మీరు సంకల్ప శక్తిని పెంచుకోవాలనుకుంటే, ప్రేమలో పడండి

మనకు ఏది సరైనదో మరియు ఏది మంచిదో తెలుసు. కానీ దీన్ని చేయడానికి సంకల్ప శక్తి లేదని మనము తరచుగా భావిస్తాము.
ఒకవేళ మీకు నిజంగా సంకల్ప శక్తి లేకపోతే, మీ సంకల్ప శక్తిని పెంచుకోవడం ఎలా  అని చదువుతూ కూడా మీరు ఇక్కడ ఉండరు. మీరు పనిలో పెట్టే  ప్రతీ  ఆలోచన మీకు కొంత సంకల్ప శక్తి ఉందని సూచిస్తుంది. “నేను లేచి పక్క గదికి వెళ్లాలనుకుంటున్నాను” అనే ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది మరియు మీరు దాన్ని అమలుచేస్తారు. అది సంకల్ప శక్తిని సూచిస్తుంది. సంకల్పం లేకుండా ఉండటం అసాధ్యం.
మీ మనస్సు ఏదో ఒక అలవాటు లేదా ఏవైనా ప్రలోభాలకు  అలవాటు పడినందున కొన్ని విషయాలు జరగకపోవచ్చు. అప్పుడు  మీరు “నాకు సంకల్ప శక్తి లేదు” అని భావిస్తారు. కానీ, మీకు సంకల్పం ఉన్నంత కాలం శక్తి ఉంటుంది.
మీకు సంకల్ప శక్తి లేదని మీరు చెప్పినప్పుడే, మీ చేతులకు తాళం వేసేస్తారు. మీరు  బలహీనులని మీ  నుదుటి మీద ముద్ర  వేసుకుంటారు.
దానికి బదులుగా, మీలోని శౌర్యాన్ని నిద్ర లేపండి. ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మీకు అవసరమైనప్పుడు మీ కోసం  శక్తి అంతా అందుబాటులో ఉంటుంది. మీకు మొత్తం బలం మరియు శక్తి ఉంది.

ఒకవేళ మీరు ముప్పై రోజులు ప్రాణాయామం చేస్తే ఒక మిలియన్ డాలర్లు వస్తాయని ఎవరైనా చెబితే, మీరు ఒక్క రోజు కూడా  చేయడం మానరు. మీరు నిద్ర మరియు ఆహారాన్నైనా మానేస్తారు   కానీ ప్రాణాయామం కాదు. అత్యాశ ఆ శక్తిని లోపలికి తీసుకురాగలదు. అదేవిధంగా భయం: మీరు ప్రాణాయామం చేయకపోతే మీరు జబ్బు  పడతారని ఎవరైనా చెబితే, మీరు ప్రాణాయామం ఒక్కసారి కూడా మానరు . సంకల్ప శక్తిని పెంచుకోవడానికి ప్రేమ, భయం మరియు దురాశలు మంచివి.

మిలియన్ డాలర్ ప్రశ్న

మీరు ఒక నెల లేదా 30 రోజులు ధూమపానం చేయకపోతే మీకు 10 మిలియన్ డాలర్లు లేదా 10 మిలియన్ యూరోలు లభిస్తాయని ఎవరైనా మీకు చెప్పారని అనుకుందాం. అప్పుడు మీరు ఇలా అంటారు, “  30 రోజులే ఎందుకు? కొన్ని నెలలు 30 రోజులు, కొన్ని నెలలు 31 రోజులు,   ఫిబ్రవరిలో అయితే తక్కువ రోజులు ఉంటాయి. నాకు డబ్బు తప్పక వస్తుందని నిర్ధారించుకోవడానికి, నేను 35 రోజులు పొగ త్రాగను”.

అహం లేదా ప్రేమ, భక్తి లేదా దురాశ లేని వ్యక్తికి తక్కువ సంకల్ప శక్తి ఉంటుంది.

– గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

మీరు మీ అలవాటు కంటే  వేరే ఇంకొక దానికి ఎక్కువ విలువిస్తే , మీరు దానిని పొందుతారని మీకు తెలిసినప్పుడు, అలవాటు క్షీణిస్తుంది. ఎయిడ్స్‌ భయంతో వ్యభిచారం చాలా వరకు తగ్గింది. అదేవిధంగా, ఉన్నతమైన కారణానికి, చిన్న చిన్న ఆకర్షణలను అధిగమించడంలో మీ నిబద్ధత మీకు సహాయపడుతుంది.
ఏది మంచిదో, ఏది  చేయవలసినదో, బుధ్ధిని ఉపయోగించి  తెలుసుకోవడం వలన మీరు దానిని తేలికగా  తీసుకోగలరు. అప్పుడు మీరు మీ సౌకర్యవంతమైన స్థితిని  ఎంచుకోవచ్చు. అందువలన మీ  సంకల్ప శక్తి తగ్గిపోతుంది. ఆ స్థితిలో మనస్పూర్హిగా మీ  శౌర్యాన్ని పెంపొందించుకోవడం,లేదా మీ హృదయంతో దేనినైనా ప్రేమించడం,చేయండి. అంకితభావంతో, మీరు చెయ్యాలనుకునే పనికి, భయం లేదా దురాశ  మీ సంకల్ప శక్తిని పెంచుతుంది.
అహంభావం గల వ్యక్తులకు ఒక విధమైన శక్తి  ఉంటుంది. వారిని మాటమీద నిలబడేటట్లు చేసి బద్ధకం నుండి బయటపడ వేయటం సులభం. అహం లేని వ్యక్తులు చాలా ప్రేమ మరియు. సమర్పణా భావంతో ఉంటారు. సంకల్ప శక్తిని, పెంపొందించుకోవడం వారికి చాలా సులువు. అహం లేదా ప్రేమ, భక్తి లేదా దురాశ లేని వ్యక్తకి తక్కువ సంకల్ప శక్తి ఉంటుంది.  అత్యాశ లేదా భయం పెంచుకోండి. లేదా మీ ప్రేమను మరియు సమర్పణ భావాన్ని పెంచుకోండి . నిజమైన జ్ఞానంతో, మీరు పరాక్రమాన్ని పెంచుకోవచ్చు.

బద్ధకం ఎప్పుడు వేచి ఉండగలదు

బద్ధకమే  మీకు సంకల్ప శక్తి లేదని మీరు భావించేలా చేస్తుంది. రేపు ఉదయం 6 గంటలకు నిద్రలేచి ప్రాణాయామం చేయాలని మీరు నిర్ణయించుకున్నారని అనుకుందాం. కానీ ఉదయం మీరే ఇలా చెప్పుకుంటారు, “ఓహ్, చాలా చల్లగా ఉంది. నేను రేపు లేదా ఈ రాత్రి చేస్తాను” . మీరు  మీ మనస్సు అలసిపోయి, మీరు తినే  అలవాట్లు తప్పుగా ఉన్నందు వల్ల ఇది జరుగుతుంది. మీరు విసుగు చెంది, దాని గురించి ఏదైనా చేయడానికి మంచం నుండి దూకినప్పుడు ఇది ఒక శిఖరాగ్రాన్ని చేరుకుంటుంది.
ఏదో ఒక రోజు, మీరు సోమరితనంతో విసుగు చెందుతారు. అక్కడ నిప్పు ఉందని ఎవరైనా చెబితే   మీ సోమరితనం నశిస్తుంది. అత్యవసర పరిస్థితి  మీ సోమరితనాన్ని దూరం చేస్తుంది. లేదా మీ అంతరంగంలో  ఏదో ముడి విడిపోతుంది . మీ అంతరంగంలో ప్రేమ భావం పెరిగినప్పుడు   సోమరితనం అదృశ్యమయి ,మీరు ఏదైనా  విషయం లేదా వ్యక్తి  పట్ల మక్కువ కలిగి ఉండటం మరియు మీరు అకస్మాత్తుగా మేల్కొని, శక్తివంతంగా ఉండటాన్ని గ్రహిస్తారు . ప్రేమ, భయం లేదా దురాశ ద్వారా మీరు సోమరితనాన్ని అధిగమించవచ్చు. వీటిలో ఏదైనా లోపిస్తే, మీరు వాయిదా వేస్తారు. ఒకవేళ మీరు వాయిదా వేస్తూ ఉంటే, ఏదో ఒక సమయంలో భయం వస్తుంది. అప్పుడు భయంతో మీరు పని చేయడం ప్రారంభిస్తారు.
వాయిదా వేయడం  వదిలించుకోవడానికి ప్రేమ ఒక మెరుగైన మార్గం. మీరు మీ సోదరుడు లేదా మీ మేనకోడలును ఉదయాన్నే విమానాశ్రయం నుండి తీసుకు వస్తానని వాగ్దానం చేశారనుకుందాం. మీకు  ఉదయాన్నే బద్ధకంగా అనిపించవచ్చు కానీ వారిమీద ఉన్న ప్రేమ వలన , మీరు నిద్ర లేచి, పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని కలుసుకుంటారు. మీరు ప్రేమ వలన ఈ శక్తిని పొందుతారు.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity

     
    *
    *
    *
    *
    *