ఆధ్యాత్మికత అనేది భిన్నమైన వ్యక్తులకు వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది దీనిని మతంతో సంబంధం కలిగినదిగా, కొంతమంది ప్రకృతి లేదా మహా శక్తితో సంబంధం కలిగినదిగా, ఇంకొంతమంది స్వీయ అంతరంగంతో సంబంధమని నమ్ముతారు. మీరు ఎలా అవగాహన చేసుకున్నప్పటికీ ఆధ్యాత్మికత యొక్క ప్రయోజనాలు చాల ఉన్నాయి. మీలో సకారాత్మక పరివర్తనను ప్రేరేపించడం నుండి జీవితం పట్ల ఎక్కువ సంతృప్తి కలిగి ఉండేటట్లు చేయడం వరకు ఆధ్యాత్మికత భిన్న దృక్కోణాలను కలిగి ఉంటుంది.
ప్రచీన భారతీయ నాగరికతలో సైన్స్ మరియు ఆధ్యాత్మికత ఎప్పుడూ విభేదించలేదు కానీ జీవితం యొక్క వివిధ కోణాలను ఒకటి శారీరకంగా మరియు ఇంకొకటి సూక్ష్మంగా తీర్చిదిద్దుతుంది. అవి ఒకదానికొకటి విరుద్దమైనవి కావు కానీ పరిపూరకాలు. సరియైన జీవనానికి మరియు మన గుర్తింపును గ్రహించడానికి ఆధ్యాత్మికత చాలా అవసరం.
విషయాన్ని అర్ధం చేసుకోవడం సైన్స్. “నేను ఎవరు” అని అర్ధం చేసుకోవడం ఆధ్యాత్మికత
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్
ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం
అన్నింటి తర్వాత, మనకు తెలిసినా, తెలియకపోయిన ఆధ్యాత్మికత మన గుర్తింపు కాదా ? ఆధ్యాత్మికత మన అంతర్గత మూలానికి కనెక్ట్ అయ్యి ప్రస్తుత క్షణంలో ఆనందం మరియు సంతృప్తికరమైన జీవితం గడపడానికి సహాయం చేస్తుంది.
మీరు జీవితానికి అర్ధం అన్వేషిస్తున్నారా?
మీరు ఆ శాశ్వతమైన ఓదార్పు కోసం ఎదో ఒక దారిలో ఆకలితో ఉన్నారా?
మీరు ప్రార్ధన మరియు ధ్యానం చేస్తున్నప్పుడు శాంతి లభిస్తుందా?
ఇతరుల పట్ల దయ చూపినప్పుడు మరియు ఇతరులకు సహాయం చేసినప్పుడు లోతైన సంతృప్తిని అనుభవిస్తున్నారా?
గొప్ప శక్తికి సమర్పణ చేసినప్పుడు భద్రతా భావం అనుభవిస్తున్నారా?
ఒకవేళ పై ప్రశ్నలకూ దేనికైనా అవును అని సమాధానమిస్తే మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా జీవించడానికి ఆధ్యాత్మికత తప్పనిసరి.
ఆత్మను పోషించేది ఏదైనా అది ఆధ్యాత్మికత. సరియైన నిద్ర, కొంత జ్ఞానం, మరియు మీ దృష్టిని విస్తరించేది ఇవన్నీ ఆధ్యాత్మికతలో భాగమే. ఆనందకరమైన నాగరిక జీవనానికి ఇవన్నీ అవసరం.
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్
ఆధ్యాత్మిక సాధన మెరుగుపరచడానికి 7 మార్గాలు
- ధ్యానం
ధ్యానం మీ చుట్టూ ఉన్న విషయాలను బుద్ధిపూర్వకంగా చేయడంలో సహాయపడుతుంది. అది మీ ఇంద్రియాలను శాంతపరుస్తుంది మరియు పరిస్థితులకు మీ ప్రతిచర్యను మెరుగు పరుస్తుంది . 5 నిముషాలు ధ్యానం చేసిన కూడా ఒత్తిడి, ఆందోళన, మరియు నకారాత్మక భావాలైన కోపం, బాధ, అహంకారం, అసూయ మొదలైన వాటితో పోరాడటానికి సహాయం చేస్తుంది. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, మీ చుట్టూ ఉన్న విషయాలు తెలుసుకోవడం, మీరు ఏమి చేస్తున్నారు లాంటి చిన్న వివరాలు మైండ్ ఫుల్ నెస్ సాధనకు మార్గాలు. ధ్యానం ద్వారా మైండ్ ఫుల్ నెస్ బాగా మెరుగుపడుతుంది.
- యోగా మరియు ప్రణాయామం
యోగా మనల్ని శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా తయారుచేస్తుంది మరియు శక్తిని పెంచుతుంది. తద్వారా మన స్వీయ అంతరంగానికి కనెక్ట్ కావడానికి సహాయం చేస్తుంది. కోర్ ని బలోపేతం చేయడం ద్వారా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అందించడానికి యోగా ఒక గొప్ప పద్దతి. ప్రాణాయామం శ్వాసను మెరుగుపరుస్తుంది, అవగాహనను పెంచుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి పొందాలనుకుంటే యోగా మరియు ప్రాణాయామం అతి ముఖ్యం.
- దయ మరియు క్షమ
మీరు మీ జీవితాన్ని భౌతిక ఆనందాలకు దూరంగా ఆధ్యాత్మికత వైపు దిశా నిర్దేశం చేసినప్పుడు దయ, క్షమ మరియు ప్రేమ లను సాగు పండిస్తారు . మీరు ఇతరులను వేరుగా చూడనందున వారిపట్ల శ్రద్ధ వహిస్తారు. స్వంతం అనే భావన అభివృద్ధి చెందుతుంది, క్రమంగా అందరిని కలిపి ఉంచే దివ్య దారాన్ని (దివ్య చైతన్యం) తెలుసుకుంటారు.
ప్రపంచంలోని ప్రజలందరితో స్వంతం అనే భావన కలిగించేదే ఆధ్యాత్మికత.
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్
- సంతృప్తి మరియు కృతజ్ఞత
కృతజ్ఞతను సాధన చేయండి మరియు మీ వద్ద లేని దాని గురించి ఫిర్యాదు చేయడం కంటే మీకు ఇచ్చిన దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక దృక్పథంలో సంతృప్తిగా ఉన్న వ్యక్తి అత్యంత ధనవంతుడిగా పరిగణించబడతాడు. జీవితంలోని చాలా దశలలో దిగి మరియు విలాసాల కోసం తపించడంలో ప్రజలు కొన్నిసార్లు ప్రతిదీ ఒక రోజు అదృశ్యమైపోతుందని మర్చిపోతారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోవడం మరియు ఎల్లప్పుడూ మీకు ఉన్నదాని కోసం కృతజ్ఞతతో ఉండడం సమృద్ధిని పండించడంలో సహాయ పడుతుంది మరియు సంతృప్తికరమైన జీవితానికి నడిపిస్తుంది.
కృతజ్ఞత మీలో నిలిచినప్పుడు, ఆ కృతజ్ఞత మీ నుండి బయటకు దయగా ప్రవహిస్తుంది.
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్
- లయబద్దమైన శ్వాస
సుదర్శన క్రియ లాంటి లయబద్దమైన శ్వాస పద్ధతులు ఊపిరితిత్తులను విస్తరించడానికి సహాయం చేస్తాయి, ఒత్తిడి సంకెళ్ళ నుండి మీకు స్వేచ్ఛనిస్తాయి మరియు జీవితం యొక్క ప్రకాశవంతమైన వైపు చూడటానికి అనుమతిస్తాయి. అది మీ చైతన్యాన్ని పెంచుతుంది మరియు మిమ్మల్ని మరింత నమ్మకంగా, శాంతియుతంగా మరియు వర్తమానంపై కేంద్రీకృతంగా ఉండేటట్లు తయారుచేస్తుంది. అదొక్కటే కాకూండా, సుదర్శన క్రియ అనారోగ్యం నుండి మెరుగ్గా నయం చేస్తుంది మరియు వ్యాధి నిరోధకతను మెరుగుపరుస్తుంది.
- నిస్వార్ధ సేవ
నిస్వార్ధ సేవ ఆధ్యాత్మికత లో ఒక ముఖ్యమైన భాగం. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సాధన అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.మీరు ఒక కారణం సికొరకు స్వచ్చందంగా ఎంచుకోవచ్చు మరియు ఇతర ప్రజలకు సహాయం చేయవచ్చు. వెనుకబడిన వారికి సహాయం చేయడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం లోతైన తృప్తిని తీసుకొస్తుంది. అది మీరు ఎంత అదృష్టవంతులో కుడా చూపిస్తుంది. మరియు మిమ్మల్ని స్థిరంగా, వినయపూర్వకంగా ఉంచుతుంది.
ఇంకొకరి మానసిక స్థితిని ఉద్ధరించడం సేవ యొక్క ఉత్తమ రూపం.
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్
- లోపలికి చూడండి
మీ శక్తిని మెరుగ్గా ప్రాసెస్ చేయడానికి మరియు రూపాంతరం చెందించడానికి ఏమి సహాయం చేస్తుందో తెలుసుకోవడానికి లోపలి చూడండి. అది జర్ణలింగా? పాడడం, పెయింటింగ్, నృత్యం లాంటి అభిరుచా? ప్రజలు పర్వతాలకు ప్రయాణిస్తారు మరియు ప్రకృతితో సమయం గడుపుతారు. అది చికిత్సాపరమైనది అని చెప్తారు. నమ్మకమైన వ్యక్తులతో మీ భావోద్వేగాలను పంచుకోండి. ఆధ్యాత్మికత యొక్క అర్ధం కనుగొనడానికి మీ ఓదార్పు టెక్నిక్ ఏమిటో తెలుసుకోవడానికి మీ లోపలి చుడండి మరియు దానిని కొనసాగించండి.
ముగింపు నోట్
జీవితంలోని చిన్న మరియు పెద్ద ఎదురుదెబ్బలకు పడిపోకుండా ఆధ్యాత్మిక బలం సహాయం చేస్తుంది. మానవ జీవితానికి పరస్పర సంబంధం ఉందని మరియు ఈ యుద్ధంలో మీరు ఒంటరి కాదని ఆధ్యాత్మికతతో అర్ధం చేసుకుంటారు. మీరు జీవితాన్ని మంచిగా అంచనా వేస్తారు మరియు సరియైన విలువలతో ప్రయోజనవంతంగా జీవిస్తారు. జీవితంలోని సమస్యలపై విజయం సాధించడం కంటే వాటి నుండి పారిపోవడం, ఏది మంచిది?
మీ నుండి ఎవరూ తీసికెళ్లలేని ఆనందాన్ని తీసుకురావడమే ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం.
– గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్











