతుంది. ఇంతకంటే మీకేం కావాలి? మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ధ్యానం చేయండి!
నా శరీరం సహకరించదు, నేను బాగా వంగి ఆసనాలు వేయలేను
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల లాభాన్ని పొందేందుకు మీరు తల క్రిందులుగా నిలబడి తపస్సు చేయాల్సిన అవసరం లేదు!
మా కోర్సులలో నేర్పే శ్వాస ప్రక్రియలు, ధ్యాన విధానాలకోసం మీరు ప్రత్యేకమైన శారీరక నైపుణ్యాలు అవసరం లేదు. అందువల్లనే ఈ ప్రక్రియలను ప్రపంచవ్యాప్తంగా, ఐదేళ్ల పిల్లల నుండి 90 సంవత్సరాల వృద్ధులవరకూ కోట్లాది ప్రజలు ఆచరిస్తున్నారు.
నాకు తీరిక లేదు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను
ఇప్పుడు బిజీగా ఉన్నారు, సరే. కాని మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? ఆనందం అనేది ఈ క్షణంలో మాత్రమే లభించేది. అయితే మన మనసు ఎప్పుడూ జరిగిపోయిన (భూత) కాలంలోకి, లేదా భవిష్యత్తులోకి ఊగిసలాడుతూ ఉండటం మనం సాధారణంగా గమనిస్తుంటాము. ఎప్పుడో మనకు జరిగినదానిని గురించి ఇప్పుడు బాధపడతాము, లేదా కోపం తెచ్చుకుంటాము, లేదా పరిస్థితులు రేపెలా మారుతాయో అని ఆందోళన పడుతూ ఉంటాము. మీ మనసును గమనించి చూడండి.
జాగ్రత్తగా గమనిస్తే, మనం మంచి పనులను వాయిదా వేస్తాము, కాని చెడుపనులను వాయిదా వేయము. “నా కోపాన్ని రేపటికి వాయిదా వేసుకుంటాను.” అని మీరెప్పడైనా అనుకున్నారా?
ఆనందంగా ఉండటాన్ని ఎప్పుడో భవిష్యత్తులోకి వాయిదా వేస్తారు, ఆ రోజు ఎన్నటికీ రాదు. మీరు ఈ క్షణంలో జీవిస్తే, రేపటి రోజును అదే చూసుకుంటుంది. ఇదే జీవించే కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్.
ఈ కార్యక్రమాలను ఎవరు సృజించారు?
ఆధ్యాత్మికవేత్తగా, విశ్వ మానవతావాదిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినగురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దీనిని సృజించారు. 1982వ సంవత్సరంలో భారతదేశంలోని షిమోగా పట్టణంలో 10 రోజుల మౌనంలో ఉన్నపుడు ఇది ఆవిర్భవించింది. గురుదేవుల మాటల్లో చెప్పాలంటే:
“నేను ఇప్పటికే అనేక దేశాలలో పర్యటించి, యోగ, ధ్యానం బోధించాను. అయినప్పటికీ, ప్రజలందరూ ఆనందంగా జీవించేందుకు వారికి ఏవిధంగా సహాయం చేయాలనే ఆలోచన నాలో ఎల్లప్పుడూ మెదులుతూ వచ్చింది. ఎక్కడో ఏదో లోపిస్తున్నదని నాకు అనిపించేది. ప్రజలు యోగ, సాధనలు చేస్తున్నప్పటికీ, ఆ సాధనలు, వారి లౌకిక జీవితం వేర్వేరు గదులలో ఉన్నట్లుగా ఉండేవి. సాధన చేసే సమయంలో కనిపించే వ్యక్తిత్వం వారి లౌకిక జీవనంలో కనిపించేది కాదు. వారి అంతరంగ ప్రశాంతతకు, బాహ్య జీవితానికి మధ్య ఉన్నఆ ఖాళీని ఎలా పూడ్చాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని.
పదిరోజులపాటు మౌనంగా ఉన్న ఆ సమయంలో సుదర్శన క్రియ స్ఫూర్తి నాలో కలిగింది. మనకు ఏది, ఎప్పుడు ఇవ్వాలో ప్రకృతికి తెలుసు. మౌనదీక్ష పూర్తయినాక నాకు తెలిసినదానిని ప్రజలకు నేర్పటం ప్రారంభించాను. దానివలన ప్రజలకు అద్భుతమైన అనుభవాలు కలిగాయి.”- గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
ఆ విధంగా ప్రారంభమైన శక్తివంతమైన, క్రమబద్ధమైన లయతో కూడిన సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలన్నిటికీ మూలస్తంభంగా ఉంటూ వచ్చింది. సుదర్శన క్రియ మొదటి కోర్సును గురుదేవులు స్వయంగా షిమోగాలో బోధించారు. ప్రాచీన విజ్ఞానాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణయోగ్యంగా తీర్చిదిద్ది నేర్పే ఈ కోర్సులో యోగ, ప్రాణాయామాలు, ధ్యానం చేర్చబడి, గత నాలుగు దశాబ్దాలుగా కోట్లాది ప్రజల దైనందిన జీవితంలో దీనిని విడదీయలేని భాగంగా మార్చివేశాయి.
దీని ఫలితాలు నాకు ఎంత కాలంలో తెలుస్తాయి?
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులన్నిటికీ మూలస్తంభంగా నిలిచేది సుదర్శన క్రియTM. సుదర్శన అంటే నేనెవరో తెలుసుకునే సరియైన దృష్టి. క్రియ అంటే మనల్ని స్వచ్ఛంగా, శుద్ధంగా మార్చే క్రియ. ఇది మన అంతరంగంలో ప్రశాంతతను పెంపొందించి, అదే సమయంలో మన శరీరంలోని అణువణువునూ శక్తివంతంగా చేస్తుంది. ఈ ప్రక్రియ మీ ఒత్తిడిని శక్తివంతంగా తొలగిస్తుంది. ఒక గంట సేపు సాగే మొట్టమొదటి సాధనతోనే ఈ శక్తి, ప్రాణశక్తి మీ అణువణువులో ప్రవేశించి లోలోతుల్లో ఎలా పరిశుభ్రం చేస్తుందో మీరు గమనిస్తారు. మీ శరీరంలోని ప్రతీ అణువూ పరిశుద్ధంగా, శక్తివంతంగా అయి, ప్రాణవాయువుతో నిండిపోతుంది.
చెడు ఆలోచనలు ఎలా కలుగుతాయో అని ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? వాటి మూలస్థానానికి వెళ్లి చూస్తే, ఆ చెడు ఆలోచనలు ఆందోళన, ఒత్తిడి వల్ల కలుగుతున్నాయని గమనిస్తారు. విశ్రాంతిగా, ఆనందంగా ఉన్న వ్యక్తికి చెడు ఆలోచనలు రావు. ఇది గమనించారా? వ్యక్తి ఎంత దుఃఖంలో ఉంటే, చెడు ఆలోచనలు అంత ఎక్కువగా కలుగుతాయి. దానిని తొలగించుకోవటం కోసం మంచి ఆలోచనలను దానిపై రుద్దటానికి బదులు, మీ అంతరంగపు లోతులోనికి వెళ్లండి. శ్వాస ఆధారంగా, ధ్యానం ఆధారంగా లోతుకు వెళ్లి వ్యవస్థను శుభ్రం చేసుకోండి. మీ మూలాలకు వెళ్లి, ఆ చెడు ఆలోచనల మూలకారణాన్ని తొలగించండి. దానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రత్యేకించి సుదర్శన క్రియతో ఇది వెనువెంటనే జరిగిపోతుంది. కేవలం రెండు రోజులపాటు, రోజుకు ఒక గంటసేపు చేసే అభ్యాసం మీ శరీరాన్ని ఎంతో పరిశుభ్రం చేసి మిమ్మల్ని ఎంతో తేలికగా చేస్తుంది.
మీరు రుసుము ఎందుకు తీసుకుంటారు?
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు ఖరీదైనవి కావు. రుసుము అనేది కేవలం ఆ కోర్సులు నిర్వహించేదుకు అయ్యే ఖర్చు మాత్రమే. కార్యక్రమాన్ని నిర్వహించే కార్యకర్తలు ప్రాంగణాన్ని అద్దెకు తీసుకోవాలి, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. కాబట్టి మీరిచ్చే రుసుములో కొంతభాగం ఖర్చులకు పోతుంది. మిగిలిన భాగం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించే సేవా కార్యక్రమాలకు వెచ్చించబడుతుంది.
అంతేకాక, ఈ కోర్సును ఉచితంగా అందిస్తే ప్రజలు దీని విలువను గ్రహించరు. స్థిరంగా హాజరై దీనిని నేర్చుకునే బాధ్యత తీసుకోరు.
ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం
మేము సంరక్షిస్తాము, మేము అందరితో పంచుకుంటాము
సమాజంపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రభావం
మూలాలను దృఢపరచుకోవటం, దృక్పథాన్ని విశాలం చేసుకోవటం, మానవాళికి సేవ చేయటం అనేవి ఆర్ట్ ఆఫ్ లివింగ్ మూలసూత్రాలు. బాలలకు విద్యాదానం నుండి నదుల పునరుజ్జీవనం రకు, రసాయన రహితమైన వ్యవసాయం నుండి వ్యాపారంలో నైతిక విలువలను పాటించడం వరకు, సంఘర్షణలను నివారించటం నుండి ప్రకృతి ఉత్పాతాలలో సహాయచర్యలవరకు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సేవ చేసేందుకు భారత, ఇతర దేశాల ప్రజలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చక్కని వేదికగా నిలిచింది.
జ్ఞానం
జ్ఞానంతో కూడిన ప్రేమ పరమానందం. జ్ఞానం లేని ప్రేమ కష్టతరం